ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి
ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి తెలుగు రచయిత్రి[1]. ఆమె 2020 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని బాలసాహిత్య విభాగంలో ఎంపిక అయింది.[2]
జీవిత విశేషాలు
[మార్చు]ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి తెలుగు రచయిత్రి, కవయిత్రి. ముఖ్యముగా బాల సాహితీవేత్త. ఆమె కేంద్ర ప్రభుత్వ శాఖ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో అకౌంట్స్ ఆఫీసరుగా పనిచేసి పదవీ విరమణ చేసింది. ఆమె రాసిన కథలు మహారాష్ట్ర వారి పాఠ్య పుస్తకాలు, తెలుగు వాచకములలో 7 వ, 9వ తరగతులకు పాఠ్యాంశములుగా తీసుకొనబడినవి.
ఆమె భారత్ భాషా భూషణ్, లేడీ లెజెండ్, సాహిత్య శ్రీ, ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ, సావిత్రి బాయ్ పూలే స్త్రీ శక్తి అవార్డులు, బాల సాహితీ రత్న, బాలసాహిత్య శిరోమణి మొదలయిన అనేక బిరుదులు పొందింది. ఆమె రాసిన కొన్ని కథలు తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీష్లలో అనువాదం చేయబడినవి.
ఆమె ఆకెళ్ళ అసోసియేషన్, బాలగోకులం సంస్థలు స్థాపించి, రచయితలను, బాలలను గౌరవించి, ప్రోత్సహిస్తున్నారు. రేడియోలో బాలల, కార్మికుల, స్త్రీల కార్యక్రమాల్లో రచించి పాల్గొంటారు.[3]
- 1. కథా మందారం
- 2. అమ్మా! నువ్వు మారావు
- 3. అక్షింతలు
బాల సాహిత్యం:
[మార్చు]- బాల మందారం
- బాల కుటీరం
- బాల నందనం
- అమ్మ మాట - తేనె మూట
- బృందావనం
- లోభి
- మన ఇష్టం
- నిజమైన ధనం
వయోజన విద్యాపుస్తకాలు:
[మార్చు]- మూఢ నమ్మకాలు
- తల్లి-తండ్రుల బాధ్యతలు
కవితా సాహిత్యం:
[మార్చు]- కవితా మందారం
అనువాదం:
[మార్చు]- రష్యన్ జానపద కధలు (ఆంగ్లం నుండి తెలుగు లోకి)
- చైల్డ్ రోజెస్ (‘బాల మందారం’ పుస్తకం ఆంగ్లం లోకి అనువాదం)
మూలాలు
[మార్చు]- ↑ ABN (2023-05-11). "షష్టిపూర్తి కలాలకు సత్కారం". Andhrajyothy Telugu News. Retrieved 2024-10-31.
- ↑ Velugu, V6 (2023-03-24). "44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". V6 Velugu. Retrieved 2024-10-31.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి | సంచిక - తెలుగు సాహిత్య వేదిక" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-12-11. Retrieved 2024-10-31.
- ↑ "Telugu women writers". Aksharayan (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-31.