Jump to content

టిల్లీ అల్సెన్

వికీపీడియా నుండి
Tillie Olsen
టిల్లి అల్సెన్
Olsen in 2001/ 2001
పుట్టిన తేదీ, స్థలంJanuary 14, 1912/జనవరి 14, 1912
మరణంJanuary 1, 2007 (aged 94)/ జనవరి 1, 2007

చిన్నప్పుడే కథలు వ్రాయడము ప్రారంబించి, తర్వాత  20 ఏండ్లపాటు రచనా వ్యాసంగానికి దూరంగా వుండి, గ్రంథాలయాలనే విద్యాలయాలుగా వాడుకొని, పేదరికము, ఒంటరితనము, నిస్సహాయతలను కథావస్థువులుగా రచనలు చేసి ఎందరికో ఆదర్శంగా నిలచిన ధీర వనిత టిల్లీ ఆల్సెన్.

తల్లిదండ్రులు

[మార్చు]

టిల్లీ ఆల్సెన్ తల్లిదండ్రులు విఫలమైన 1905 రష్యన్ విప్లవంలో పాల్గొన్నారు. అధికారుల కళ్ళు గప్పి అమెరికాకు కాందిశీకులుగా వచ్చారు. వారు మొదట నెబ్రాస్కాలో వ్వవసాయం ప్రారంభించారు. పంటలు పండలేదు. పొట్ట కూటికోసం ఒమాహో చేరారు. అక్కడ అనేక కూలి పనులు చేసుకుంటూ నెబ్రాస్కా సోషలిస్టు పార్టీకి స్టేట్ సెక్రట్రీ వరకు ఎదిగాడు ఆమె తండ్రి. అప్పుడే నెబ్రాస్కాలోనే పుట్టింది టిల్లీ. టిల్లీ తల్లి పేరు ఇడా. ఈమె నిరక్ష్యరాస్యురాలు. తనలో విప్లవ భావాలు ప్రవేశ పెట్టింది తన తల్లే నంటుంది టిల్లీ.

బాల్యము

[మార్చు]

పేదరికములో వున్నటిల్లీ పదిహేనవ ఏటనే స్కూలు మానేసి కుటుంబ పోషణ కొరకు సంపాదనలో పడింది. యంగ్ కమ్యూనిస్ట్ లీగ్ లో చేరి కాన్సాస్ నగరంలోని గిడ్డంగి కార్మికుల సమస్యల కొరకు ఉద్యమించింది. తన 19వ ఏట పేద కార్మికుల గురించి 'యోనోండియే' అనే నవల ప్రారంబించి, నాలుగు అద్యాయాలు వ్రాసి మానేసింది. ఆ సమయంలోనే ఆమెకి పెళ్ళిజరిగింది. కాని వారి పేదరికాన్ని భరించలేని ఆమె భర్త, భార్యా పిల్లల్ని వదిలేసి ఎటో వెళ్ళి పోయాడు.

పెళ్ళి

[మార్చు]

1936లో ఆమె జాక్ అల్సెన్ ను రెండో పెళ్ళి చేసుకుంది. వారికి ముగ్గురు పిల్లలు కలిగారు. పిల్లల పెంపకము, రాజకీయాలతో సమయము దొరకక, తన రచనా వ్యాసంగాన్ని పక్కన పెట్టింది. బ్రతుకుతెరువు కొరకు ఒక ప్యాక్టరీలో పనిచేసింది. 1953లో తన చివరి కూతురు స్కూలుకు వెళ్ళింతర్వాత తాను వదిలేసిన రచనా వ్యాసంగాన్ని తిరిగి ప్రారంబించింది.

రచనావ్యాసంగము

[మార్చు]

1955 1956 కకీ స్టోన్ ఫోర్డ్ యూనివర్శిటీ ఫేలో షిప్ రాగా...... 1972 లో అచ్చయిన రెబెకా హార్టింగు డేవిస్ నవల లైఫ్ ఇన్ ది మిల్శ్' కు రాసిన ఉపోద్ఘాతం స్త్రీవాద, కార్మిక ఉద్యమాల్లో గొప్ప సంచలనం కలిగించింది. ఆ తర్వాత రెండేళ్ళకు తాను చిన్నప్పుడు అర్థాంతరంగా నిలిపేసిన 'యోనోడియో' పూరించి ప్రచురించింది.

ఇతర రచనలు

[మార్చు]

'ఐ స్టాండ్ హియర్ ఐరనింగ్' తో సహా ఆమె వ్రాసిన నాలుగు కథలూ వందలాది కథా సంకలనాల్లో చేరాయి. అవి ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లోకి అనువదించ బడ్డాయి. తాను ఎక్కువగా చదువుకోక పోయినా, పేదరికము అనుభవిస్తున్నా... పేదరికము, ఒంటరితనము, నిస్సహాయతా వంటి కథా వస్తువులను ఎన్నుకొని రచనలు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచిన ధీర వనిత టిల్లీ ఆల్సెన్. 'రిడిల్ కథలో ఒక పివ్లవ తరం గురించి వ్రాశారు. ఆమె వ్రాసిన వ్యాస సంకలనము సెలెన్స్ స్" 1978లో అచ్చయింది. 1961 లో "టెల్ మీ అ రిడిల్ " 1961 లో అచ్చయింది.

ప్రత్యేక గౌరవము

[మార్చు]

అతి తక్కువగా వ్రాసి అత్యంత గౌరవము సంపాదించిన రచయిత్రి టిల్లీ ఆల్సెన్. సాటి రచయితలకు ఆమెపట్ల ఆరాధన భావం కలిగివుంటారు. రచయిత్రులయిన స్త్రీలకున్న సమస్యలనేకం. ఉద్యోగం చెయ్యాలి., సంపాదించాలి, పిల్లల ఆలనా పాలనా చూడాలి, రోజువారి చాకిరీతో పాటు రచనకు కూడా కొంత సమయము కేటాయించాలి.... ఈమె భావన.

చివరి రోజులు

[మార్చు]

కాలిఫోర్నియాలో తన చిన్నకూతురు చెంతకు చేరునంతవరకు, శాన్ ఫ్రాన్సిస్కో లోనే తన 85 వ ఏటివరకు గడిపింది. ఆల్సెన్ 2007, జనవరి 1 న మరణించింది.

పరిశోధనా వనరులు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]