ఆయాచితం నటేశ్వరశర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ' దాశరధి కృష్ణమాచార్య ' పురస్కారాన్ని ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర పండితుడు, అష్టావధాని ఆయాచితం నటేశ్వరశర్మకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది[1]. అష్టావధాని, డాక్టర్ ఆయాచితం నటేశ్వరశర్మ 17 జూలై 1956 సంవత్సరం కామారెడ్డి జిల్లా రామారెడ్డి గ్రామంలో జన్మించారు. ఈయన సంస్కృతం తెలుగు భాషల్లో 50కి పైగా రచనలు చేశారు. 2023 జూలై 22వ తేదీన హైదరాబాదులోని రవీంద్ర భారతి లో ' తెలంగాణ ప్రభుత్వం - భాషా సాంస్కృతిక శాఖ ' ఆధ్వర్యంలో దాశరధి కృష్ణమాచార్య 99వ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు[2]. దాశరధి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రధానం చేశారు[3]. పురస్కారంతోపాటు రూ. 1,01,116 నగదు, శాలువ, జ్ఞాపికను ఆయాచితం నటేశ్వరశర్మ కు అందజేశారు[4]. కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆయన పేరుతో ప్రభుత్వం ప్రతి ఏటా పురస్కారం అందజేస్తుంది.

మూలాలు :

  1. "Telangana: ఆయాచితం నటేశ్వరశర్మకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు". EENADU. Retrieved 2023-09-13.
  2. telugu, NT News (2023-07-19). "Telangana | క‌వి, ర‌చ‌యిత న‌టేశ్వ‌ర శ‌ర్మ‌కు దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్య పుర‌స్కారం". www.ntnews.com. Retrieved 2023-09-13.
  3. Desk 13, Disha Web (2023-07-19). "అయాచితం నటేశ్వర శర్మకు 'దాశరథి కృష్ణమాచార్య' అవార్డు." www.dishadaily.com. Retrieved 2023-09-13.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Satyaprasad, Bandaru. "Dasaradhi Award : నటేశ్వర శర్మకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు, ఈ నెల 22న ప్రదానం". Hindustantimes Telugu. Retrieved 2023-09-13.