Jump to content

ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము

వికీపీడియా నుండి

తెలుగు భాషా ప్రయోగంలో, వ్యావహారిక భాషోద్యమంలో ఈ గ్రంథం అపురూపమైన రచన, ఎన్నదగిన మైలురాయి. ఈ గ్రంథం గ్రాంథిక భాషను అందలమెక్కించి వ్యావహారికాన్ని కాలదన్నేందుకు సిద్ధమైన కొందరు పండితులను విమర్శిస్తూ, తెలుగులో వ్యావహారిక భాషా ప్రయోగ ఆవశ్యకత వివరిస్తూ రాసిన గ్రంథం. తెలుగు పండిత సమాజంలో అత్యంత ఆదరణ గౌరవం తన పాండిత్యం, దూరదృష్టి ద్వారా సాధించుకున్న గిడుగు ఈ గ్రంథకర్త. నన్నయ కాలం నాటి గ్రాంథికంలో లేఖ రాసి అర్థం కాని గ్రాంథికవాదులను హడలెత్తించడం మొదలుకొని వారు గ్రాంథికమనుకునే భాషలో వ్యావహారికం ఎంతుందో తేల్చడం వరకూ గిడుగు ఉద్యమ రీతి అనూహ్యం, ఆయన పాండిత్యం అనుపమానం. జీవితంలోని తొలి అర్థభాగం గ్రాంథికాన్ని సమర్థించిన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి అనంతరకాలంలో గిడుగును అర్థం చేసుకుని "ఏమైనా అభిమానమంటూ మిగిలిన ఏ పండితుడైనా, కవియైనా తన బిరుదాలూ పతకాలూ అన్నీ రామ్మూర్తి పంతులు గారికి దోసిలొగ్గి సమర్పించుకొని మళ్ళీ ఆయన అనుగ్రహించి ఇస్తే పుచ్చుకోవలసిందే" అన్నారు. విశ్వనాథ సత్యనారాయణ రామ్మూర్తి పంతుల వాదాన్ని అర్థం చేసుకోక, దురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినార ని తేల్చారు. ఇలా అంత ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి తనదైన రంగంలో అద్భుతంగా చేసిన రచన ఇది.

మూలాలు

[మార్చు]

డి.ఎల్.ఐలో ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము పుస్తకప్రతి