అటావా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అటావా [Ottawa]
నగరము
సిటీ ఆఫ్ అటావా
Ville d'Ottawa
పార్లమెంటు హిల్ పై సెంట్రల్ బ్లాక్, అటావాలోని జాతీయ యుద్ధ స్మరకం, నేషనల్ గ్యాలరీ ఆఫ్ కెనడా మరియు రీడూ కెనాల్ మరియు లారియర్.
పార్లమెంటు హిల్ పై సెంట్రల్ బ్లాక్, అటావాలోని జాతీయ యుద్ధ స్మరకం, నేషనల్ గ్యాలరీ ఆఫ్ కెనడా మరియు రీడూ కెనాల్ మరియు లారియర్.
Flag of అటావా [Ottawa]
Flag
Coat of arms of అటావా [Ottawa]
Coat of arms
Nickname(s): Bytown
Motto: "Advance-Ottawa-En Avant"
Written in the two official languages.[1]
Location of Ottawa in the Province of Ontario
Location of Ottawa in the Province of Ontario
Ottawa is located in Canada
Ottawa
Location of Ottawa in Canada
భౌగోళికాంశాలు: 45°25′15″N 75°41′24″W / 45.42083°N 75.69000°W / 45.42083; -75.69000
దేశం కెనడా
Province Ontario
Region National Capital Region
స్థాపితం 1826 as Bytown[2]
Incorporated 1855 as City of Ottawa[2]
Amalgamated 1 జనవరి 2001
ప్రభుత్వం
 • Mayor Jim Watson
 • City Council Ottawa City Council
 • MPs
 • MPPs
విస్తీర్ణం[3][4]
 • నగరము 2,778.13
 • Urban 501.92
 • Metro 5.00
Elevation  m ( ft)
జనాభా (2011)[3][4]
 • నగరము 883
 • సాంద్రత 316.6
 • Urban 933
 • Urban density 1.1
 • Metro 1
 • Metro density 196.6
సమయప్రాంతం Eastern (EST) (UTC−5)
 • Summer (DST) EDT (UTC-4)
Postal code span K0A, K1A-K4C[1]
Area code(s) 613, 343
Website www.ottawa.ca

కెనడా రాజధాని అటావా ఆ దేశంలోని నాల్గవ పెద్ద నగరం. ఇది అటావా నది కి ఉత్తర దిశలోగల ఈ నగరం. ఇద్ 1826లో స్థాపించబడింది. స్థానిక రెడ్ ఇండియన్ భాషలో దీని అర్థం వ్యాపారం చేయటం (టు ట్రేడ్). 2778 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోగల ఈ నగర జనాభా సుమారు 9 లక్షలు. ఇది నార్త్ సౌత్ అమెరికా ఖండాల్లో అత్యంత సుఖవంతంగా నివసించగలిగే రెండో నగరం మరియు ప్రపంచంలో ఇలాంటి పధ్నాలుగో నగరం. ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఇది మూడవది. కెనడాలో ఇది రెండవ పరిశుభ్ర నగరం.

ఇక్కడ చూడదగ్గ విశేషాలు[మార్చు]

డైఫెన్ బంకర్:[మార్చు]

న్యూక్లియర్ దాడి జరిగినప్పుడు దాక్కునేందుకు సృష్టించబడిన అండర్‌గ్రౌండ్ బంకర్ నేడు పర్యాటక స్థలమైంది. వార్‌రూమ్, ఎమర్జెన్సీ బ్రాడ్‌కాస్టింగ్ స్టూడియో, ప్రధాన మంత్రి దాక్కునే ప్రదేశం మొదలైనవి ఇక్కడ చూడొచ్చు. దీన్ని 1960లలో నిర్మించారు. ప్రతీ మూడవ మంగళవారం ఈ బంకర్‌లో రష్యా, అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నేపథ్యంలో తీసిన ఓ సినిమాని ప్రదర్శిస్తారు.

చైనా టౌన్:[మార్చు]

ఇక్కడి రెస్టారెంట్స్ భోజన ప్రియులని ఆకర్షిస్తాయి. ది షాంఘై రెస్టారెంట్‌లో ముందే బుక్ చేసుకోకపోతే శనివారం రోజు సీటు దొరకదు. ‘జెన్ కిచెన్’ అనే రెస్టారెంట్ వీగన్ రెస్టారెంట్ అంటే పాల పదార్థాలు, ఎగ్స్, మాంసం లేకుండా కేవలం కూరగాయలు, పళ్లతో వండే పదార్థాలే ఇక్కడ లభ్యమవుతాయి. స్మోకీ టొమేటో పూరీ, హార్స్ రేడిష్ క్రీమ్ (ఉలవచారు లాంటిది) పాండాంట్ పొటాటోస్ మొదలైన ఆహార పదార్థాలు రుచిగా ఉంటాయి.

హాయ్ అటావా హాస్టల్:[మార్చు]

ఇది ఒకప్పటి జైలు. దీన్ని హోటల్‌గా మార్చారు. (19వ శతాబ్దంలో ఈ నగరం నార్త్ అమెరికాలోని అత్యంత ప్రమాదకరమైన నగరంగా ఉండేది) ఆనాటి సెల్స్‌ని నేడు హోటల్ గదులుగా మార్చి అద్దెకిస్తున్నారు. ప్రపంచంలోని పది వింతయిన హోటల్స్‌లో ఒకటిగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇందులోని ‘మగ్‌షాట్స్’ అనే బార్‌ని చాలామంది పర్యాటకులు సందర్శిస్తారు. వేరే హోటల్‌లో గది ఉన్నా, ఓ రాత్రికి ఇక్కడ గది అద్దెకి తీసుకుని పడుకుంటుంటారు.

హాంటెడ్ వాక్:[మార్చు]

1995 నించి ఓ పర్యాటక సంస్థ అటావాలోని అపూర్వమైన చారిత్రాత్మక భవంతుల్లోకి, సాయంత్రాలు వాకింగ్ టూర్‌కి తీసుకెళ్తుంది. ఆ భవంతుల్లో దెయ్యాలు సంచరిస్తున్నాయని ప్రతీతి. గైడ్ ఆ కథలు చెస్తూ మంద్రమైన కాంతిగల ఆ గదుల్లోకి తీసుకెళ్తాడు. పూర్వం మరణశిక్ష అమలుపరిచి ఓ భవంతిలోని ఎనిమిదవ అంతస్థులోకి కూడా తీసుకెళ్తారు. గైడ్ నల్లటి దుస్తులు ధరించి చేతిలో లాంతరుతో నడుస్తాడు. (ఈ టూర్లు అంటారియో, కింగ్‌స్టన్ నగరాల్లో కూడా ఉన్నాయి) రాత్రి ఏడు నించి ఎనిమిదిన్నర దాకా ఈ టూర్లు నిర్వహించబడతాయి.

పార్లమెంట్ బిల్డింగ్:[మార్చు]

పార్లమెంట్ హిల్‌గా పిలవబడే ఇది క్రౌన్‌లాండ్ అనే చోట డౌన్‌టౌన్‌లో ఉంది. 1859లో నిర్మించబడ్డ దీన్ని ఏటా 30 లక్షల మంది సందర్శిస్తారు. 18వ శతాబ్దంలో తొలుత ఇది మిలిటరీ బేస్‌గా ఉండేది. క్వీన్ విక్టోరియా అటావాని (అప్పటి పేరు బైటౌన్) కెనడా రాజధానిగా ఎంపిక చేశాక, ఇక్కడ పార్లమెంట్ భవంతిని నిర్మించారు. 1927లో పీస్ టవర్‌తో దీని నిర్మాణం పూర్తయింది. 1916లో ఇది అగ్ని ప్రమాదానికి గురై ఆ తర్వాత పునర్ నిర్మించబడింది. ఇక్కడ 2000 సంవత్సరంలో విక్టోరియా టవర్ బెల్‌ని ఆవిష్కరించారు. ఉదయం తొమ్మిది నించి మధ్యాహ్నం రెండున్నర దాకా గైడెడ్ టూర్ సదుపాయం ఉంది.

అటావా యూనివర్సిటీ:[మార్చు]

ఇక్కడ చూడదగ్గ మరో విశేషం - అటావా యూనివర్సిటీ భవంతుల సముదాయం. 147 సంవత్సరాల క్రితం -1865లో స్థాపించబడిన ఇందులో నేడు ఏడువేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ యూనివర్సిటీకి చెందిన కాలేజీలు అమెరికాలోని అనేక నగరాల్లో కూడా ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల నించి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. 20 వేల ఎకరాల్లో గల ఈ యూనివర్సిటీని చూడటానికి ఒక పూట కేటాయించాలి. కెనడియన్ మ్యూజియం ఆఫ్ సివిలిజేషన్: కెనడా చరిత్రకి సంబంధించిన వస్తువులని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడి గ్రాండ్ హాల్‌ని ‘అడవి, సముద్ర తీరాల్లా’ అలంకరించి, ఆదిమ వాసుల సంస్కృతిని ప్రదర్శిస్తారు. ఈ మ్యూజియంలో ఎక్కడా మూలలు ఉండవు. ఎందుకంటే, ఆదివాసులు మూలల్లో దయ్యాలు దాక్కుంటాయని నమ్మేవారు. ఇంకా ఇక్కడ బైటౌన్ మ్యూజియం, కెనడియన్ మ్యూజియం ఆఫ్ నేచర్, రాయల్ కెనడియన్ మింట్ మ్యూజియం, కెనడా ఏవియేషన్ అండ్ స్పేస్ మ్యూజియం, కెనడా వార్ మ్యూజియం, కెనడా సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం, అగ్రికల్చర్ మ్యూజియం, నేషనల్ గేలరీ ఆఫ్ కెనడా (కళా వస్తువుల ప్రదర్శన) మొదలైన మ్యూజియాలు చూడదగ్గవి.

రవాణా సౌకర్యం[మార్చు]

అమెరికా నించి, ఇండియాలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల నించి అటావాకి విమాన సర్వీసులు ఉన్నాయి. ఫిబ్రవరి, మే నించి అక్టోబర్ దాకా అనుకూలం. ఆగస్టు నించి స్వెట్టర్స్ తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవడం మంచిది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Art Montague (2008). "Ottawa Book of Everything" (PDF). MacIntyre Purcell Publishing. Retrieved 14 July 2011. 
  2. 2.0 2.1 Justin D. Edwards; Douglas Ivison (2005). Downtown Canada: Writing Canadian Cities. University of Toronto Press. p. 35. ISBN 978-0-8020-8668-6. 
  3. 3.0 3.1 "Population and dwelling counts, for Canada and census subdivisions (municipalities), 2006 and 2011 censuses — 100% data". Statistics Canada. Retrieved 10 February 2010. 
  4. 4.0 4.1 "Population and dwelling counts, for census metropolitan areas, 2006 and 2011 censuses - 100% data". Statistics Canada. 5 November 2008. Retrieved 23 September 2011. 
  5. "City of Ottawa - Design C". Ottawa.ca. 20 May 2010. Retrieved 26 October 2011. 
  6. "Rapport au / Report to:". Ottawa.ca. 2011. Retrieved 26 October 2011. 

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అటావా&oldid=2195939" నుండి వెలికితీశారు