ఆధునిక చిత్రకళకు సేవచేసిన శ్రీమతి సారా అబ్రహాం
ఆధునిక చిత్రకళకు సేవచేసిన శ్రీమతి సారా అబ్రహాం(8-2-1928-4-8-2024) సారా అబ్రహాం ట్రావెన్కోర్ లోజన్మించింది, తల్లి ఎలియమ్మ, తండ్రి పౌలోస్ మథన్.బ్యాంకు ఉన్నతోద్యోగి, వీరికి నలుగురు కుమార్తెలు. తండ్రి పిల్లల చదువులకోసం మద్రాసుకు మకాం మార్చి, చెట్ పట్ లో అడయారు నది సమీపంలో స్థిరపడ్డారు. సారా ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చదివారు. ఆ కాలేజీ ప్రిన్సిపల్ సారాను కళావిషయాలు నేర్చుకోమని ప్రోత్సాహం ఇచ్చారు.సారాను ఆమె తండ్రి చిత్రలేఖనం నేర్చుకోడానికి కలకత్తా పంపాడు. అక్కడే ఆమెలో కళాతృష్ణ మేల్కొన్నది. సారా అబ్రహాంకు చిన్నవయసులోనే పెళ్ళయింది, ఆమె భర్తతో బొంబాయికి మకాం మార్చింది. బొంబాయిలో యువ ఏం.ఎఫ్ హుస్సేన్,బికాష్, భట్టాచార్జీ, వంటి యువ కళాకారుల కళతో ఆమెకు పరిచయం అయింది. వాళ్ళ paintaings ప్రదర్శనకు వేదిక అవసరమయింది. సారా బొంబాయిలో యువ కళాకారుల చిత్రాల ప్రదర్శనలు ఏర్పాటుచేసి "కళాయాత్ర" అనే traveling exhibition ద్వారా, వాటిని సాధారణ ప్రజలవద్దకు తీసుకొని వెళ్ళింది. ఆమె ఇక తిరిగి చూడలేదు, కళాప్రేమికురాలు, కళాభిగ్జురాలు, కళాబంధు అని కీర్హి పొందింది. ఆమె జీవితాన్ని పూర్తిగా ఆధునిక చిత్రకారుల కళను ప్రజలవద్దకు తీసుకొని వెళ్ళడానికి అంకితం చేసింది. శ్రీమతి సారాకు మరియమ్, ఎలిషీబా అనే ఇద్దరు కుమార్తెలు, కుమారుడు కురువెళ్ల. కుమార్తె మరియం.ను ఎన్.రాం అనే సుప్రసిద్ధ పత్రికా రచయిత, హిందూ పత్రిక కస్తూరి కుటుంబానికి చెందినవ్యక్తి పెళ్లిచేసుకొన్నాడు. మూలాలు:The Hindu, dated 04-824, ది వైర్.