ఆధునికాంధ్ర వాఙ్మయ వికాస వైఖరి
ఆధునికాంధ్ర వాఙ్మయ వికాస వైఖరి 1937 సంవత్సరంలో ముద్రించబడిన తెలుగు పుస్తకం.
జయంతి రామయ్య పంతులు వ్యవహారిక-గ్రాంథిక వాదోపవాదాల కాలంలో అత్యంత చురుకైన పాత్ర వహించిన పండితుడు. ఆయన ఆధునికాంధ్ర భాషా వైతాళికుడు, అనుపమ పండితుడు గిడుగు రామమూర్తి పంతులును ఎదిరించి గ్రాంథిక భాషను సమర్థిస్తూ వ్యవహారిక భాషను తీవ్రంగా నిరసిస్తూ కొనసాగిన జోదు. వ్యవహారిక భాషను గ్రామ్యమని నిరసించి చివరకు ఆయన వాదం ఆధునిక సాహిత్యయుగంలో కొట్టుకుపోయినా ఆయన పాండిత్యం మాత్రం ఎన్నదగ్గది. ఈ గ్రంథం ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా ఆయన ఈ గ్రంథాన్ని వెలువరించారు. తెలుగు సాహిత్యంలోని నాటకం, కవిత్వం మొదలైన శాఖల్లో ఆధునిక యుగావిర్భావాన్ని గురించి చక్కని విమర్శ రచన చేశారాయన. చివరిలో చేసిన గ్రామ్యభాషా ఖండనం వ్యవహారిక భాషోద్యమ చరిత్రలో చేరే రచన. ఆ రీత్యా ఈ గ్రంథానికి ఆంధ్ర సాహిత్య చరిత్రలో సముచిత స్థానమే ఉన్నట్టు చెప్పవచ్చు.
విషయ సూచిక
[మార్చు]- 1 వ అధ్యాయము - అవతారిక
- 2 వ అధ్యాయము - నాటకములు
- 3 వ అధ్యాయము - వివిధ గ్రంథములు
- 4 వ అధ్యాయము - కృతి విమర్శనము
- 5 వ అధ్యాయము - భావకవిత్వము
- 6 వ అధ్యాయము - గ్రామ్యవాద విమర్శనము
- అనుబంధము