ఆంధ్రప్రదేశ్‌లోని మస్జిద్‌ల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్‌లోని మైదుకూరులోని మశీదు

మస్‌జిద్ అనే పదం వాడుకలో మసీదుగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రఖ్యాత మసీదులు:

ఒంగోలు

[మార్చు]
  • జామియా మసీదు: ఏ వూరిలో అయినా ప్రథమంగా నిర్మితమైన మసీదును జామియా లేదా జుమ్మా మసీదుగా గుర్తిస్తారు. ట్రంక్‌రోడ్‌లో ప్రస్తుతం పెద్ద మసీదుగా పిలుస్తోన్న 400 ఏళ్ల నాటి ప్రార్థనా మందిరమే జామియా మసీదు. విశిష్టమైన నిర్మాణ శైలితో దీనిని ఆనాటి ఆర్కాట్ నవాబులు నిర్మించారు. సువిశాల ప్రాంగణంలో మసీదుపైన ఉండే మీనార్‌లు ఠీవిగా ఆకాశాన్ని చూస్తుంటాయి. వాటి మధ్యలో పావురాళ్లు నివసించే గూడులు కూడా ఉంటాయి. ఇక్కడివేపచెట్లు 300 ఏళ్లనాటివి అంటారు.
  • మర్కజ్ ఛోటీ మస్‌జిద్:పత్తివారి వీధిలో 200 ఏళ్ల క్రితం నిర్మించిన మర్కస్ ఛోటీ మస్‌జిద్ అందమైన ముఖద్వారంతో అలరారుతుంటుంది.క్రింద పైన రెండు విశాలమైన పెద్ద హాలులతో ఒకేసారి వెయ్యిమంది నమాజ్ చేసుకొనే అవకాశం ఇక్కడ ఉంది.

ఇవీ చూడండి

[మార్చు]