ఆందోళన
ఆందోళన (Anxiety) అనేది ఒక భావోద్వేగం. ఇది జరగబోయే సంఘటనలను ఊహించుకుని మనసులో కలిగే అప్రియమైన అంతర్గత సంక్షోభం.[1][2][3] ఇది భయంతో పోలిస్తే భిన్నమైనది. భయం అనేది నిజంగా జరిగే బెదురు సంఘటనకు జరిగే ప్రతిస్పందన. ఆందోళన అనేది జరగబోయే సంఘటనను తలుచుకుని కలిగే భావోద్వేగం. ఆందోళన కలిగినప్పుడు కంగారుగా అటూ ఇటూ నడవడం, దాన్ని వివిధ భౌతిక రూపాల్లో చూపించడం (Somatic anxiety), రాబోయే సమస్యమీదే తదేక దీక్షతో ఆలోచించడం (Rumination) లాంటి లక్షణాలు కనపడతాయి.[4]
ఆందోళన అనేది ఏదైనా ఒక సమస్యను భూతద్దంలో చూసి అతి స్పందించడం వల్ల ఏర్పడిన ఇబ్బందికరమైన, చింతతో కూడుకున్న భావన.[5] ఆందోళనతో పాటు తరచుగా కండరాలు బిగువు,[6], అశాంతి, అలసట, ఊపిరి సరిగా ఆడకపోవడం, పొట్టభాగంలో పట్టేసినట్లు ఉండటం, కళ్ళు తిరగడం, ఏకాగ్రత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆందోళన పడే వ్యక్తులు ముందుగా తమకు గతంలో దాన్ని కలిగించిన పరిస్థితుల నుంచి తప్పించుకుని తిరుగుతారు.[7]
మందులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Davison GC (2008). Abnormal Psychology. Toronto: Veronica Visentin. p. 154. ISBN 978-0-470-84072-6.
- ↑ Miceli M, Castelfranchi C (2014-11-27). Expectancy and emotion (in ఇంగ్లీష్). Oxford: Oxford University Press. ISBN 978-0-19-150927-8. Archived from the original on 2023-01-17. Retrieved 2022-05-09.
- ↑ Chand SP, Marwaha R (2022). "Anxiety". StatPearls. Treasure Island (FL): StatPearls Publishing. PMID 29262212. Archived from the original on 2022-06-21. Retrieved 2022-12-15.
Anxiety is linked to fear and manifests as a future-oriented mood state that consists of a complex cognitive, affective, physiological, and behavioral response system associated with preparation for the anticipated events or circumstances perceived as threatening.
- ↑ Seligman ME, Walker EF, Rosenhan DL. Abnormal psychology (4th ed.). New York: W.W. Norton & Company.[page needed]
- ↑ Bouras N, Holt G (2007). Psychiatric and Behavioral Disorders in Intellectual and Developmental Disabilities (2nd ed.). Cambridge University Press. ISBN 9781139461306. Archived from the original on 2023-01-17. Retrieved 2018-11-22.[page needed]
- ↑ American Psychiatric Association (2013). Diagnostic and Statistical Manual of Mental Disorders (5th ed.). Arlington, VA: American Psychiatric Publishing. p. 189. ISBN 978-0-89042-555-8.
- ↑ Barker P (2003). Psychiatric and Mental Health Nursing: The Craft of Caring. London: Edward Arnold. ISBN 978-0-340-81026-2.[page needed]