ఆంధ్ర ధాతుమాల
స్వరూపం
ఆంధ్ర ధాతుమాల | |
కృతికర్త: | వేదం పట్టాభి రామశాస్త్రులు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | భాష |
ప్రచురణ: | ఆంధ్ర సాహిత్య పరిషత్తు, కాకినాడ |
విడుదల: | 1930 |
పరవస్తు చిన్నయసూరి ఆంధ్ర భాషకు ధాతువులను గురించి ఆంధ్ర ధాతుమాల అనునొక గ్రంథమును రచించెనని ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు 1930లో ముద్రించి ప్రకటించిరి. ఇది చిన్నయసూరి గ్రంథములయందు వ్రాతలో నాతని స్వంత యక్షరములతో లిఖింపబడియుండుట చూచి పరిషత్తువారు దానిని చిన్నయసూరి కృతముగా ప్రకటించిరి. కాని గ్రంథమును నిశితముగా పరిశీలించిన అది యాతని రచన కాదని తెలియుచున్నది. ఈ ధాతుమాలకు పీఠికను వ్రాసిన విద్వాంసులు కూడా దీని రచన గురించి కొంత సందేహమును చూపించిరి. ఆ సందేహము నిశ్చయమైనది. దీనిని వాస్తవముగా రచించినవారు వేదం పట్టాభి రామశాస్త్రులు. వీరు 1820 నాటికే పరమపదించుట వలన ఈ ధాతుమాల చిన్నయసూరి పదునాలుగేండ్ల వయసునాటికే యున్నదని గ్రహించవలెను.
పూర్తిపుస్తకం
[మార్చు]- Scribd.com లో ఆంధ్ర ధాతుమాల పూర్తి పుస్తకం కాపీ. Archived 2013-07-03 at the Wayback Machine