ఆనంద్ మహీంద్రా
ఆనంద్ గోపాల్ మహీంద్రా | |
---|---|
జననం | బాంబే, బాంబే స్టేట్, భారతదేశం (ప్రస్తుతం ముంబై) | 1955 మే 1
జాతీయత | ఇండియన్ |
విద్యాసంస్థ | హార్వర్డ్ విశ్వవిద్యాలయం (బి.ఎ., ఎం.బి.ఎ.)[1][2] |
వృత్తి | వ్యాపారవేత్త |
నికర విలువ | US$1.8 బిలియన్ (ఏప్రిల్ 2021)[3] |
బిరుదు | ఛైర్మన్, మహీంద్రా గ్రూప్ |
జీవిత భాగస్వామి | అనురాధ మహీంద్రా |
పిల్లలు | ఇద్దరు కుమార్తెలు |
ఆనంద్ గోపాల్ మహీంద్రా (జననం 1955 మే 1) ఒక భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త. ఆయన మహీంద్రా గ్రూప్ ప్రస్తుత చైర్మన్.[4][5][6][7] ముంబైకి చెందిన ఈ బిజెనెస్ గ్రూప్ లో ఏరోస్పేస్, అగ్రిబిజినెస్, ఆటోమోటివ్, స్పేర్స్, నిర్మాణ పరికరాలు, డిఫెన్స్, ఎనర్జీ, వ్యవసాయ పరికరాలు, ఆర్థిక, భీమా, పారిశ్రామిక పరికరాలు, సమాచార సాంకేతికత, విశ్రాంతి, ఆతిథ్యం, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, ఆఫ్టర్ సేల్స్, రిటైల్.. ఇలా పలురకాల వ్యాపారాలున్నాయి.[8] ఈ మహీంద్రా అండ్ మహీంద్రా సహ వ్యవస్థాపకుడు జగదీష్ చంద్ర మహీంద్రా మనువడు ఆనంద్ మహీంద్రా నికర విలువ 2020 జనవరి నాటికి $1.6 బిలియన్లుగా అంచనా వేయబడింది.
ఆనంద్ మహీంద్రా హార్వర్డ్ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి.[9] 1996లో ఆయన భారతదేశంలో నిరుపేద బాలికల విద్య కోసమై నాన్హి కాలీ అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించాడు.[10][11] ప్రపంచంలోని 50 మంది గొప్ప నాయకులలో ఆయనను ఒకరిగా ఫార్చ్యూన్ మ్యాగజైన్ ఎంపికచేసింది.[12] అదే మ్యాగజైన్ 2011లో ఆసియాలోని 25 అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల జాబితాలో ఆనంద్ మహీంద్రా పేరు చేర్చింది.[13] ఆనంద్ మహీంద్రాను ఫోర్బ్స్ (ఇండియా) 2013 సంవత్సరానికి 'ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్'గా గుర్తించింది.[14] ఆయనకి 2020 జనవరిలో భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు లభించింది.[15][16]
జీవితం తొలి దశలో
[మార్చు]1955 మే 1న ముంబైలో దివంగత పారిశ్రామికవేత్త హరీష్ మహీంద్రా, ఇందిరా మహీంద్రా దంపతులకు ఆనంద్ మహీంద్రా జన్మించాడు.[17] ఆయనకు అనుజ శర్మ, రాధికా నాథ్ అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.[18] అతను లవ్‌డేల్ లోని లారెన్స్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసాడు.[19] ఆ తరువాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఫిల్మ్ మేకింగ్, ఆర్కిటెక్చర్ కోర్సులనును అభ్యసించాడు, అక్కడ అతను 1977లో మాగ్నా కమ్ లాడ్ పట్టభద్రుడయ్యాడు. 1981లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి తన ఎం.బి.ఎ పూర్తి చేసాడు.[9][20]
మూలాలు
[మార్చు]- ↑ Bellman, Eric (6 October 2010). "Mahindra Donates $10 Million to Harvard - WSJ.com". Online.wsj. Retrieved 24 January 2011.
- ↑ Anand Mahindra – Harvard Humanities 2.0
- ↑ "Forbes profile: Anand Mahindra". www.forbes.com. Retrieved 29 April 2021.
- ↑ "Who We Are: Leadership – Anand Mahindra". Mahindra. Archived from the original on 10 జూలై 2014. Retrieved 2 July 2014.
- ↑ Bhupathi Reddy (30 August 2015). "Top 10 Entrepreneurs of India". EntrepreneurSolutions.com. Archived from the original on 26 January 2016.
- ↑ Srikar Muthyala (29 September 2015). "The List of Great Entrepreneurs of India in 2015". MyBTechLife. Archived from the original on 14 January 2016.
- ↑ "Pawan Goenka named MD of Mahindra; Anand Mahindra to be executive chairman". Livemint. 11 November 2016.
- ↑ "Tata in Forbes' top 20 most reputed firms". Times of India. Retrieved 2 July 2014.
- ↑ 9.0 9.1 "ANAND G. MAHINDRA, MBA 1981". Alumni. 1 January 2008.
- ↑ "Students: విద్యార్థినుల చదువుకు సాయం". web.archive.org. 2022-07-24. Archived from the original on 2022-07-24. Retrieved 2022-07-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "ET Awards: Mahindra & Mahindra wins Corporate Citizen award for empowering the girl child". Economic Times. 5 September 2017.
- ↑ "Fortune ranks the World's 50 Greatest Leaders". CNN Money. Retrieved 2 July 2014.
- ↑ "25 most powerful businesspeople in Asia". CNN Money. Retrieved 2 July 2014.
- ↑ "anand mahindra is forbes india entrepreneur for the year". CNN Money. Archived from the original on 17 సెప్టెంబరు 2014. Retrieved 2 July 2014.
- ↑ "Anand Mahindra, Venu Srinivasan to be honoured with Padma Bhushan; Naukri.com founder to get Padma Shri". The Economic Times. 26 January 2020. Retrieved 26 January 2020.
- ↑ "MINISTRY OF HOME AFFAIRS" (PDF). padmaawards.gov.in. Retrieved 25 January 2020.
- ↑ "Anand Mahindra". iloveindia.com. Retrieved 16 October 2017.
- ↑ "To Think and to Question". harvardmagazine.com. 27 April 2011.
- ↑ "Kabaddi deserves a league of its own: Anand Mahindra". Economic Times. 10 April 2014.
- ↑ "Top gun". Business Today. 2 October 2011.