ఆటిజం స్పెక్ట్రం
ఆటిజం స్పెక్ట్రమ్ | |
---|---|
ఇతర పేర్లు | ఆటిజం స్పెక్ట్రమ్ రుగ్మత, ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్ |
ఈ చిత్రాన్ని ఆటిస్టిక్ వ్యక్తి రూపొందించాడు. ఆటిజం అనేక లక్షణాలు (కదులుట, కంటి సంబంధాన్ని నివారించడం వంటివి) ఆటిస్టిక్ వ్యక్తులు సుఖంగా ఉండటానికి సహాయపడే అనుసరణలు. | |
ప్రత్యేకత | మానసిక వైద్యశాస్త్రం, మానసిక వైద్యం |
లక్షణాలు | కమ్యూనికేషన్, సామాజిక సంబంధాలు, ఏ విషయంలోను ఆసక్తి కనపరచక పోవడం, చేసిన పని పదే పదే చేయడం (పునరావృత ప్రవర్తన)తో దీర్ఘకాలిక ఇబ్బందులు |
సంక్లిష్టతలు | ఉద్యోగ సమస్యలు, ఆత్మహత్య |
సాధారణ ప్రారంభం | సాధారణంగా రెండు సంవత్సరాల వయస్సులోపు |
కాల వ్యవధి | దీర్ఘకాలికం |
కారణాలు | ఈ పరిస్థితికి కారణం అనిశ్చితంగా ఉన్నప్పటికీ, ఇది జన్యు, పర్యావరణ కారకాల మిళితం |
రోగనిర్ధారణ పద్ధతి | లక్షణాలు |
చికిత్స | ప్రవర్తనా చికిత్స (behavioural therapy ) జీవించగలిగే నైపుణ్యాల గురించిన బోధనతో చికిత్స. ఈ ప్రయత్నాలలో తరచుగా తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల సహకారము ఉంటుంది. |
తరుచుదనము | 2015 నాటికి ఆటిజం స్పెక్ట్రం వలన 1% మంది ప్రభావితం అవుతున్నారని అంచనా. అమెరికాలో ఇది సుమారు 2.5% పిల్లలను ప్రభావితం చేస్తుందని అంచనా (2016 నాటికి సుమారు 15 లక్షల మంది) |
ఆటిజం స్పెక్ట్రం అంటే బాల్యంలోనే ప్రారంభమయే ఒక మానసిక రుగ్మత, ఇందులో ఆటిజం, ఆస్పెర్గర్ సిండ్రోమ్ అనే విషయం నిర్ధారణ చేయవలసి ఉంటుంది[1]. లక్షణాలు కమ్యూనికేషన్, సామాజిక సంబంధాలు, ఏ విషయంలోను ఆసక్తి కనపరచక పోవడం, చేసిన పని పదే పదే చేయడం (పునరావృత ప్రవర్తన)తో దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ లక్షణాలు సాధారణంగా రెండు సంవత్సరాల వయస్సులోపు గమనించగలరు. రోజువారీ పనులను చేయడంలో, సామాజిక సంబంధాలను కొనసాగించడంలో, ఉద్యోగం నిర్వహించడంలో ఇబ్బందులు, ఆత్మహత్య చేసికోవడం వంటి సమస్యలు కూడా ఉంటాయి.[2]
ఈ పరిస్థితికి కారణం అనిశ్చితంగా ఉన్నప్పటికీ, ఇది జన్యు, పర్యావరణ కారకాల మిళితం అని భావిస్తున్నారు.[3] 65% నుండి 90% మధ్య ప్రమాదం జన్యుపరమైన కారణాల వల్ల అని అంచనా వేశారు. రోగ నిర్ధారణ అనేది లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. 2013లో, DSM-5 ఆటిస్టిక్ డిజార్డర్, ఆస్పెర్గర్ సిండ్రోమ్, పెర్వసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్ను (PDD-NOS) ఇంకా బాల్యంలోని విచ్ఛిన్న రుగ్మత మొదలగునవన్నీ "ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్" లోకే సూచిస్తారు.[4]
ఈ రుగ్మతలకు నివారణ లేనప్పటికీ, చికిత్స కొంతవరకు మెరుగుపరుస్తుంది.[5] సాధారణంగా ఫలితాలు వ్యక్తిగతంగా ఉంటాయి. ప్రవర్తనా చికిత్స (behavioural therapy ) జీవించగలిగే నైపుణ్యాల గురించిన బోధనతో చికిత్స జరుగుతుంటుంది.[3] ఈ ప్రయత్నాలలో తరచుగా తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల సహకారము ఉంటుంది. కొన్ని ఇతర అనుబంధ లక్షణాలను మెరుగుపరచడానికి మందులను ఉపయోగించవచ్చు. అయితే, మందుల వాడకం గురించి బలమైన ఆధారాలు లేవు.
ప్రపంచవ్యాప్తంగా 2015 నాటికి ఆటిజం స్పెక్ట్రం వలన 1% మంది ప్రభావితం అవుతున్నారని అంచనా.[1] అమెరికాలో ఇది సుమారు 2.5% పిల్లలను ప్రభావితం చేస్తుందని అంచనా ఉంది (2016 నాటికి సుమారు 15 లక్షల మంది).[6] స్త్రీల కంటే పురుషులు నాలుగు రెట్లు ఎక్కువగా వ్యాధికి గురి అవుతుంటారు.[5] "స్పెక్ట్రం" అను పదం లక్షణాల రకం, తీవ్రతలో వైవిధ్యాన్ని సూచిస్తుంది . ఫలితాలలో వైవిద్యం ఉంటుంది. తేలికపాటి లక్షణాలు ఉన్న కొంతమంది స్వతంత్రంగా పనిచేస్తారు, జీవిస్తారు. అయితే తీవ్రమైన లక్షణాలు ఉన్నవారికి రోజువారీ జీవితంలో గణనీయమైన మద్దతు అవసరం.
సూచనలు
[మార్చు]- ↑ 1.0 1.1 American Psychiatric Association (2013). "Autism Spectrum Disorder. 299.00 (F84.0)". Diagnostic and Statistical Manual of Mental Disorders, Fifth Edition (DSM-5). Arlington, VA: American Psychiatric Publishing. pp. 50–59. doi:10.1176/appi.books.9780890425596. ISBN 978-0-89042-559-6.
- ↑ Howlin. "Autism spectrum disorder: outcomes in adulthood.".
- ↑ 3.0 3.1 "Autism Spectrum Disorder". NIMH. 2018. Archived from the original on 21 April 2017. Retrieved 21 February 2021.
- ↑ "Autism spectrum disorder fact sheet" (PDF). DSM5.org. American Psychiatric Publishing. 2013. Archived from the original (PDF) on 6 October 2013. Retrieved 13 October 2013.
- ↑ 5.0 5.1 "10 Facts about Autism Spectrum Disorder (ASD)". Early Childhood Development | ACF (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2019. Retrieved 6 November 2019.
- ↑ "HRSA-led study estimates 1 in 40 U.S. children has diagnosed autism". hrsa.gov. 19 November 2018. Archived from the original on 17 October 2019. Retrieved 17 October 2019.