ఆన్ హిందూయిజం డోని వెండిగర్ పుస్తకం
వెండిగర్ డోని పుస్తకం "ఆన్ హిందూయిజం"లో కొన్ని ఆసక్తికర విషయాల పరిచయం. ఆహుర మాజ్డలో అసుర పదానికి దయాగుణం కలిగిన శక్తిగా పేర్కొనబడింది. తర్వాత హిందూ పురాణాల్లో ఎంతో దయాగుణం కలిగిన శక్తులు దుష్టశక్తులుగా కనిపిస్తాయి. వైదిక సాహిత్యంలో, పర్షియా సాహిత్యం లోని Devas క్రైస్తవంలో Devils గా మారిపోయారు. వైదికసాహిత్యంలో 'క్లీబ' అంటే impotant man(నపుంసకుడు), పుంశ్చలి అంటే manchaser, కామపిశాచిని పోలిన ఆడదిగా మారిపోయింది. 'కితవ' అంటే జూదగాడు, impotent manగా మారాడు. వైదిక సాహిత్యంలో భూమి స్త్రీ, ఆకాశం పురుషుడు. Rejected child ను important man గా భావిస్తారు. బ్రాహ్మణాలు మంచు లేక, mistను స్పష్టంగా వర్ణించాయి. Evil అని అస్పష్టంగా వర్ణించడంవల్ల ఈ వదులు కొసలు (loose ends) కొందరిలో హిందూ తత్వశాస్త్రాలకు బోలెడంత వ్యాఖ్య చేయను అవకాశం లభించింది. లింగం, శివ పదాల ప్రస్తావన మొదట లేదు. రుద్రుడిపేరు మొట్టమొదట కనిపిస్తుంది.
ఒక hyman లో ప్రస్తావన మగకోతికి, ఇంద్రుడికి sexual competition సందర్భంగా 'శిశ్నం' అనే పదం' రెండు వేద మంత్రాల్లో వస్తుంది. BC 600 నాటికి ఉపనిషత్తుల్లో లింగం పదం కనిపిస్తుంది. BC 600 నాటి ఉపనిషత్తుల్లో లింగం పదం ప్రస్తావన సాధారణ అర్థంలో smoke , fire లాగా ఉంది. ఆ పదం క్రమంగా జెండర్ కు గుర్తుగా, పిమ్మట శివుడిగురించి, శివుడికి చిహ్నంగా, స్పష్టంగా శివుణ్ణి లింగం అనడం కనిపిస్తుంది. 12 వ శతాబ్దినాటి పెరియపురాణంలో తిన్నడిగాథ మొదటిసారి చూస్తాం. లింగం sexual గా, asexul గా రెండువిధాలుగా భావించబడింది. అణ్ కురి, పెణ్ కురి male sign and female sign. Kuri=జననేంద్రియం . బాలిచేయబడే జంతువులు=pashus=sacrificial victims man, horse, bull and goatవగయిరా.
పురాణాలన్నిటిలో స్కాందపురాణం విపరీతంగా మార్పులు, చేర్పులు చేయబడిన పురాణం. ప్రక్షిప్తాలు అమితంగా చేరిన పురాణం. రకరకాల భావజాలాలు, స్థలపురణాలు ఇందులో కలిపేయబడినవి. ఏపురాణమో గుర్తులేకపోతే "స్కాంద పురాణం చూడండి" అని పౌరాణికులు అనడం వాడుక. భాగవత పురాణం కూడా ఇటువంటిదే. యాత్రా కథనాలు, ప్రత్యేక స్థలాల వర్ణనలు, వంశవృక్షాలు వీటిలో చేరిపోయాయి. ప్రక్షిప్తాలకు పేరు పడిన పురాణాలివి. తరచూ ఈ రెండూ semi feminist version కథలను వివరిస్తాయి. దక్షిణదేశంలో ప్రచారంలో ఉన్న సిద్ధాంతాలు కూడా ఈ పురాణాలలో కనిపిస్తాయి. తప్పుచేసిన దుర్మార్గుడయిన భక్తుడు, పశ్చాత్తాపం చెందని భక్తుడికి కూడా కరిగిపోయి స్వామి కరుణించిన కథ ఈ పురాణాలలో ఉంది. కేదార ఖండంలో గుడిగంటను దొంగలించిన దొంగకథ ఇటువంటిదే."primitive feminism" కేదారఖండంలో కనిపిస్తుంది. స్కాంద పురాణసారం అంతా కేదార ఖండంలో ఉంది. ఇంద్రాణి, పార్వతి స్త్రీశక్తిని ప్రదర్శించిన ప్రధాన దేవతలు. కేదారఖండలో నహుషుణ్ణి మాయచేసి తప్పుదోవ పట్టించేందుకు ఉపాయం ఇంద్రాణి తనంతట తానే ఊహిస్తుంది. భారతకథలో ఇంద్రాణి బృహస్పతికి సహాయకురాలు. ఇతర పురాణాలలో లేని విశిష్టత కేదారఖండలో ఉంది. దేవుని కృపను మహిళలు, పాపులయిన పురుషులు కూడా పొందుతారు. ఇదే ఇతర పురాణాలలో లేని విశిష్టత. స్కాందంలో స్త్రీలు ప్రకృతికి ప్రతినిధులుగా {represent} చేస్తారు. ప్రపంచ మతాలన్నింటిలో స్త్రీలు తమ శృంగార ఆకర్షణతో పురుషుల్ని ఆకర్షించి పురుషులు పాపం చేయడానికి కారణమవుతారనిపేర్కొనబడినది. పురుషుల్లో కామోద్రేకం పుట్టడానికి స్త్రీయే కారణం అంటాడు మనువు, స్వేచ్ఛాప్రవృత్తి, పరుల ఇళ్ళల్లో నిద్ర, నివాసాలు స్త్రీలు పాడవడానికి దోహదపడతాయని మనువు సిద్ధాంతీకరించాడు. పురుషులు కొన్ని పనులు చేయరాదని శాస్త్రాలు నిషేధిస్తున్నాయి. సోదరుని భార్యతో సంగమించరాదు, తప్పనిసరి పరిస్థితిలో ఒక్కసారిమాత్రం అందుకు అనుమతించబడింది. (మహాభారతంలో వేదవ్యాసుడి కథ.) ఈ స్మృతి విధానాలు హిందువుల జీవన విధానంలో చేరిపోయి స్త్రీల, శూద్రుల స్వతంత్రం, స్వేచ్ఛ, హక్కులను చాలావరకు హరించివేశాయి. శరణ్యు దేవత ప్రస్తావన రుగ్వేదంలో ఉంది. ఆమె వివస్వతుణ్ణి పెళ్లిచేసుకొంది. వివస్వతుడే సూర్యుడు. త్వస్త్రి లేక విశ్వకర్మ కుమార్తె శరణ్యు వివస్వతుణ్ణి పెళ్లిచేసుకొని యమ, యమి అమడ పిల్లలకు జన్మనిచ్చింది. త్వస్తి తన రూపంలో ఒక స్త్రీని పెట్టి, తాను ఆడగుర్రం రూపంధరించి పారిపోయింది. సూర్యుడు (stallion) మగగుర్రం రూపంలో దాన్ని అనుసరించి వెంటవెళ్ళాడు. వీరి కలయికవల్ల అశ్వనీ దేవతలనే ఇద్దరు కవలలు జన్మించారు. ఋగ్వేదంలో స్త్రీ మరణంలేని దివ్యురాలు, పురుషుడు mortal, శరణ్యు ఇమ్మార్టల్, వివస్వతుడు mortal. అశ్వనీ దేవతలు సగం అశ్వం సగం మానవ రూపం ధరించిన అమరులుగా పరిగణింప బడ్డారు. తొలుత వీరికి సోమ-అమృతం నిరాకరించబడినా చివరకు ఇవ్వబడింది. చిక్కుప్రశ్న ఏమిటంటే, శరణ్యు భర్త, బిడ్డ mortals అని స్పస్టంగా ఉంది. అనేక పాఠాలలో, గాథల్లో యమ mortal గా అభివర్ణించబడ్డాడ(in contrast to his seven immortal brothers.) సూర్యుడు గర్భంలో ఉండగానే వికృతి చెంది mutation పొందినట్లు, అతనితల్లి తన ఇష్టాపూర్వకంగానే అతన్ని నిరాకరించినట్లు ఋగ్వేదం. ఈ తిరస్కరణ నుంచే సూర్యుడు అంగవికలత పొందినట్లు వివరించబడినది. ఉదయాన్ని, అస్తమయాన్ని అనేక సంస్కృతులలో జనన మరణాలుగా భావించారు. నిరంతరం కొనసాగే జనన మరణ ప్రక్రియగా భావిస్తారు. కొన్ని విషయాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి. పుస్తకం పూర్తిగా చదవితే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి.
మూలాలు:Wendy Doniger's book On Hinduism