పొత్తూరి వెంకటేశ్వర రావు

వికీపీడియా నుండి
(పొత్తూరు వెంకటేశ్వర రావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పొత్తూరి వెంకటేశ్వరరావు తెలుగు పత్రికారంగ ప్రముఖుడు. ఐదు దశాబ్దాలుగా పత్రికారంగంలో పత్రికారంగంలో పనిచేసిన వ్యక్తి. తెలుగు పత్రికా సంపాదకునిగా, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ అధ్యక్షునిగా పలు హోదాలు, పదవులలో పనిచేశారు. ఆంధ్రభూమి పత్రికతో ఆయనకు అనుబంధం ఉంది. ఆంధ్రప్రభ, వార్త పత్రికలలో సంపాదకులుగా చాలాకాలం పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

పొత్తూరి వెంకటేశ్వరరావు 1934, ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలోని పొత్తూరులో జన్మించాడు. ఉద్యోగరీత్యా అనేక పదవులను పోషించాడు. హైద్రాబాదు, విజయనగర్ కాలనీ, పి ఎస్ నగర్లో స్థిరపడ్డారు. ఈ తండ్రి పేరు వెంకట సుబ్బయ్య తల్లి పేరు పన్నగేంగ్రమ్మ [1]

పాత్రికేయ రంగం[మార్చు]

1957లో ఆంధ్రజనత పత్రికలో చేరి పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టాడు.

రచనలు[మార్చు]

పొత్తూరి వెంకటేశ్వర రావు వాడుక భాషలో సూటిగా రచించాడు. ఆయన సమాచారయుతంగా వ్యాసాలు రచించాడు. ఆధ్యాత్మిక అంశాలు, తెలుగు మహనీయులు, పత్రికా విలువలు, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయం మొదలైన వివిధ అంశాలపై రచనాలు చేశాడు.

ఇతని రచనలలో కొన్ని:

  1. వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు
  2. విధి నా సారథి
  3. పారమార్థిక పదకోశం

మూలాలు[మార్చు]

  1. పరిణతవాణి 6వ సంపుటి. పొత్తూరి వెంకటేశ్వర రావు (సాయి లిఖిత ప్రింటర్స్ సంపాదకులు.). ఆంధ్ర సారస్వత పరిషత్తు. p. 8. |access-date= requires |url= (help)