Jump to content

ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు (నాటక సంస్థ)

వికీపీడియా నుండి

ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు (నాటక సంస్థ) తెలుగు నాటకరంగ కార్యకలాపాలు విస్తృతంగా జరగడంకోసం ఏర్పాటుచేయబడిన నాటక సంస్థ. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో అప్పుడప్పుడు కొన్ని తెలుగు నాటకరంగ కార్యక్రమాలు మాత్రం జరిగేవి. అదే సయమంలో ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు ఏర్పడింది.[1] 1921 నుండి 1946 వరకు ఈ సంస్థ చురుకుగా పనిచేసింది.

ఈ సంస్థ ప్రదర్శించిన నాటక రకాలు

[మార్చు]
  1. సాంఘిక సంస్కరణ నాటకాలు: ఇవి సంప్రదాయ నాటకాలు. నటీనటులు అనుభవశూన్యలైనా, వీరి ప్రదర్శనకు ఎక్కువ మొత్తంలో డబ్బును గుంజేవి. ప్రేక్షకులు నాటకంలోని వ్యసనాలను చూసి, పరోక్షంగా ఆహ్లాదాన్ని పొందేవారు. ప్రదర్శన విధానంలోని మార్పువలన ప్రేక్షకులు సంస్కరణ బోధనల విసుగును తప్పించుకునేవారు.
  2. సమకాలీన రాజకీయాలపై వచ్చిన నాటకాలు: ఈ నాటకాల్లో చారిత్రక విషయాలు, సంఘటనలు, వ్యక్తుల తత్వాలను వక్రంగా చిత్రించబడ్డాయి. అనంతరం ఆంగ్లేయుల అణిచివేతకు బలియై వాటి స్థానంలో ఇతర నాటకాలు ప్రవేశించాయి.
  3. హిందూ మతోద్ధరణ నాటకాలు: ఇవి సంస్కృతాంధ్ర భాషాకోవిధులైన పండిత ప్రకాండుల కలాలబలంచే వెలువడ్డాయి. ఈతరహా కవులు, మడిమన్యాలననుభవిస్తూ తమ రచనల్లో ఈతరం వారు, భావితరం వారు పాటించాల్సిన నియమనిబంధనల్ని మను, కౌటిల్యుడు ధర్మశాస్త్రాల ఆధారంగా ప్రబోధించారు.
  4. ప్రతిఘటన నాటకాలు: ఈ నాటకాల్లో బెర్నాడ్ షా పోలిన పెద్ద సహేతుంగా ఉండేవి. ఈ కవులు నిరాశ, తిరుగుబాటు తత్వం కలవారుగా కన్పించేవారు. వీరి రచనలు ప్రాముఖ్యం లేని పత్రికల్లో ప్రచురింపబడుతూ కేవలం అభిమానుల పరిధి కూడా దాటేవికాదు. అందువల్ల ఈ విషయాన్ని గ్రమించిన కవులు విందులూ, వినోదాల కాలక్షేపంలో మునిగిపోయారు.

1928 ఇబ్సన్ శత జయంతి సమయంలో అందరి దృష్టి ఆధునిక పాశ్చాత్య నాటకరంగంవైపు మళ్లింది. తెలుగు నాటకరంగం చెల్లాచెదురు కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు నాటక సంస్థ తనవంతు కృషిచేసింది.

మూలాలు

[మార్చు]
  1. కరీంనగర్ జిల్లా నాటకరంగం. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు (ప్రథమ ed.). జయవీర్ కోటగిరి. p. 62.