Jump to content

ఆగ్నీధ్రుడు

వికీపీడియా నుండి

ఆగ్నీధ్రుడు ప్రియవ్రతునికిని సుకన్య కును పుట్టిన పదుగురు కొడుకులలో పెద్దవాఁడు; ఇతని భార్య పూర్వచిత్త. ఇతనికి తన తండ్రి జంబూద్వీపమును ఇచ్చెను. దానిని ఇతఁడు తన కొడుకులగు నాభి, కింపురుషుఁడు, హరి, ఇలావృతుఁడు, రమ్యుఁడు, హిరణ్వంతుఁడు, కురువు, భద్రాశ్వుఁడు, కేతుమాలుఁడు అను తొమ్మండ్రకు పంచి ఇచ్చెను. అదెట్లనిన నాభికి హిమవంతమునకు దక్షిణదేశము అగు భరత ఖండము, కింపురుషునికి దానికి ఉత్తరమున హేమకూట పర్వతమునకు దక్షిణమున ఉండు ఖండము, హరికి హేమకూట పర్వతమునకు ఉత్తరమున నిషధపర్వతమునకు దక్షిణమున ఉండు నైషధము, ఇలావృతునికి నిషధపర్వతమునకు ఉత్తరమున మేరువును మధ్యప్రదేశముగాఁగల ఇలావృతము అను ఖండము, రమ్యునికి ఇలావృతమునకును నీలాచలమునకును నడుమ ఉండు ఖండము, హిరణ్వంతునికి దానికి ఉత్తరమున శ్వేత పర్వతమునకు ఈవల ఉండు శ్వేతఖండము, కురువునకు శ్వేతపర్వతమునకు ఉత్తరమున శృంగవంతముచే చుట్టఁబడిన ఖండము, భద్రాశ్వునికి మేరువు నకు తూర్పున ఉండు ఖండము, కేతుమాలునికి మేరువునకు పశ్చిమమున ఉండు ఖండమును ఇచ్చెను. ఇవియె నవఖండములు. ఇవి నవవర్షములు అనియు అనఁబడును. ..................పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య)