ఆంగ్ల వర్ణక్రమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంగ్ల వర్ణక్రమం ఆంగ్లభాషను వ్రాసేందుకు ఆంగ్ల స్పెల్లింగ్, హైఫనైజేషన్, కేపిటల్ అక్షరాలు వ్రాయడం, పదవిచ్ఛేదం, నొక్కిచెప్పడం, విరామ చిహ్నాలతో సహా ఉపయోగించే వర్ణక్రమం. ప్రపంచంలోని అనేక భాషల్లాగానే విస్తృతస్థాయి ప్రామాణికత కలిగివుంది. అతికొద్ది భాషల్లో ఉన్నట్టుగా దాదాపుగా ప్రతి వర్ణానికీ వేర్వేరు విధాలుగా ఉచ్ఛరించే వీలు కల్పించడం, నేపథ్యాన్నీ, అర్థాన్నీ అనుసరించి దాదాపు అన్ని అక్షరాలు, అక్షరాల కలయికలు వేర్వేరుగా పలకగలిగే స్థితిని కూడా కలిగివుంది. దీనికి ప్రధానమైన కారణం సంక్లిష్టమైన ఆంగ్ల భాష చరిత్ర[1]తో పాటుగా క్రమబద్ధమైన స్పెల్లింగ్ సంస్కరణలు జరగకపోవడం. సాధారణంగా, ఆధునిక ఆంగ్ల వర్ణక్రమం(స్పెల్లింగ్) పదిహేనవ శతాబ్ది చివరి నుంచి భాషలో ఏర్పడ్డ ప్రధానమైన శబ్దం మార్పుల(గ్రేట్ ఒవెల్ షిఫ్ట్ వంటివి)ను ప్రతిఫలించట్లేదు.[2] ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాల వారీగా ఆంగ్ల వర్ణక్రమంలో కొన్ని భేదాలుండగా, కొన్ని పాక్షికంగా, కొన్ని ప్రాంతాల్లో స్పెల్లింగ్ సంస్కరణల ప్రయత్నాలు విజయవంతమై కూడా భేదాలేర్పడ్డాయి.

మూలాలు[మార్చు]

  1. "A short history of English spelling". Archived from the original on 2011-11-30. Retrieved 2015-03-08.
  2. English language. (2010). In Encyclopædia Britannica. Retrieved November 23, 2010, from Encyclopædia Britannica Online: http://www.britannica.com/EBchecked/topic/188048/English-language