ఆత్మచరిత్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆత్మచరిత్రము
Atmacharitramu book cover.png
పుస్తకపు లోపలి అట్ట
కృతికర్త: రాయసం వెంకట శివుడు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: జీవితచరిత్ర
విభాగం (కళా ప్రక్రియ): స్వీయచరిత్ర
ప్రచురణ: ఆంధ్ర పత్రిక
విడుదల: 1933
రాయసం వెంకట శివుడు

ఆత్మచరిత్రము రాయసం వెంకట శివుడు (1870-1953) స్వీయచరిత్ర. ఇది ఆంధ్రగ్రంథమాల వారి 22వ పుష్పంగా కాశీనాథుని నాగేశ్వరరావు గారిచే 1933 సంవత్సరం ప్రచురించబడింది.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈ పుస్తకం నాలుగు భాగాలుగా వ్రాయబడినది; మొదటిది విద్యార్థిదశ, రెండవది ఉపాధ్యాయదశ, మూడవది ఉపన్యాసకదశ, నాలుగవది విశ్రాంతిదశ. చివరిగా అనుబంధములో రాయసంవారి వంశవృక్షాన్ని తెలియజేశారు.

  • ప్రథమభాగము: విద్యార్థిదశ:[1] - 1. బాల్యము, 2. గోపాలపురము, 3. బంధువియోగము, 4. రేలంగి, 5. దుష్కార్యము, 6. రాజమహేంద్రవరము, 7. అల్లరిచేష్టలు, 8. స్నేహసహవాసములు, 9. కళాశాలలో ప్రథమసంవత్సరము, 10. స్వైరవిహారము, 11. పునర్విమర్శనము, 12. చర్వితచర్వణము, 13. నియమబద్ధజీవితము, 14. వైష్ణవ క్రైస్తవ మతములు, 15. రామభజనసమాజసంస్కరణము, 16. హిందూధర్మమా, బ్రాహ్మమతమా?, 17. సోదరీనిర్యాణము, 18. నూతన దృక్పథము, 19. సంఘసంస్కరణసమాజము, 20. జననీజనకులతోడి సంఘర్షణము, 21. ముత్తుస్వామిశాస్త్రి విపరీతవిధానము, 22. జనకుని విచిత్ర చిత్తవృత్తులు, 23. వెంకటరావు సావాసము, 24. కమలామనోహరులు, 25. ఏకాంతజీవితము, 26. పరీక్షాపూర్వదినములు, 27. పరీక్షలు, 28. పరీక్షావిజయము, 29. చెన్నపురి ప్రయాణము, 30. జనకుని వ్యవహారదక్షత, శకటవ్యాపారఫలితము, 31. రచనావ్యాసంగము, 32. పత్రికాస్థాపనము, 33. క్రొత్తకోడలు, క్లిష్టపరిస్థితులు, 34. పెద్దపలుకులు, 35. రంగనాయకులునాయఁడుగారు, 36. సత్యసంవర్థని, 37. చెన్నపురి స్నేహితులు, 38. సంరంభము, 39. స్నేహభాగ్యము, 40.రోగారోగ్యములు, 41. వైరివర్గము, 42. సౌఖ్యదినములు, 43. పట్టపరీక్ష, 44. ఉపాధ్యాయవృత్తి, 45. సైదాపేట, 46. వేసవి సెలవులు, 47. వ్యాధిగ్రస్తత, 48. ఆస్తికపాఠశాల, 49. సైదాపేట చదువు, 50. పత్రికాయౌవనము
  • ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ:[2] - 1. బెజవాడ, 2. ప్రార్థనసమాజము, 3. వేసవిసెలవులు, 4. "జనానాపత్రిక", 5. మరల బెజవాడ, 6. అమలాపురోద్యోగము, 7. ధన్వాడదంపతులు, 8. యం. యే. పరీక్ష, 9. కష్టకాలము, శుభకార్యము, 10. బెజవాడ స్నేహితులు, 11. నూతనవత్సరము, 12. నిత్యవిధులు, 13. సహవాసులు, 14. ప్రాఁతక్రొత్తలు, 15. కీళ్లవాతము, 16. తుదకు విజయము, 17. "ప్రత్యక్ష భగవత్సందర్శనము", 18. ప్రాచీన నవీనసైతానులు, 19. సంఘసంస్కరణసభ, 20. చెన్నపురి యుద్యోగము, 21. ఆశాభంగము, 22. మరల బెజవాడ, 23. "చిప్పల శివరాత్రి", 24. పెండ్లి బేరములు, 25. ఇంటితగవులు, మండలసభలు, 26. తమ్ముని వివాహము, 27. ప్రహసన విమర్శనము, 28. "హిందూసుందరీమణులు", 29. పితృనిర్యాణము, 30. జనకసంస్మరణము, 31. ప్రాథమికపరీక్ష, 32. "మనస్తత్త్వపరిశోధకసంఘము", 33. చెల్లెలివివాహము, 34. "జీవాత్మ - పరమాత్మలు", 35. నిత్యవిధులు, 36 "సతీయుత సంఘసంస్కారి", 37. న్యాయవాది పరీక్ష, 38. "బాల్యస్వర్గము", 39. "వీరసంస్కర్త", 40. సమష్టికుటుంబ కష్టములు, 41. క్రొత్త హరికథలు, 42. "హిందూసుందరీమణులు", 43. చీఁకటి వెన్నెలలు, 44. మహలక్ష్మి మరణము, 45. "చిత్రకథామంజరి", 46. వీరేశలింగముగారి సాయము, 47. ఉద్యోగప్రయత్నము, 48. తమ్మునివ్యాధి, 49. సూర్యనారాయణుని నిర్యాణము, 50. సందిగ్ధావస్థ, 51. నూతనోద్యోగము
  • తృతీయభాగము : ఉపన్యాసకదశ:[3] 1. పర్లాకిమిడిలో ప్రథమదినములు, 2. క్రొత్తప్రదేశము, 3. పరిస్థితులలోని మార్పు, 4. సుఖదినములు, 5. "జనానాపత్రిక", 6. విజయనగర నివాసము, 7. గుంటూరునందలి యుద్యోగము, 8. జననీసంస్మరణము, 9. నూతనపరిస్థితులు, 10. వెంకటరత్నమునాయఁగారు, 11. ఉద్యోగప్రయత్నములు, 12. చెల్లెలి మరణము, 13. కలకత్తా నివాసము, 14. చన్నపురిచక్షువులకు బంగాళాపద్ధతులు", 15. సభలు, సమావేశములు, 16. 'అబ్బావు'మరణము, 17. దు:ఖోపశమనప్రయత్నములు, 19. నివేశనస్థలసంపాదనము, 20. శుభాశుభములు, 21. గృహశంకుస్థాపనము, 22. గృహప్రవేశము, 23. నెల్లూరుకళాశాల, 24. నెల్లూరునివాసము: రెండవవత్సరము, 25. కథావిరచనము, 26. శుభాశుభములు, 27. నెల్లూరు గాలివాన, 28. ఉద్యోగవిరామము
  • చతుర్థభాగము : విశ్రాంతిదశ:[4] 1. తొలిదినములు, 2. నూతన పరిస్థితులు, 3. అకాలమరణము, 4. హరిజనోద్యమము

మూలాలు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: