ప్రాగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెట్రిన్ టవర్ నుండి ప్రాగ్ నగర దృశ్యం

ప్రాగ్ (ఆంగ్లం: Prague) చెక్ రిపబ్లిక్ దేశపు రాజధాని, అతిపెద్ద నగరం. యూరోపియన్ యూనియన్ లో 13వ అతిపెద్ద నగరం.[1] బొహేమియా చారిత్రక రాజధాని. ఇది వుల్టవ నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో సుమారు 13 లక్షల మంది నివసిస్తున్నారు. మెట్రోపాలిటన్ ఏరియాను కూడా కలుపుకుంటే ఇందులో 27 లక్షల మంది జీవిస్తున్నారు.[2] నగరంలో వెచ్చని వేసవి, చల్లని శీతాకాలంతో కూడున సమశీతోష్ణ సముద్ర వాతావరణం ఉంది. చారిత్రాత్మక నగరమైన ప్రాగ్ మధ్య ఐరోపాలో పేరొందిన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక కేంద్రం.

రోమనెస్క్ సమయంలో స్థాపించబడిన ఈ నగరం, గోతిక్, సాంస్కృతిక పునరుజ్జీవన, బరోక్ యుగాలలో అభివృద్ధి చెందింది. ప్రేగ్ చారిత్రాత్మక బోహేమియా రాజ్యానికి రాజధాని. నాలుగవ చార్లెస్ (r. 1346-1378) లాంటి అనేక పవిత్ర రోమన్ చక్రవర్తుల ప్రధాన నివాసం ఈ నగరం.[3]

ప్రాగ్ అనేక సాంస్కృతిక ఆకర్షణలకు నిలయం, వీటిలో చాలా వరకు 20 వ శతాబ్దపు ఐరోపా హింస, విధ్వంసం నుండి మనగలిగాయి. ప్రేగ్ క్యాజిల్, చార్లెస్ బ్రిడ్జ్, ఓల్డ్ టౌన్ స్క్వేర్, ప్రాగ్ ఆస్ట్రానామికల్ క్లాక్, జూయిష్ క్వార్టర్, పెట్రిన్ హిల్ మొదలైనవి ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. 1992 నుండి, ప్రాగ్ యొక్క విస్తృతమైన చారిత్రక కేంద్రం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడింది.

నగరంలో పదికి పైగా ప్రధాన సంగ్రహాలయాలు ఉన్నాయి. వాటితో పాటు అనేక థియేటర్లు, గ్యాలరీలు, సినిమాస్ ఇంకా ఇతర చారిత్రక ప్రదర్శనలు ఉన్నాయి. విస్తృతమైన ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ నగరాన్ని కలుపుతుంది. ప్రాగ్ నగరం మధ్య ఐరోపాలోని పురాతన విశ్వవిద్యాలయమైన చార్లెస్ విశ్వవిద్యాలయంతో సహా అనేక రకాల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు నిలయం.[4]

ఇవి కూడ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Czech Republic Facts". World InfoZone. Retrieved 14 April 2011.
  2. "Population on 1 January by five-year age group, sex and metropolitan regions". Eurostat. Archived from the original on 14 మార్చి 2020. Retrieved 21 February 2020.
  3. "Czech Republic". Worldatlas.com. Retrieved 4 December 2011.
  4. "Charles University Official Website".
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రాగ్&oldid=3920042" నుండి వెలికితీశారు