Jump to content

ధర్మానంద సరస్వతి స్వామి

వికీపీడియా నుండి

ధర్మానంద సరస్వతి స్వామి అని ప్రసిధి పొందిన ధర్మానంద సరస్వతి మహరాష్ట్ర బ్రాహ్మణులు. వీరు భారత రాష్ట్రపతిగా చేసిన వి.వి.గిరి (వరహగిరి వెంకట గిరి) గారి మామగారు. ధర్మానంద సరస్వతి స్వామి గారి కుమార్తె సరస్వతి బాయి ( తదుపరిసరస్వతి బాయి గిరి ) పూనాలో చదువుతున్నరోజులలో వరహగిరి వెంకట గిరి గారితో వివాహము జరిగెను. వారు మాతృభాష మరాఠీలో నే గాక తెలుగు, కన్నడము లోగూడా ధారళముగా మాట్లాడి అనర్గళముగా వ్రాసేవారు. బ్రిటిష్ వారి పరిపాలనలో వారు సైనిక వైద్యులు (Military doctor) గా చేసి అనేక దేశాలు తిరిగి పింఛను తీసుకుని సన్యసించారు ( 1920 దశాబ్దములో అయుండొచ్చు). వీరు 1920 మరియూ 1930 దశాబ్దములలో చాల తరుచుగా బెజవాడ వచ్చి వారి మిత్రులు అయ్యదేవర కాళేశ్వరరావుగారి ఇంటిలో బసచేసేవారు. ఆ కాలమునాటి బెజవాడ ప్రముఖులు డాక్టరుఘంటసాల సీతారామ శర్మ, దిగవల్లి వేంకట శివరావు గారు మొదలగు వారితో ధర్మానంద సరస్వతి స్వామి గారు తరుచు ఇష్టాగోష్ఠికి కలుసుకునేవారు. కొన్నిసార్లు దిగవల్లి వేంకట శివరావు గారింట్లో ఆతిధ్యం స్వీకరించి అభిషేకం చేసేవారు అప్పుడప్పుడు వారింటనే బసచేసేవారు. వీరు మద్రాసు వెళ్లినప్పుడు ఆంధ్రపత్రిక కార్యాలయం లోనే బసచేసేవారు. మైసూరు వెళ్లినప్పడల్లా మైసూరు మహారాజా కృష్ణరాజ వడయారు గారి ఆతిధ్యం పొందేవారు. వీరినిగురించి దిగవల్లి వేంకట శివరావు గారు తమ జ్ఞాపకాలు అను అప్రచురిత రచనలో వ్రాశారు.

సన్యసించకమునుపు సంగతి?

[మార్చు]

సన్యసించక ముందు జీవితము గురించి వారి పుట్టుపూర్వోత్తరాలగురించి గానీ స్వాముల వారి జీవితకాలం గానీ దివల్లి వేంకట శివరావుగారి రచనలో ఉల్లేఖించలేదు. వారి పేరు ధర్మానంద సరస్వతి అనీను, సరస్వతీ బాయమ్మగారు వారి కుమార్తె అనియూ, వారు వి.వి.గిరి మామగారని రూఢిగా వ్రాసియున్నారు. ఈ నాటి ఇంటరనెట్ జీనీ డాట్కామ్ (Geni.com) లో సరస్వతీబాయి గిరి గారి జీనియాలజీ (maintained by "BALA") లో ఆమెగారికి 1917 లో వి వి గిరి గారితో వివాహం అయినట్లుగానున్నది. కానీ వారి తండ్రిగారి పేరు లక్ష్మణరావు అప్పాజీ అని యున్నది. లక్ష్మణరావు అప్పాజీగారి వృత్తాంతమేమి కనబడుట లేదు. ఈ అప్పాజీగారే మన దర్మానందసరస్వతీ స్వామిగారైతే వీరి జీవితకాలం ఎస్టిమేట్ చేసి Geni.com లో వేసినది 1839-1899 సరిగాదనట్లు తోచుచున్నది. ఎందుచేతనంటే దర్మానంద సరస్వతీ స్వామి వారు జనేవరి 11, 1936 తేదీన దిగవల్లి వేంకట శివరావుగారింటిలో అతిథిగా నుండి భోజనం చేసినసంగతి వారి వ్యక్తిగత జీవితం లో ఈ క్రింద చెప్పబడింది. 1930 దశాబ్దములనాటి సంగతులు వ్రాసిన శివరావు గారి రచనలో అప్పటికి స్వాముల వారికి 70 సంవత్సరములు అని యున్నది. దానిని బట్టి వారి జన్మించినది బహశా 1860 ప్రాంతములలో అయిండాలి. అంతేకాక జీనిడాట్ కామ్ ప్రకారమే తీసుకున్నా 1917 లో వారి కుమార్తెకు వి వి గిరి గారితో వివాహం అయిందని చెప్పబడియన్నది దానిని బట్టికూడా స్వాముల వారు జన్మించినది 1839 కాదని తేలుతున్నది. స్వాముల వారు ఎప్పుడు అస్తమించినదీ శివరావుగారి రచనలో లేదు.

సన్యసించిన తరువాత వ్యక్తిగత జీవితం

[మార్చు]

ధర్మానంద సరస్వతి స్వామి వారు ఆజానుబాహుడు. తెల్లవార్ఝాముననే లేచి దండెములు తీసి స్నానముచేసి ప్రాణాయామం చేసేవారు. అప్పటికి (1930 దశాబ్దపులోని సంగతి)70 సంవత్సరములు దాటినా మంచి ఆరోగ్యంగానుండేవారు. పెద్ద పొడుగాటి కర్ర పట్టుకుని కాషాయరంగు పంచ కాషాయరంగు లాల్చీ ధరించేవారు. వారు ప్రతి కాంగ్రెస్సు సభలకు వెళ్లేవారు. చాలమంది కాంగ్రెస్సు నాయకులతో వారికి పరిచయంవుండేది. ఆయనకు మహారాష్ట్ర దేశాభిమానం. స్వాములవారికి మన జ్యోతిష్య శాస్త్రములపైననూ మంత తంత్రములపైననూ చాల నమ్మకముండేది. జోతిష్యంలో వారికి చాల పాండిత్యమున్నది. ఒకసారి జనేవరి 11 వతేదీన 1936 లో స్వాముల వారు దిగల్లి వేంకట శివరావుగారింట అతిథిగానున్నారు. ఆ రోజుననే శివరావుగారికి కుమారుడు జన్నించాడు (కీ.శే. దిగవల్లి వెంకటరత్నం జన్మంచినరోజు). ఆ రోజున ధర్మానంద సరస్వతి స్వాముల వారు తన స్వహస్తములతో శివరావుగారి కుమారుని జాతక చక్రము వేశారు. అదులో విశేషమేమిటంటే జన్మించిన పిల్లవాడు జంద్యమువేసుకుని జన్మించాడని స్వాములవారు చెప్పి న జోశ్యము రూఢి అయినదని శివరావు గారు తమ జ్ఞాపకాలలో వ్రాసి యున్నారు. బెజవాడలో ప్రముఖ డాక్టరు క్షీరసాగరం గారనే మహరాష్ట్ర కంటి వైద్యులుండేవారు వారితో స్వాములవారు మరాఠీలో మాట్లాడేవారు. నారాయణ అయ్యర్ రచించిన పుస్తకములు "Permanent History of Bharata Varsha" మరియూ Astronomy and Philosophy పుస్తకములు అంటే చాలా ప్రీతి. Permanent History of Bharata Varsha ఆను ఆ పుస్తకములో మన పూర్వ పండితులు చేసిన సిధ్దాంతములు ఖండిస్తూ వేదశాస్త్రములు మహా భారతానికి అంతరార్ధములు విశదీకరించి వ్రాసియున్నవి. స్వాముల వారి కోరికపై ఆ పుస్తకమునకు తెలుగుసేత చేయాలని శివరావుగారు కొన్నాళ్లు తలపెట్టారు. కానీ చేయలేదు.