ఆడబొమ్మ
ఆడబొమ్మ (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎస్.నాయుడు |
---|---|
తారాగణం | సాగరిక, హరిప్రసాద్, శ్రీలేఖ |
సంగీతం | చంద్రశేఖర్ |
నిర్మాణ సంస్థ | కేతమనేని పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఆడబొమ్మ 1988 లో విడుదలైన తెలుగు సినిమా. బి.ఎస్.నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాగరిక, హరిప్రసాద్, శ్రీలేఖ నటించగా, చంద్రశేఖర్ సంగీతం అందించారు. కేతమనేని పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను కె.కేతినేని నిర్మించాడు.
కథ
[మార్చు]జూదానికి బానిసైన ఓ పెద్దాయన తన ఆస్తినంతటినీ కోల్పోవడమే కాకుండా, కన్న కూతుర్నీ పణంగా పెట్టి ఓడిపోతాడు. ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి మాట ప్రకారం ఆయన శవం వద్దే గ్రామస్తులందరి సమక్షంలో రూపేశ్‌ను పెళ్లి చేసుకుంటుంది లౌక్య. ఆ రాత్రి ఆమెని అనుభవిస్తాడు రూపేశ్. మరుసటి రోజే డబ్బు కోసం ఆమెను మరొక వ్యక్తితో తార్చాలని చూస్తాడు. లౌక్య ఎదురు తిరుగుతుంది. దాంతో ఆమెని క్యాబరే డాన్సర్‌గా మార్చి డబ్బు సంపాదిస్తుంటాడు రూపేశ్. పోలీసులు అరెస్ట్ చేయడంతో క్యాబరే మానేస్తుంది లౌక్య. ఒక హత్య కేసులో భర్తకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుంది. దాంతో రూపేశ్‌కు జైలు శిక్ష పడుతుంది.
నాలుగిళ్లలో అంట్లు తోముకుంటూ బతుకు సాగిస్తుంటుంది లౌక్య. జైలు నుంచి బయటికొచ్చిన రూపేశ్ ఆమెని డబ్బు కోసం వేధించడమే కాకుండా తమకి పుట్టిన కూతురు ఎక్కడుందో చెప్పమని గొడవపడతాడు. కూతుర్ని కూడా క్యాబరే డాన్సర్‌గా మార్చాలని అతని ఆలోచన. కూతుర్ని రహస్యంగా వేరో వూర్లో చదివిస్తున్న లౌక్య ఆమెకి ప్రమాదం ఏర్పడిందని భావించి పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది. పెళ్లి వేదికపై లౌక్య క్యాబరే చేస్తున్న ఫొటోలు చూపించి తాళి కట్టే సమయానికి ఆ పెళ్లి ఆగిపోయేలా చేస్తాడు రూపేశ్. ఆఖరుకి కన్న కూతురి మెడలోనే తాళి కట్టేందుకు సిద్ధమైన రూపేశ్‌ని లౌక్య ఏం చేసిందన్నది పతాక సన్నివేశం.
నటవర్గం
[మార్చు]- సాగరిక - లౌక్య పాత్రలో
- హరిప్రసాద్
- శ్రీలేఖ
- జీవా - రూపేష్
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- పి.ఎల్.నారాయణ
- ప్రసాద్ బాబు
- త్యాగరాజు
- రాజ్యలక్ష్మి
- నిర్మల
- కళ్యాణి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: బి.ఎస్.నాయుడు
- సంగీతం: చంద్రశేఖర్
- నిర్మాణ సంస్థ: కేతినేని పిక్చర్స్
- సంభాషణలు: పూసల
- పాటలు: చిమ్మపూడి శ్రీరామమూర్తి
- ఛాయాగ్రహణం: కిషన్ సాగర్
- కూర్పు: కృష్ణారెడ్డి
- కళ: విజయకుమార్
- కొరియోగ్రాఫీ: ప్రకాష్
- నిర్మాత: ఆర్. కేతినేని
- దర్శకుడు: బి. సత్యానాయుడు
పాటల జాబితా
[మార్చు]1. నందామయ నరుడ నందామయా , రచన: చిమ్మపూడి శ్రీరామమూర్తి, గానం.శిష్ట్లా జానకి
2.మావిచిగురులా కుహు కుహూ కుహూ మరిగిన కోయిల, రచన: చిమ్మపూడి శ్రీరామమూర్తి, గానం.మనో, వాణి జయరాం
3.సంఘం చేసిన బొమ్మ ఈ ఆడబొమ్మ, రచన: చిమ్మపూడి శ్రీరామమూర్తి, గానం.ఎస్.జానకి బృందం.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
బాహ్య లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆడబొమ్మ
- "Aada Bomma (1988)". Aada Bomma (1988). Retrieved 2020-08-14.