Jump to content

ఆరోగ్య బీమా

వికీపీడియా నుండి

ఆరోగ్య బీమా అనేది ఒక వ్యక్తి యొక్క వైద్య ఖర్చులను పాక్షికంగా, లేక పూర్తిగా చెల్లించగలిగిన బీమా. ఇతర బీమాల్లాగానే ఆరోగ్య బీమాలో కూడా ఎక్కువమంది వ్యక్తులు బీమా చేయడం ద్వారా రిస్క్ ను పంచుకుంటారు. ఒక సమూహంలో ఉన్న వ్యక్తుల ఆరోగ్య ప్రమాదం, ఆరోగ్య వ్యవస్థ ఖర్చుల మొత్తం ప్రమాదాన్ని అంచనా వేయడం ద్వారా, బీమాలో పేర్కొన్న ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాల కోసం చెల్లించడానికి డబ్బును అందించడానికి బీమాదారు నెలవారీ ప్రీమియం లేదా జీతం నుంచి కొంత సొమ్మును పక్కన బెట్టడం వంటి విధానాల అనుసరించవచ్చు.[1] ఈ ప్రయోజనం ప్రభుత్వ ఏజెన్సీ, ప్రైవేట్ సంస్థలు, లేదా లాభాపేక్ష లేని సంస్థ వంటి కేంద్ర సంస్థచే నిర్వహించబడతాయి.

ఆరోగ్య బీమా పాలసీ బీమా సేవను అందించే సంస్థకూ (బీమా సంస్థ లేదా ప్రభుత్వం), ఆ సేవలు అందుకునే వ్యక్తి లేదా వారిని స్పాన్సర్ చేస్తున్న సంస్థలకు (ఉద్యోగం చేసే సంస్థ) మధ్య కుదిరే ఒప్పందం (కాంట్రాక్టు). ఈ ఒప్పందం సంవత్సరానికోసారి లేక నెలకోసారి పునరుద్ధరించబడుతూ ఉండవచ్చు. బీమా ఒక్కోసారి జాతీయ పథకంలో భాగంగా ప్రతి పౌరుడికీ అందుబాటులో ఉండవచ్చు. ఎటువంటి సేవలు బీమా కిందకు వస్తాయి, ఎంత మేరకు బీమా సంస్థలు ఖర్చును భరిస్తాయి లాంటి విషయాలు ఒప్పందంలో పొందుపరచబడి ఉంటాయి.

భారతదేశంలో ఆరోగ్య బీమా

[మార్చు]

భారతదేశంలో వైద్య సేవలు, వాటి స్థాయి అవి అమలు చేసే రాష్ట్రాలను బట్టి ఉంటుంది. ప్రజల కోసం భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని రూపొందించింది. భారతదేశంలో బీమా సేవలు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవెలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నియంత్రణలో ఉంటాయి.[2]

మూలాలు

[మార్చు]
  1. Pekerti, Andre; Vuong, Quan-Hoang; Ho, Tung; Vuong, Thu-Trang (25 September 2017). "Health care payments in Vietnam: patients' quagmire of caring for health versus economic destitution". International Journal of Environmental Research and Public Health. 14 (10): 1118. doi:10.3390/ijerph14101118. PMC 5664619. PMID 28946711.
  2. https://www.niti.gov.in/sites/default/files/2023-02/Health-Insurance-for-India%E2%80%99s-Missing-Middle_08-12-2021.pdf [bare URL PDF]