మహీంద్రా & మహీంద్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహీంద్రా స్కార్పియో GLX టర్బో 2.5 భూటాన్ దేశములో

మహీంద్రా & మహీంద్రా (Mahindra & Mahindra Limited (M&M)) అనేది భారతదేశంలో ఉన్న ఒక ప్రసిద్ధ ఆటోమొబైల్ తయారీ సంస్థ. కంపెనీ ప్రధాన కార్యాలయం భారతదేశంలోని ముంబై నగరంలో ఉన్నది. 1945సంవత్సరంలో ప్రారంభమైనప్పటి నుంచి, గత ఆరు దశాబ్దాల నుంచి మార్కెట్ లో అత్యంత విశ్వసనీయమైన కార్లలో ఒకటిగా, తన కార్లను తయారుచేయడం ద్వారా కంపెనీ బలంగా ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక అసెంబ్లీ యూనిట్లను కలిగి, కార్యకలాపాల సంబంధించినంత గ్లోబల్ కంపెనీగా ఉన్నది.

భారతదేశంలోనే గాక చైనా, అమెరికా, బ్రిటన్ తో పాటు ఇతర దేశాలలో దాని అసెంబ్లీ యూనిట్లను కలిగి ఉంది. మహీంద్రా కార్లకు, ముఖ్యంగా ఎస్ యువిలు, ట్రాక్టర్ లకు భారతదేశంలోనే కాకుండా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, మలేషియా, ప్రపంచంలోని ఇతర దేశాలలో అధిక డిమాండ్ కలిగి ఉంది.

మహీంద్రా 575 డి -ట్రాక్టర్

మహీంద్రా ఎస్ యువిలు, సెలూన్ కార్లు, పికప్ వేహికల్స్, లైట్ వెయిట్ కమర్షియల్ వేహికల్స్, హెవీ వెయిట్ కమర్షియల్ వేహికల్స్, మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్ లను తయారు చేస్తుంది[1].

చరిత్ర[మార్చు]

1945లో స్టీల్ ట్రేడింగ్ కంపెనీగా స్థాపించబడి, ఐకానిక్ విల్లీస్ జీపును భారతీయ రోడ్లపైకి తీసుకురావడానికి 1947 లో ఆటోమోటివ్ తయారీలో ఈ సంస్థ స్థాపించబడినది. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలలో 180,000 మందికి పైగా ఉద్యోగులతో 16.5 బిలియన్ అమెరికన్ డాలర్ల బహుళజాతి సమూహంగా ఉన్న సంస్థ మహీంద్రా & మహీంద్రా సంస్థ పురోభివృద్ధి జరిగి, ప్రతి ఆధునిక ఆర్థిక వ్యవస్థకు పునాదిని ఏర్పరచే 18 కీలక పరిశ్రమలకు విస్తరించాయి[2] వాటిలో ఏరోస్పేస్, ఆఫ్టర్ మార్కెట్, అగ్రిబిజినెస్, ఆటోమోటివ్, కాంపోనెంట్స్, కన్స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్, కన్సల్టింగ్ సర్వీసెస్, డిఫెన్స్, ఎనర్జీ, ఫార్మ్ ఎక్విప్ మెంట్, ఫైనాన్స్, ఇన్స్యూరెన్స్, ఇండస్ట్రియల్ ఎక్విప్ మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లీజర్ అండ్ హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, రిటైల్,టూ వీలర్స్ వంటి రంగాలలో ప్రస్తుతం ఉన్నది[3]

మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్
Typeపబ్లిక్
ISININE101A01026
పరిశ్రమవాహనాలు
స్థాపన2 అక్టోబరు 1945; 78 సంవత్సరాల క్రితం (1945-10-02)
Jassowal, Ludhiana, Punjab, India
Founders
ప్రధాన కార్యాలయంముంబై, మహారాష్ట్ర,
Areas served
ప్రపంచవ్యాప్తంగా
Key people
Products
Production output
Decrease 4,76,043 vehicles (2020)
RevenueIncrease 74,277.78 crore (US$9.3 billion)[5] (FY2021)
Increase 8,411.10 crore (US$1.1 billion)[5] (FY2021)
Increase 3,347.41 crore (US$420 million)[5] (FY2021)
Total assetsIncrease 1,66,462.49 crore (US$21 billion)[5] (FY2021)
Total equityIncrease 41,581.92 crore (US$5.2 billion)[5] (FY2021)
Number of employees
40,619 (2021)[5]
ParentMahindra Group
Subsidiaries

అభివృద్ధి[మార్చు]

అక్టోబర్ 1945లో మహీంద్రా & మొహమ్మద్ లిమిటెడ్ సంస్థకు 1948 సంవత్సరంలో మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ అనే పేరు పెట్టారు. 1965లో మహీంద్రా అండ్ మహీంద్రా తేలికపాటి ఆటోమొబైల్స్ నిర్మించే ప్రాజెక్టును ప్రారంభించిన సంవత్సరం. మహీంద్రా అండ్ మహీంద్రా అత్యంత ప్రసిద్ధి చెందిన మితుషిభిషి (MITSUBISHI) తో భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తరువాత అమెరికాకు చెందిన ఒక కంపెనీతో ఒక ఒప్పందం, 1965లో ఒక ప్యాసింజర్ కారు కోసం ట్రాక్ ను నిర్మించడానికి కంపెనీకి వీలు కల్పించింది. 1982 సంవత్సరంలో, మహీంద్రా అండ్ మహీంద్రా తమ బ్రాండ్ ట్రాక్టర్లను పెట్టింది. అప్పటి నుంచి, మహీంద్రా & మహీంద్రా భారతదేశ మార్కెట్ లో ట్రాక్టర్ల ప్రసిద్ధ ఉత్పత్తిదారులుగా మారింది. మహీంద్రా & మహీంద్రా ప్రజాదరణ వెనుక కారణం వారి అద్భుతమైన ఇంటీరియర్, అందించే సౌకర్యంతో ప్రతి భారతీయ కుటుంబానికి నాలుగు చక్రాల వాహనాన్ని స్వంతం చేసుకునే సామర్థ్యాన్ని కల్పించడం తో, వాహనాల నిర్మాణం చాలా బలంగా,ఆకర్షణీయంగా, సరసమైన ధరకు అంద చేయడం లక్ష్యం గా పెట్టుకున్నది. అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా అండ్ మహీంద్రా నాలుగు చక్రాల వాహనాలలో ఒకటి స్కార్పియో.ఈ వాహనం విపరీతమైన ప్రజాదరణ పొందింది. అదే స్థాయిలో ఐలో( XYLO) ప్రజాదరణను కలిగి ఉంది.

మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్లు వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిచింది. మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశం వ్యవసాయ రంగములో ఒక విప్లవాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు, వ్యవసాయం కొరకు మాత్రమే కాకుండా, ఇతర అవసరాల కొరకు కూడా గ్రామాల్లో అనేక ట్రాక్టర్ లను వాడటం జరుగుతున్నది.[6]

ఉత్పత్తులు[మార్చు]

మహీంద్రా కంపెనీ తన ఉత్పత్తులు అమ్మకాలు, వాటి సర్వీస్ కొరకు దేశవ్యాప్తంగా 530 మంది పంపిణీ దారులతో ఉన్నది. మహీంద్రా కార్లు ప్రపంచవ్యాప్తంగా,  ఇతర బ్రాండ్ ల తయారీదారులతో భాగస్వామ్యం లేదా సహకారంతో విక్రయించబడతాయి. మహీంద్రా ప్రస్తుతం ఎస్ యువిలు, ఎమ్ యువిలు,సియువిల  భారతదేశంలో ప్యాసింజర్ యుటిలిటీ వాహనాల  అతిపెద్ద విక్రేతల్లో ఒకటిగా ఉంది. మహీంద్రాకు ప్రస్తుతం ఫార్ములా-ఇ ఎలక్ట్రిక్ రేసింగ్ సిరీస్ లో పాల్గొనే మోటార్ స్పోర్ట్ డివిజన్ కూడా ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా కొన్ని రకాల వాహనాల ధరలు ఈ విధంగా ఉన్నాయి.[7]

  • మహీంద్రా బొలెరో మ్యాక్సిట్రక్ ప్లస్ ఆర్ లు. 7.49 - 7.89 లక్షలు.
  • మహీంద్రా బొలెరో పిక్యుపి ఎక్స్ ట్రా స్ట్రాంగ్ లు. 8.71 - 9.39 లక్షలు.
  • మహీంద్రా బొలెరో క్యాంపర్స్. 9.27 - 9.76 లక్షలు.
  • మహీంద్రా బొలెరో నియోర్స్. 9.29 - 11.78 లక్షలు.
  • మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆర్ లు. 11.99 - 19.49 లక్షలు.

మహీంద్రా యూనివర్శిటీ[మార్చు]

టెక్ మహీంద్రా గా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఆరేళ్ల క్రితం ఏర్పాటు చేసిన తన ఇంజనీరింగ్ కళాశాల మహీంద్రా యూనివర్సిటీ (ఎంయూ)ను ప్రారంభించినది[8]. ప్రస్తుతం ఉన్న 130 ఎకరాల విస్తీర్ణంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డి కోర్సులను అందిస్తాయి. మహీంద్రా యూనివర్శిటీ అనేది టెక్ మహీంద్రా లాభాపేక్షలేని సబ్సిడరీ అయిన మహీంద్రా ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఈఐ)లో భాగం గా ఉంది.[9] [10]

మూలాలు[మార్చు]

  1. "About Mahindra India » Mahindra Car Models India, company, products, and automobiles | AutoPortal.com®". autoportal.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-03-05. Retrieved 2022-07-05.
  2. "Mahindra Careers at Businesses | Mahindra Jobs | Mahindra". www.mahindra.com. Retrieved 2022-07-05.
  3. chcom (2013-07-15). "Mahindra & Mahindra". CompaniesHistory.com - The largest companies and brands in the world (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-07-05.
  4. "Mahindra appoints Anish Shah as the MD and CEO, effective from April 2". Livemint. 26 March 2021. Retrieved 12 July 2021.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "Annual Report 2020-21" (PDF). bseindia.
  6. "Mahindra & Mahindra History, Company Profile, Origin, Founded". Auto News Reporter (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-12. Retrieved 2022-07-07.
  7. "Mahindra Cars Price - Mahindra New Models 2022 Reviews & Showrooms". CarDekho (in ఇంగ్లీష్). Retrieved 2022-07-07.
  8. "University". www.ugc.ac.in. Retrieved 2022-07-07.
  9. Majumdar, Romita (2020-07-24). "Mahindra Group launches university for interdisciplinary learning". mint (in ఇంగ్లీష్). Retrieved 2022-07-07.
  10. Kumar, N. Ravi (2020-07-24). "Mahindra Group launches Mahindra University in Hyderabad". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-07-07.