ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం.[1]

ప్రాథమికవిద్య[మార్చు]

అనాథ కేంద్రాలు[మార్చు]

లక్ష్యం

అనాథ పిల్లల విద్యాభివృద్ధి కోసం హాస్టలు వసతి కల్పించడం.

అర్హత

8-15 సంవత్సరాల లోపు వయస్సు అనాథ బాలలు 3 నుండి 10 వ తరగతి లోపు వారు అర్హులు

లబ్ధిదారులు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే గ్రామీణ, పట్టణ ప్రాంత 8-15 సం, లలోపు, 3-10 వ తరగతి చదివే అనాథ బాలలు అందరు.

ఉపయోగాలు

ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, నోటు పుస్తకాలు, దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు వీటితో పాటు బాలురకు రూ.20/-లు, బాలికలకు రూ.25 /-లు ప్రతి నెల సబ్బులు, కొబ్బరి నూనె నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది.

సంప్రదించండి

ప్రధానోపాధ్యాయులు /హాస్టల్ సంక్షేమ అధికారి / జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి /సహాయ సంచాలకులు, సాంఘిక సంక్షేమం.

జి.ఓ.నెం

ఆర్.సి.నెం. 126 ఎస్.డబ్ల్యు (ఇడియు.2) డిపార్ట్ మెంట్, తేది 03 /09 / 1997

ఎస్.టి.తెగల విద్యార్థులకు హాస్టల్ సదుపాయం[మార్చు]

లక్ష్యం

ఎస్.టి.తెగల విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించడం.

అర్హత

వార్షిక ఆదాయం 12,000/- లకు మించని 3 నుంచి 10 వ తరగతి మధ్య ఉన్న ఎస్.టి.విద్యార్థులు

లబ్ధిదారులు

గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 3 నుంచి 10 వ తరగతి మధ్య ఉన్న విద్యార్థులు

ఉపయోగాలు

ఉచితంగా పాఠ్య ఫుస్తకాలు, నోటు పుస్తకాలు, భోజనం, దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు వీటితో పాటు బాలురకు రూ.20/-లు, బాలికలకు రూ. 25/-లు వరకు ప్రతి నెల సబ్బులు, కొబ్బరి నూనె నిమిత్తం.

సంప్రదించండి

ప్రధానోపాధ్యాయులు / హాస్టల్ సంక్షేమ అధికారి/ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి/ సహాయ సంచాలకులు, సాంఘిక సంక్షేమం.

జి.ఓ.నెం

జీ.ఓ.ఎం.ఎస్.నెం. 126, ఎస్.డబ్య్లు (జి2) డిపార్ట్ మెంట్, తేది 03-09-1997

కిశోర బాలికల పథకం[మార్చు]

లక్ష్యం

బాలికలను నూటికి నూరు శాతం ప్రాథమిక విద్యలో చేర్పించడం, బాల్య వివాహాలను నిరోధించడం.

అర్హత

15 సం, లలోపు బాలికలు

లబ్ధిదారులు

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 15 సం, లలోపు బాలికలు

ఉపయోగాలు

వివిధ నైపుణ్యాలలో శిక్షణనివ్వడం, ఇతర ప్రదేశాలను సందర్శింపజేయడం, వర్క్ షాపులు, బ్రిడ్జి కోర్సులలో శిక్షణనివ్వడం.

సంప్రదించండి

అంగన్ వాడీ టీచర్ / ఐసిడియస్ సూపర్ వైజర్ / ఐసిడియస్ /పి.డి. /మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి

జి.ఓ.నెం

జీవో.యమ్.యస్.నెం. 70, యస్.డబ్య్లు (ఆర్.యస్) డిపార్ట్ మెంట్, తేది 10-7-1999

నైపుణ్యం గల బాలురకు ప్రోత్సాహక పథకం[మార్చు]

లక్ష్యం

చురుకైన ఎస్.సి. విద్యార్థులకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యా సదుపాయం కల్పించడం.

అర్హత

1 నుంచి 10 తరగతి మధ్య, చురుకైన ఎస్.సి విద్యార్థులకు

లబ్ధిదారులు

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 1 నుండి 10 తరగతి మధ్య ఉన్న, నైపుణ్యం గల ఎస్.సి. విద్యార్థులు

ఉపయోగాలు

ఆహారం, పుస్తకాల, యూనీఫామ్, బూట్లు, బెడ్డింగ్, ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు, ట్యూషన్ ఫీజుల నిమిత్తం సంవత్సరానికి రూ.16,500/-ల ఆర్థిక సహాయం.

సంప్రదించండి

ప్రధానోపాధ్యాయులు / మండల విద్యాధికారి / సాంఘిక సంక్షేమ అధికారి / జిల్లా విద్యాధికారి / జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి /సహాయ సంచాలకులు, సాంఘిక సంక్షేమం.

జి.ఓ.నెం

జి.ఓ.ఎం.ఎస్.నెం. 182 ఎస్.డబ్ల్యు (క్యూ2) డిపార్టుమెంటు, తేదీ 23/08/1991

వెనుకబడిన కులాల సంక్షేమం[మార్చు]

లక్ష్యం

ఎస్. సి. విద్యార్థుల విద్యా ప్రగతి కొరకు వారికి హాస్టలు సదుపాయం కల్పించడం.

అర్హత

రూ,12,000/-లు వార్షిక ఆదాయం మించని, ఎస్.సి. కుటుంబాలకు చెందిన విద్యార్థులు

లబ్ధిదారులు

ఎస్.సి. కుటుంబాలకు చెందిన 3 నుంచి 10 వ తరగతి విద్యార్థులు, వార్షిక ఆదాయం రూ,12,000/-లు మించని వారు.

ఉపయోగాలు

ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, నోటు పుస్తకాలు, దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు వీటితో పాటు బాలురకు రూ. 20/-లు, బాలికలకు రూ.25 /-లు ప్రతి నెల సబ్బులు, కొబ్బరి నూనె నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది.

సంప్రదించండి

ప్రధానోపాధ్యాయులు /హాస్టలు సంక్షేమ అధికారి / జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి / సహాయ సంచాలకులు, సాంఘిక సంక్షేమం.

జి.ఓ.నెం

ఆర్.సి.నెం.సి.2 / 3842 /2000-1, సాంఘిక సంక్షేమ శాఖ కమీషనర్, తేది. 27 /05 /2000

శారీరక వికలాంగులైన బాలికలకు హాస్టలు / వసతి గృహాలు[మార్చు]

లక్ష్యం

40శాతం శారీరక వికలాంగులైన బాలికలకు

అర్హత

వార్షిక ఆదాయం రూ. 24,000 /-లకు మించని, 3 నుంచి 10 వ తరగతి మధ్య ఉన్న శారీరక వికలాంగులైన బాలికలకు

లబ్ధిదారులు

వార్షిక ఆదాయం రూ. 24,000 /-లకు మించని, 3 నుంచి 10 వతరగతి మధ్య ఉన్న శారీరక వికలాంగులైన బాలికలకు

ఉపయోగాలు

ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, నోటు పుస్తకాలు, భోజనం, దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు వీటితో పాటు బాలురకు రూ.25/-లు, బాలికలకు రూ, 45/-లు వరకు ప్రతి నెల సబ్బులు, కొబ్బరి నూనె నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది.

సంప్రదించండి

హాస్టలు సంక్షేమ అధికారి /సహాయ సంచాలకులు, వికలాంగుల శాఖ / సంచాలకులు వికలాంగ సంక్షేమ శాఖ.

ఆరోగ్యం[మార్చు]

ఆంధ్రప్రదేశ్ పట్టణ మురికివాడల ఆరోగ్య పరిరక్షణ ప్రాజెక్ట్[మార్చు]

లక్ష్యం

రాష్ట్రం లోని 74 మున్సిపాలిటీ పట్టణాలలోని మురికివాడల్లో నివసించే పేదవారికి వైద్యసహాయాన్ని అందించడం

అర్హత

పట్టణాల్లోని మురికివాడల్లో నివసించే దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న తల్లులు, పిల్లలకు

లబ్ధిదారులు

పట్టణాల్లోని మురికివాడల్లో నివసించే దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న తల్లులు, పిల్లలకు

ఉపయోగాలు

మురికివాడల్లో నివసించే తల్లులు, పిల్లలకు ఆరోగ్య సేవలు

సంప్రదించండి

ఏ.యన్.యమ్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా ఔషధ, ఆరోగ్య అధికారి.

జి.ఓ.నెం

డి.ఓ.లెటర్ నెం. 10366 / ఆర్.హెచ్.సి-సి / యు.యస్.పి/ 98, తేది 12.4.2000

గ్రామీణ అత్యవసర ఆరోగ్య ప్రయాణ పథకం[మార్చు]

లక్ష్యం

ప్రసవ సమయానికి దగ్గరలో ఉన్న గర్భిణీలు, అత్యవసర పరిస్థితులలో ఉన్న శిశువులు, పిల్లలకు, తక్షణ, ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం

అర్హత

ప్రసవించబోయే గర్భిణీలు, అత్యవసర పరీక్షల నిమిత్తం పంపవలసిన శిశువులు, పిల్లలు

లబ్ధిదారులు

ప్రసవించబోయే గర్భిణీలు, అత్యవసర పరీక్షల నిమిత్తం పంపవలసిన శిశువులు, పిల్లలు

ఉపయోగాలు

కిలోమీటరుకు రూ.5 /-ల వంతున రోజు మొత్తం ఎప్పుడైనా అంబులెన్స్ సౌకర్యం కల్పించడం. యస్ సి, యస్ టిలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.

సంప్రదించండి

ఏ.యన్.యమ్. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, జిల్లా ఔషధ, ఆరోగ్య అధికారి.

జి.ఓ.నెం

జీవో. ఆర్.టి.నెం. 205 /యమ్.హెచ్ అండ్ యఫ్, డబ్ల్యు (డి1) డిపార్టు మెంట్, తేది 3.1.2004 --117.216.248.97 11:40, 2014 మే 30 (UTC)

జాతీయ మాతృత్వ సహాయక పథకం (ఎన్.ఎం.బి.ఎస్)[మార్చు]

లక్ష్యం

దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న గృహిణులైన గర్భిణీ స్త్రీలకు, మొదటి రెండు కాన్పుల వరకు సహాయాన్ని అందించుట

అర్హత

రూ,13,600 /-లు వార్షికాదాయం మించని, 19 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన గర్భిణీ స్త్రీలు.

లబ్ధిదారులు

దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని, 19 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన గర్భిణీ స్త్రీలు.

ఉపయోగాలు

రు.500 /-లు రెండు విడతలుగా పొందవచ్చు. 8 నెలలు గర్భిణీగా ఉన్నపుడు 300/-రూపాయలు, ప్రసవించిన తర్వాత మొదటి నెలలో మిగిలిన 200 / - రూపాయలు పొందవచ్చు.

సంప్రదించండి

ఎ.ఎన్.ఎం,./ పి.హెచ్.సి. / జిల్లాఆసుపత్రి / ఎస్.హెచ్.జి.లు. /వి.ఓ.లు/ ఎం. పి. డి. ఓ / పట్టణ ప్రాంతాలైతే మునిసిపల్ కమీషనర్ లు / జడ్.ఎస్. /పి.డి.., వెలుగు - డి.ఆర్.డి.ఎ.

జి.ఓ.నెం

జి.ఓ.ఎం.ఎస్.నెం.751 పి.ఆర్ & ఆర్డి (ఆర్ డి – 1 ) డిపార్ట్మెంట్, తేది 5 /12 /1995.

పిల్లలకు గుండె శస్త్ర చికిత్స[మార్చు]

లక్ష్యం

హృద్రోగంతో బాధపడుతున్న పిల్లలకు శస్త్రచికిత్స నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేయడం

అర్హత

దారిద్య్రరేఖకు దిగువన ఉన్న శస్త్రచికిత్స అవసరమైన హృద్రోగాలతో బాధపడుతున్న పిల్లలందరికీ

లబ్ధిదారులు

హృదయ సంబంధ రోగాలతో బాధపడుతున్న దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పిల్లలు

ఉపయోగాలు

శస్త్రచికిత్స నిమిత్తం రూ. 50,000 /- వరకు ఆర్థిక సహాయం

సంప్రదించండి

యమ్.ఆర్.ఓ /ఆర్.డి.ఓ /జిల్లా కలెక్టర్ / ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులు

జి.ఓ.నెం

జీవో. యమ్.యస్. నె. 05, హెచ్. యమ్. అండ్ యఫ్. డబ్య్లు (కె1) డిపార్ట్ మెంట్, తేది 6.1.2005

పెన్షన్ సదుపాయం[మార్చు]

లక్ష్యం

18 నుండి 60 సం, ల మధ్య వయస్కులైన శారీరక వికలాంగులకు ఆర్థిక సహాయం.

అర్హత

18-60 సం, ల మధ్య ఉన్న శారీరక వికలాంగులు (60% ఇతరులకు, 40% ఎస్.వారికి ) వార్షిక ఆదాయం 11,000/-రు.లకు మించని వారై ఉండాలి. లబ్ధిదారులు ఇతరత్రా ఏ విధమైన లబ్ధి పొందని వారై ఉండాలి.

లబ్ధిదారులు

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పై అర్హతలు కలిగిన 18-60 సం,, మధ్య వయస్కులు

ఉపయోగాలు

ప్రతి నెల రూ,75/-లు ఆర్థిక సహాయం

సంప్రదించండి

గ్రామ పంచాయితీ కార్యదర్శి / ఎమ్డీవో / వికలాంగ సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు

జి.ఓ.నెం

జి.ఓ.ఆర్.టి.నెం.556 ఎస్.డబ్ల్యు (జి2) డిపార్ట్ మెంట్, తేది 25 /7 /1985

మానసిక వికలాంగులకు సహాయం[మార్చు]

లక్ష్యం

స్టైఫండ్ ద్వారా మానసిక వికలాంగులైన విద్యార్థులకు విద్యా, సౌకర్యాన్ని కల్పించడం.

అర్హత

భారత ప్రభుత్వం చే సహాయం పొందని ప్రభుత్వేతర సంస్థలతో నిర్వహించబడుచున్న పాఠశాలల్లో లబ్ధిదారులు చదువుకుంటున్న మానసిక వికలాంగులైన విద్యార్థులకు.

ఉపయోగాలు

సంవత్సరానికి రూ. 1000/-లు ఆర్థిక సహాయం

సంప్రదించండి

సంబంధిత ప్రధానోపాధ్యాయులు / సంబంధిత ఎన్.జి.ఓ./ వికలాంగ సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు

రాజీవ్ ఆరోగ్య శ్రీ[మార్చు]

లక్ష్యం

తెల్ల రేషన్ కార్డులు కలిగిన బలహీన వర్గాల వారికి ఉచిత వైద్య చికిత్సలు. ఈ క్రింది వ్యాధులతో బాధ పడేవారికి చికిత్సలు చేయడం. 1. గుండెకు శస్త్ర చికిత్స 2. మూత్ర పిండాల శస్త్ర చికిత్స 3. మెదడుకు శస్త్ర చికిత్స 4. క్యాన్సర్ రేడియోథెరపి

అర్హత

తెల్ల రేషన్ కార్డు కలిగినవారు, పేద, నిరుపేద వర్గాలవారు

లబ్ధిదారులు

తెల్ల రేషన్ కార్డులు కలిగినవారు

ఉపయోగాలు

శస్త్ర చికిత్స పూర్తయ్యే వరకు సదుపాయాలు లభిస్తాయి.

సంప్రదించండి

యమ్.ఆర్.ఓ /ఆర్.డి.ఓ /జిల్లా కలెక్టర్ / ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులు

వైద్య, ఆరోగ్య , కుటుంబ సంక్షేమం[మార్చు]

లక్ష్యం

రోజు మొత్తం (24 గం, లు) సాధారణ ప్రసూతి సేవలు అందించడం

అర్హత

గర్భిణీ స్త్రీలు అందరూ

లబ్ధిదారులు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గర్భిణీ స్త్రీలు అందరూ

ఉపయోగాలు

రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కల్పించిన 490 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, రోజుల్లో 24 గంటలు సాధారణ ప్రసూతి సేవలు అందించడం, వారంలో ఒకరోజు ప్రసూతి నిపుణులు, పిల్లల వైద్య నిపుణులచే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించడం. అత్యవసర కేసుల విషయంలో ఉచిత ప్రయాణ, టెలిఫోన్ సౌకర్యం కల్పించడం

సంప్రదించండి

ఎ.యన్. యమ్. /ప్రాథమిక ఆరోగ్య కేంద్రం / జిల్లా ఔషధ, ఆరోగ్య శాఖాధికారి.

జి.ఓ.నెం

ఆర్.సి.సం.633 / ఆర్.సి.హెచ్ – 10 / యస్....డి.బి.-138, తేది 28/12/98 కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ ద్వారా జారీ చేయబడినది

సుఖీభవ[మార్చు]

లక్ష్యం

సక్రమ ప్రసూతి విధానాలను అవలంబింపజేయడం ద్వారా తల్లుల మరణాలను తగ్గించడం.

అర్హత

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న గర్భిణీలు

లబ్ధిదారులు

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న గర్భిణీలు

ఉపయోగాలు

ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాల్లో ప్రసూతి సహాయాన్ని పొందే గర్భిణీలకు రూ. 1000/-లు ఆర్థిక సహాయం

సంప్రదించండి

ఏయన్ యమ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఔషధ, ఆరోగ్య అధికారి

వ్యవసాయం[మార్చు]

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ జీవనోపాధుల ప్రాజెక్టులు (ఎ.పి.ఆర్.ఎల్.పి.)[మార్చు]

లక్ష్యం

వ్యవసాయం, వశుసంపద మొ, గు వాటి ద్వారా జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచి తద్వారా పేదరికాన్ని తగ్గించటం

అర్హత

గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తులు, స్వయం సహాయక సంఘాలు

లబ్ధిదారులు

గ్రామ సమాజా (కమ్యూనిటీ) లు, పేద, నిరుపేద వ్యవసాయదారులు.

ఉపయోగాలు

సమాజానికి అవసరమైన తక్కువ ఖర్చు నిర్మాణాలు, వడపోత ట్యాంకులు మొ, వి, నిర్మించడానికి, సహజవనరుల నిర్వహణ క్రింద, రూ. 15,00,000/- ల వరకు ఆర్థిక సాయం. వ్యవసాయం, పశుసంపదల అభివృద్ధి కొరకు గ్రామ సమాఖ్యల ద్వారా స్వయం సహాయక సంఘాల వారికి ఋణ సదుపాయం నిమిత్తం రూ.9,00,000/- ల వరకు ఆర్థిక సహాయం. జీవనోపాధుల విస్తరణ నిమిత్తం గ్రామ సమాఖ్యలు నుంచి స్వయం సహాయక సంఘాలకు ఋణాలు

సంప్రదించండి

జి.పి. కార్యదర్శి / సర్పంచ్ / ఎం.పి.డి.ఓ / పి.డి. జిల్లా నీటి పారుదల శాఖ (డి.డబ్ల్యు.ఎం.ఎ.)

ఇందిరా క్రాంతి పధకం (ఐ.కె.పి.)[మార్చు]

లక్ష్యం

పేద, నిరుపేద వర్గాల వారికి ఆహార సదుపాయం కల్పించి, అవసరాన్ని బట్టి తరువాత పొడిగించడం అయితే సంబంధిత కుటుంబానికి వారి శారీరక శ్రమకు సరిపడా ఆహార ధాన్యాలు లేదా డబ్బు రూపంలో సహాయాన్ని అందించడం.

అర్హత

గ్రామాల్లోని పేద, నిరుపేద కుటుంబాలు

లబ్ధిదారులు

శారీరకంగా సమర్థవంతులైన పేద, నిరుపేద కుటుంబాలు

ఉపయోగాలు

మొదటి విడతలో 4 నెలలు పాటు, ప్రతి నెలా 40 కేజీల బియ్యం రూ.100/- ఆర్థిక సహాయం

సంప్రదించండి

గ్రామ పంచాయితీ కార్యదర్శి / సర్చంచ్ వెలుగు - కమ్యూనిటీ కో – ఆర్డినేటర్ / ఎం.పి.డి.ఓ / పి.డి. వెలుగు / డి.ఆర్.డి.ఎ.

జి.ఓ.నెం

జి.ఓ.ఎంఎస్.నెం. 297, పిఆర్ & ఆర్ డి (ఆర్ డి -1 ) డిపార్ట్ మెంట్, తేదీ 12/10 /2005

జాతీయ పనికి ఆహార పథకం (ఎన్.ఎఫ్.ఎఫ్.డబ్ల్యు.పి.)[మార్చు]

లక్ష్యం

అదనపు జీవన భృతి ద్వారా ఆహార సదుపాయాన్ని కల్పించడం

అర్హత

గ్రామాల్లోని పేద, నిరుపేద కుటుంబాలు

లబ్ధిదారులు

గ్రామీణ ప్రాంతాల్లోని, శారీరక శ్రమ ద్వారా రోజు వారీ వేతనాన్ని పొందే పేద, నిరుపేదలు

ఉపయోగాలు

ఆడ, మగ వారిద్దరికీ రూ.100/- ల కనీస వేతనం. ఎన్.ఎఫ్.ఎఫ్.డబ్ల్యు.పి, ప్రమాణాల ప్రకారం సాధారణ మట్టి నేలల్లో పనిచేసే వారికి 8 కె.జి.ల బియ్యం, రూ.16/-లు. గట్టి నేలల్లో పనిచేసే వారు అదనంగా 10% వేతనాన్ని పొందవచ్చు.

సంప్రదించండి

జి.పి. కార్యదర్శి / సర్పంచ్/ ఎం.పి.డి.ఓ/ పి.డి. జిల్లా నీటి పారుదల శాఖ (డి. డబ్ల్యు.ఎం.ఎ.) (రంగారెడ్డి, ఖమ్మం. వరంగల్, నల్గొండ, అనంతపురం), ముఖ్య కార్య నిర్వహణాధికారి,, జిల్లా పరిషత్ (ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కడప)

జి.ఓ.నెం

జి.ఓ.ఎంఎస్.నెం.148, పిఆర్ & అర్ డి (ఆర్ డి -1 ) డిపార్ట్మెంట్, తేదీ 30/04/2005

సంక్షేమం[మార్చు]

జాతీయ కుటుంబ సహాయక పథకం (ఎన్.ఎఫ్.బి.ఎస్)[మార్చు]

లక్ష్యం

ఏదైనా ఒక కుటుంబంలో, కుటుంబ పెద్దకు సహజ లేదా అవాంఛనీయ మరణం సంభవించినప్పుడు, ఆ కుటుంబానికి సహాయాన్ని అందించడం

అర్హత

మరణించిన కుటుంబ పెద్ద 18-25 సంవత్సరాల మధ్య వయస్కుడై, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి చెందిన వాడై ఉండాలి.

లబ్ధిదారులు

కుటుంబ పెద్ద మరణించిన, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబీకులు

ఉపయోగాలు

రు. 10,000/- ల ఆర్థిక సహాయం, అది కూడా ఒకసారి మాత్రమే

సంప్రదించండి

గ్రామ పంచాయితీ కార్యదర్శి /సర్పంచ్ వెలుగు కో – ఆర్డినేటర్ / ఎం.పి.డి.ఓ./పి.డి., వెలుగు - డి.ఆర్.డి.ఎ.

జి.ఓ.నెం

జిఓ.ఎం.ఎస్.నెం. 751, పిఆర్ ఆర్ డి (ఆర్ డి – 1) డిపార్టుమెంటు, తేదీ 5 -12-1995

పట్టణ ప్రాంత మహిళల , బాలల అభివృద్ధి (డిడబ్ల్యుసియుఏ)[మార్చు]

లక్ష్యం

స్వయం సహాయక సంఘాలకు 50% రాయితీతో బ్యాంకు ల ద్వారా ఆర్థిక సహాయం.

అర్హత

స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు

లబ్ధిదారులు

18-50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు

ఉపయోగాలు

50% రాయితీతో బ్యాంకు ల ద్వారా ఋణ సహాయం.

సంప్రదించండి

మునిసిపల్ కమీషనర్ / జిల్లా కలెక్టర్

జి.ఓ.నెం

ఆర్.ఓ.సి.సం. 1421 /98 / యన్ 1. తేది 27.1.1998

పట్టణ ప్రాంత మైనారిటీ మహిళలు , బాలల అభివృద్ధి[మార్చు]

లక్ష్యం

మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా స్వయం ఉపాధిని కల్పించి, వారిని దారిద్య్ర రేఖకు దిగువనుంచి ఎగువకు తీసుకురావడం.

అర్హత

మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులు లేదా సంఘాలు

లబ్ధిదారులు

మైనారిటీ మహిళలతో కలిసి ఏర్పడిన సంఘానికి చెందినవారై ఉండాలి. సభ్యులు తరచూ పొదుపు చేసుకుంటూ, తమ పొదుపు ఖాతాలో కనీసం, రూ.100/-లు కలిగి ఉండాలి.

ఉపయోగాలు

ఒక్కొక్కరికి 10 నుండి 20/- వేల రూపాయల వరకు రివాల్వింగ్ ఫండును అందజేస్తారు. ఈ మొత్తాన్ని ఆదాయవనరులను సమకూర్చుకోవడానికి వినియోగించాలి.

సంప్రదించండి

గ్రామ పంచాయితీ కార్యదర్శి/ వి.ఓ./ యమ్.పి.డి.ఓ/ ఎగ్జిక్యూటివ్ డెరెక్టర్, బి.సి.కార్పోరేషన్

జి.ఓ.నెం

జీ.ఓ.యమ్.యస్., నెం. 155, యస్.డబ్య్లు (జనరల్) డిపార్ట్ మెంట్, తేది 10-9-1997

పొదుపు , ఋణ సంఘాలు[మార్చు]

లక్ష్యం

స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా చిన్న మొత్తాల్లో ఋణ సదుపాయం

అర్హత

స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు

లబ్ధిదారులు

18-50 సంవత్సరాల మధ్య వయసుకలిగిన స్వయం స్వయం సహాయక సంఘాల సభ్యులు

ఉపయోగాలు

బ్యాంకుల ద్వారా ఋణ సహాయం.

సంప్రదించండి

మున్సిపల్ కమీషనర్ /జిల్లా కలెక్టర్

జి.ఓ.నెం

ఆర్.ఓ.సి.నెం. 1421 / 98 / యన్1, తేది 27.1.1998

భర్త చనిపోయిన స్త్రీలకు పెన్షన్ పథకం[మార్చు]

లక్ష్యం

దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, భర్త చనిపోయి అభాగ్య స్థితిలో ఉన్న స్త్రీలకు మరణించేంతవరకు ఆర్థిక సహాయం అందించడం.

అర్హత

వయసుతో సంబంధం లేకుండా వార్షికాదాయం రూ. 1800 /- లకన్నా తక్కువగా ఉండి, దారిద్య్ర రేఖకు దిగువున ఉండి, భర్త చనిపోయిన మహిళలు అందరు.

లబ్ధిదారులు

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న భర్త చనిపోయిన మహిళలు.

ఉపయోగాలు

ప్రతి నెల రూ. 100 పైగా ఆర్థిక సహాయం.

సంప్రదించండి

గ్రామ పంచాయితీ కార్యదర్శి / సర్పంచ్ / ప్రాథమిక ఆరోగ్య కేంద్రం / వెలుగు - కమ్యూనిటీ కో – ఆర్టినేటర్ / ఎం.పి.డి.ఓ. / పి.డి. వేలుగు –డి.ఆర్.డి.ఎ.

జి.ఓ.నెం

జీ.ఓ.ఎం.యస్., నెం. 34, యస్.డబ్య్లు (బి.యు.డి.) శాఖ, తేది 19-4-2005

మహిళ శిశు సంక్షేమ శాఖ[మార్చు]

లక్ష్యం

పేద పిల్లలకు ఉచితంగా ఆహారం, బట్టలు, దుస్తులు, మామూలు (నాన్ - ఫార్మల్) విద్యను అందించుట

అర్హత

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 6 సంవత్సరాలలోపు బాలలు

లబ్ధిదారులు

6 సంవత్సరాలలోపు వయస్సున్న, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలలు

ఉపయోగాలు

ఆహారం, దుస్తులు, మామూలు (నాన్ – ఫార్మల్) విద్య

సంప్రదించండి

అంగన్ వాడీ టీచర్, / ఐ.సి.డి.యస్. /సూపర్ వైజర్ / ఐ.సి.డి. యస్ పి.డి./ మహిళా, శిశు సంక్షేమ అధికారి.

జి.ఓ.నెం

లభ్యం కాలేదు. ఈ కార్యక్రమం చాలా సంవత్సరాలుగా అమలులో ఉంది.

యువతకు శిక్షణ[మార్చు]

లక్ష్యం

పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాలతో కూడిన శిక్షణ నందించడం

అర్హత

కనీస విద్యార్హత 7వ తరగతి కలిగి ఉండి, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న, 18-35 సంవత్సరాల మధ్య వయసుగల పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతకు

లబ్ధిదారులు

కనీస విద్యార్హత 7వ తరగతి కలిగి ఉండి, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న, 18-35 సంవత్సరాల మధ్య వయసుగల పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతకు

ఉపయోగాలు

ఏపిఐటిసిఓ, ఉపాధి పథకాల ద్వారా నైపుణ్యాలను అభివృద్ధి పరిచే శిక్షణ అందించడం

సంప్రదించండి

మున్సిపల్ కమీషనర్ /జిల్లా కలెక్టర్

జి.ఓ.నెం

ఆర్.ఓ.సి.నెం. 1421 /98 /యన్1, తేది 27.1.1998

రాజీవ్ యువ శక్తి (చిన్న వ్యాపారాలు )[మార్చు]

లక్ష్యం

నిరక్షరాస్యులైన యువతకు స్వయం ఉపాధి కల్పించుటకు ఆర్థిక సహాయం అందచేయడం.

అర్హత

ఏ విధమైన ఉపాధిలేని నిరక్షరాస్యులైన యువత.

లబ్ధిదారులు

విద్యార్హతలేని యువతీయువకులు

ఉపయోగాలు

రూ, 7,500/- ల రాయితీతో బ్యాంకుల ద్వారా రూ. 50,000 ల వరకు ఋణసదుపాయం.

సంప్రదించండి

గ్రామ పంచాయితీ కార్యదర్శి / యమ్.పి.డి.ఓ/ జిల్లా యువజన సంక్షేమశాఖాధికారి.

రాజీవ్ యువ శక్తి (సంఘాలు)[మార్చు]

లక్ష్యం

విద్యార్హత కలిగి కనీసం 5 గురు సభ్యులు ఉన్నటువంటి సంఘాలకు, ఆర్థిక సహాయం ద్వారా స్వయం ఉపాధి కల్పించడం.

అర్హత

కనీసం 5 గురు సభ్యులు కలిగిన సంఘంలోని వారై, ఎటువంటి ఉపాధిలేని, కనీసం 9వ తరగతి వరకు (పాస్ లేక ఫెయిల్) చదువుకున్న యువతీయువకులు

లబ్ధిదారులు

సామర్థ్యం కలిగిన, ఎటువంటి, ఉపాధిలేని యువ సంఘాలు.

ఉపయోగాలు

బ్యాంకుల ద్వారా గరిష్ఠంగా రూ. 60,000 ల వరకు రాయితీతో, పరిశ్రమల ఆధారిత కార్యక్రమాల కోసం రూ. 3,00,000 /- ల వరకు ఆర్థిక సహాయం, అదే సేవా ఆధారిత కార్యక్రమాలకోసం రూ. 40,000 /-లు వ్యాపార ఆధారిత కార్యక్రమాల కోసం రూ. 30,000/-లు రాయితీ కల్పించబడును.

సంప్రదించండి

గ్రామ పంచాయితీ కార్యదర్శి /యమ్.పి.డి.ఓ. /జిల్లా . యువజన సంక్షేమ అధికారి.

జి.ఓ.నెం

జీ.వో. నె. 51, వై.ఏ.టి. అండ్ సి (వై.యస్) డిపార్ట్ మెంట్, తేది 2 /1/ 2004

సేవా సంబంధిత పథకాల కోసం నిర్జీవ ఋణ సదుపాయం[మార్చు]

లక్ష్యం

చదువుకొని నిరుద్యోగులైన యస్.టి.యువతకు, సేవల ఆధారిత వ్యాపారాల కోసం ఆర్థిక సహాయం

అర్హత

వార్షికాదాయం రూ.39,308 లకు మించని చదువుకున్న నిరుద్యోగ గ్రామీణ యస్.టి.యువత, వార్షికాదాయం రూ. 54,494/-లు మించని పట్టణ యస్.టి. యువత, 18-45 సంవత్సరాల మధ్య వయస్కులై కనీసం 8వ తరగతి వరకు చదువుకొని ఉండాలి.

లబ్ధిదారులు

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చదువుకున్న, నిరుద్యోగ యస్.టి.యువత

ఉపయోగాలు

మొత్తం యూనిట్ పెట్టుబడి రూ. 5,00,000 /- కాగా అందులో 50 % రాయితీ, రూ.10,000 లపై 20% రాయితీ, 30,000/- లపై 4% వడ్డీతో, మిగిలిన మొత్తం 6 % వడ్డీతో నిర్జీవ ఋణ సదుపాయం ఉంటుంది.

సంప్రదించండి

గ్రామ పంచాయితీ కార్యదర్శి / వి.ఓ / యమ్.పి.డి.ఓ. /పి.ఓ. ఐ.టి.డి.ఏ /మార్పు చెందిన ప్రాంత అభివృద్ధి ఏజెన్సీ (యమ్.ఏ.డి.ఏ) /జిల్లా షెడ్యూల్డ్ తెగల సంక్షేమ అధికారి.

జి.ఓ.నెం

జీవో. యమ్. యస్. నెం. 76. యస్. డబ్ల్యు (టి.డబ్ల్యు.జిసిసి1) డిపార్ట్ మెంట్, తేది 21 /9/2005

స్వయం సహాయ సంఘాలకు – బ్యాంకు రుణాలు[మార్చు]

లక్ష్యం

స్వయం సహాయక సంఘాలు బ్యాంకు నుండి తీసుకున్న పూర్వపు బకాయిలను సకాలంలో తిరిగి చెల్లించడం,, కొత్త లేదా తిరిగి పాత గ్రూపులకు మైక్రోఫైనాన్స్ ద్వారా లబ్ధిది కల్పిచడం, జిల్లా పొదుపు ప్రణాళికలో స్వయం సహాయక, సంఘాల వాటాను వృద్ధి చేయటం.

అర్హత

కనీసం ఆరు నెలల కాలం సక్రమ నిర్వహణ కలిగిన స్వయం సహాయక సంఘాలు.

లబ్ధిదారులు

ఈ క్రింది షరతులను ఆయోదించగలిగిన అన్ని స్వయం సహాయక సంఘాలు. 1)10-20 నుండి సభ్యులను కలిగి ఉండాలి ఒకవేళ శారీరక వికలాంగులు ఉన్నట్లయితే 5 గురు సభ్యుల వరకు ఉండవచ్చు. 2) కనీసం ఆరు నెలల కాలం సక్రమ నిర్వహణ కలిగి ఉండాలి. 3) గ్రూపులు తమ సొంత వనరులతో పొదుపు, ఋణాల లావాదేవీలను విజయవంతంగా నిర్వహించి ఉండాలి. 4) గ్రూపులు సక్రమైన గణాంక, రికార్డు విధానాలను అవలంబించగలిగి ఉండాలి. 5) సంఘం వివరాలతో కూడిన చిన్న మొత్తాల ఋణ పథకాల వివరాలు

ఉపయోగాలు

ఆదాయాభివృద్ధి పథకాలకు సంబంధించి రూ.30,000/- ల నుండి రూ,1. లక్ష వరకు సహాయక సంఘాలు ఋణాన్ని పొందవచ్చు.

సంప్రదించండి

వ్యాపార బ్యాంకులు / ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు / వెలుగు కమ్యూనిటి కో- ఆర్డినేటర్ / ఎం.పి.డి.ఓ /పి.డి. వెలుగు – డి. ఆర్.డి.ఎ.

స్వర్ణ జయంతి గ్రామ రోజ్ గార్ యోజన (ఎస్. జి.ఎస్.వై)[మార్చు]

లక్ష్యం

ఈ కార్యక్రమం లక్ష్యం పేద, నిరుపేద కుటుంబాలను దారిద్య్ర రేఖ ఎగువకు తీసుకురావటం.

అర్హత

సం,, ఆదాయం రూ.1200 /- లకు లోపు ఉన్న పేద, నిరుపేద వర్గాలు ఈ కార్యక్రమానికి అర్హులు

లబ్ధిదారులు

గ్రామాల్లో జీవించే పేదలు ముఖ్యంగా ఎస్.సి., ఎస్.టి., వర్గాలవారు, మహిళలు, కొన్ని ప్రత్యేక వర్గాల వ్యక్తులు 40%, 10%, 40%, 3% మేరకు లబ్ధి పొందగలరు. లబ్ధిదారులు వ్యక్తులు లేదా గ్రూపులు స్వయం సహాయక సంఘాలు కావచ్చు.

ఉపయోగాలు

ప్రాజెక్ట్ పెట్టబడిలో 30 ఎస్.జి.ఎస్.వై. క్రింద రాయితీ కల్పిస్తారు. గరిష్ఠంగా రూ 7,500/- వరకు రాయితీ ఉంటుంది. ఎస్.సి., ఎస్., టి., ల విషయంలో 50 రాయితీ అనగా రూ. 10,000/- వరకు ఉంటుంది. స్వయం సహాయక సంఘాలకు 50% అనగా రూ.1,25,000/- వరకు రాయితీ కల్పిస్తారు.

సంప్రదించండి

గ్రామ పంచాయితీ కార్యదర్శి /సర్పంచ్ / వెలుగు కమ్యూనిటీ కో- ఆర్జినేటర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎం.పి.డి.ఓ) ప్రాజెక్ట్ డైరెక్టర్, వెలుగు జిల్లా గ్రామాభివృద్ధి శాఖ (డి.ఆర్.డి.ఎ.)

జి.ఓ.నెం

జి.ఓ.ఎం.ఎస్.నెం. 223, పిఆర్ & ఆర్ డి (ఆర్ డి -111) డిపార్ట్ మెంట్, తేదీ 18 / 6 / 2005

స్వర్ణ జయంతి షహరి రోజ్ గార్ యోజన (యస్ జెయస్ అర్ వై)[మార్చు]

లక్ష్యం

ఆదాయోత్పత్తి కార్యక్రమాల కోసం నిరుద్యోగ యువతకు ఆర్థికసహాయం

అర్హత

18 – 50 సం,, ల మధ్య వయసు గల దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న పట్టణ ప్రాంత నిరుద్యోగ యువత. కనీస విద్యార్హత 7వ తరగతి.

లబ్ధిదారులు

పట్టణ ప్రాంత నిరుద్యోగ యువత

ఉపయోగాలు

15% రాయితీతో రూ.50,000/- ల వరకు బ్యాంకుల ద్వారా ఋణ సదుపాయం.

సంప్రదించండి

మున్సిపల్ కమీషనర్ /జిల్లా కలెక్టర్

జి.ఓ.నెం

ఆర్.ఓ.సి.నెం. 1421 /98 /యన్1, తేది 27.1.1998

అమ్మ ఒడి పధకం[మార్చు]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అమ్మ ఒడి పథకం జనవరి 9వ తేదీ నుంచి ప్రారంభించారు. పిల్లలను పాఠశాలలకు పంపించే నిరుపేద తల్లికి ఈ పథకం కింద రూ.15,000 ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రగతి ద్వారం వద్ద నుండి సంగ్రహించిన విషయం[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]