చిరంతానందస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిరంతానందస్వామి తెలుగు రచయిత. అతను రాసిన "శ్రీ రామకృష్ణుని జీవిత చరిత్ర" కు 1957లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినది. ఇతనికి పూర్వాశ్రమమున (బ్రహ్మచర్యాశ్రమున) మాధవ చైతన్యులనీ, సన్యాసాంతమున చిరంతానంద స్వామి అనే పేర్లు ఉన్నాయి.[1]

జీవిత విశేషాలు[మార్చు]

అతను తెలుగు సాహిత్యంలో గద్య రచనలో ప్రసిద్ధి చెందినవాడు. అతను రామకృష్ణుడు, వివేకానంద తత్వాలకు సంబంధించిన 20 పుస్తకాలను రచించాడు. అతని రచనలు సూక్ష్మమైన తాత్విక ఆలోచనల శైలితో విలక్షణత కలిగి ఉంటాయి.[2]

రచనలు[మార్చు]

 • శ్రీ వివేకానంద లేఖావళి - 1వ భాగం (అనువాదం) : ఈ మొదటి సంపుటి లేఖావళిలో వివిధ సందర్భాలలో 1888 ఫిబ్రవరి నుంచి 1894 వరకు పలువురికి రాసిన లేఖలలో కొన్నింటిని శ్రీ చిరంతనానంద స్వామి అనువదించగా శ్రీరామకృష్ణ మఠం స్వయంగా ప్రచురించింది.[3]
 • శ్రీ వివేకానంద లేఖావళి - 2వ భాగం (అనువాదం)
 • శ్రీ రామకృష్ణ బోధామృతం
 • శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర[4]
 • శ్రీ శారదాదేవి చరిత్ర
 • శ్రీ వివేకానంద జీవిత చరిత్ర.[5]

మూలాలు[మార్చు]

 1. "శ్రీ వివేకానంద లేఖావళి-రెండవ భాగం - ఆర్ఛీవ్స్ లో కాపీ - కట్టమంచి రామలింగారెడ్డి రాసిన పీఠిక".
 2. Lal, Mohan (1992). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot. Sahitya Akademi. ISBN 9788126012213.
 3. "ఎప్పుడూ భారతీయ ఆధ్యాత్మిక రాయబారి వివేకానందుడే". Archived from the original on 2012-01-22. Retrieved 2018-06-23.
 4. "'TRIVENI' HAS SHED LIGHT ON MY PATH. BLESSED BE HER NAME!".[permanent dead link]
 5. "SWAMI CHIRANTANANANDA పుస్తకాలు".[permanent dead link]

బయటి లంకెలు[మార్చు]