ఆరోజుల్లో (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుస్తక ముఖచిత్రం

పోలాప్రగడ సత్యనారాయణమూర్తి రచించిన పుస్తకం ఆ రోజుల్లో. ఇది తరుణీ సాహితి సమితి హైదరాబాద్ వారు ప్రచురించారు. ఈ గ్రంథంలో 1930 (?) ప్రాంతంనాటి ప్రఖ్యాతి గాంచిన ఇతర రచయితల పరిచయాన్ని, ఆనాడు సమాజంలోని, నీతి నియమాలు, దయా, దాన గుణాలు, జీవితంలో తన కెదురైన సంఘటనలతో సోదాహరణ చిత్రణ ఉంది. ఒక విధంగా ఈ రచయిత జీవిత చరిత్ర లాగా కూడా అనిపిస్తుంది.

గ్రంథంలోని కొన్ని భాగాలు ఉదాహరణగా[మార్చు]

  1. 1938 ప్రాంతంలో రాజమండ్రికి మనుషులు లాగే రిక్షాలొచ్చాయి. ఆ రిక్షాలలో కూర్చొని వెళ్ళడానికి మనుషులు మొదట్లో మొగమోట పడే వారు. ఎందుకంటే.... ఆక తాయి పిల్లలు రిక్షా చుట్టు చేరి.... కళ్ళు కాళ్ళు లేవు నారాయణా అంటూ పాట పాడి ఏడిపించేవారు రిక్షా ఎక్కిన వాళ్ళను చూచి.

2. గోపాల రావు సబ్ జడ్జి. అప్పారావు ఫ్యాక్టరీ వర్కరు. వీరిద్దరు మంచి స్నేహితులు. ఫుట్ బాల్ ఆడేవారు. ఆట తర్వాత హోటలో టిపిన్ తిని సబ్ జడ్జి గోపాల రావు, అప్పారావుని తన సైకిల్ మీద కూర్చోబెట్టి అతని ఇంటి వద్ద దిగ బెట్టి వెళ్ళెవారు. ఈ రోజుల్లో ఇలాంటి సంఘటన సాధ్యమా???

3.ఆలమూరులో నరసింహ దేవర పేరి శాస్త్రి గారని ఒక సంపన్న గృహస్తు వుండేవాడు. 1986 లో దాతు కరువొచ్చింది. ఆకలికి ప్రజలు అలమటించి పోయారు. పేరి శాస్త్రి గారు ఆ యేటి పంటను అమ్మకుండా గాదులలో పోయించి పెరట్లొ రెండు గాడి పొయ్యిలు త్రవ్వించి వంట వాళ్ళను పెట్టి ఎంత మంది వచ్చినా కాదనకుండా నాలుగు నెలల పాటు భోజనాలు పెట్టారు. ఒక రోజు రాత్రి పది గంటలప్పుడు పాతిక మంది వచ్చి అమ్మా రెండురోజులయింది అన్నం తిని- అని అరిచారట. అరుగు మీదనే పడుకున్న పేరి శాస్త్రి గారు వారిని కాళ్ళు చేతులు కడుక్కు రమ్మని తానే వంట కార్యక్రమం మొదలు పెట్టాడట. శబ్దం విని లేచిన అతని భార్య జగ్గమ్మ గారు ఏమయిందని అడుగ్గా.... భోజనానిని పాతిక మంది వచ్చారు... వంట వాళ్ళు వెళ్ళి పోయారు .... అందుకని నేనే వంట మొదలు పెట్టా నన్నాడట. దాని కా మహా ఇల్లాలు... బాగుంది .... పుణ్యమంతా మీరే మూట గట్టు కుందామనే...... అంటూ కూరగాయలు తరగడానికి కూర్చున్నదట.

4.ఆలమూరులో నారయణం గారనే ఒక లాయరుండే వారు. ఆ వూరి వారందరికీ ఆయనంటే విశేషమయిన గౌరవం. అన్యాయాన్ని సహించే వారు గాదు. పెద్ద మనిషి తరహాలో వ్వవహారాలన్ని చక్కబెట్టే వారు. రాజీ కుదిర్చేవారు. కోర్టుకెళ్ళ నిచ్చే వారు గాదు. ..... చాగల నాడు లో బాగా బతికి చితికి పోయిన ఒక రైతు సూరన్న అనే యువకుడు తన నలుగురి సోదరులతో, తల్లిని వెంట బెట్టుకొని పరాయి ఊర్లల్లో కూలి చేసుకొని బతుకు దామని పోతూ నారాయణంగారి పంచన చేరి సేద తీర్చు కుంటున్నారు. బయటికి వచ్చిన నారాయణ గారు వారిని చూసి.... అరణ్య వాసానికి బయలు దేరిన పాండవులు ... కుంతీ మాత లాగ అనిపించారు. వారిని సేద దీర్చి... వారి కష్టాలను కనుక్కొని.... ఖాళీ స్థలంలో ఒక పాక వేయించి అన్ని సమ కూర్చి... తన పదెకరాలు వారికే కౌలుకిచ్చి చేసుకొమ్మన్నారు. పదిహేనేళ్ళకు సూరన్న గారు బాగా నిలదొక్కుకున్నారు. పెళ్ళి చేసుకున్నారు, సోదరులకు పెళ్ళిళ్ళు చేసారు ఒక మోతుబరి రైతుగా స్థిర పడ్డాడు సూరయ్య. సూరయ్య నారాయణంగారిని తన తండ్రి లాగానే చూసే వాడు. తన 70 వ ఏట నారాయణం గారు మరణిస్తే .... సూరన్న గారు అతని కొడుకులతో బాటు తాను కూడ గుండు చేయించుకొని తర్పణం వదిలారు. అతను బ్రాహ్మణుడు. ఇతను కమ్మ కులం. సూరన్న గారు ఎవరో గాదు మానాన్న గారే

5. చెప్పులు కుట్టే చంద్రయ్యకన్నా రోజుకి అర్థ రూపాయి ఆదాయం వచ్చే అవకాశం వున్నది. కాని అచ్యుత రామయ్యకు ఆ బరోసా లేదు. పొద్దున్నే స్నానం చేసి ముష్టి చెంబు పట్టు కొని "సీతారామాబ్యనమః అంటూ నాలుగు వీధులు తిరిగితే అర్థ సేరో, పావు సేరో బియ్యం దొరికేవి. జంద్యాలు అమ్మగా వారానికి ఆర్థ రూపాయి ... అదే అతని ఆదాయం. అయినా అతనెపుడు.... దీనంగానూ.... దిగులుగానూ వుండే వాడు కాదు. నవ్వుతూ... అందర్నీ నవ్విస్తూ అందరి తల్లో నాలుకలా వుండే వాడు. ఆ వూర్లో అన్ని బావుల్లోను ఉప్పునీరే. కాని అచ్యుత రామయ్య గారి నూతిలో తియ్యగా కొబ్బరి బోండాం నీళ్ళ లాగుండేవి. ఆ వూరి జనం అంతా ఆ బావి నీళ్ళు తాగ డానికి తీసుకెళ్ళేవారు. వాళ్ళకి వేరు మార్గం లేదు. తన దారిద్ర్యాన్ని ఆసరాగా చేసుకుని బిందెడు నీళ్ళకు ఏ కొంతైనా పైకం వసూలు చేసినా అతనికి నిక్షేపంగా జీవితం వెళ్ళి పోవును. అలాంటి ఆలోచన ఆయన కెప్పుడు రాలేదు. ఊరంతా తన బావిలో నీరు చేదుకుని పోతుంటే సంతోషంగా చూస్తూ వుండే వాడు. పిల్లలు, గర్బిణీలు నీళ్ళు చేదలేక బాధ పడుతుంటే పరుగున వెళ్ళి వాళ్ళకు కావలసిన నీళ్ళను తోడి పెట్టే వాడు. బండి లాగ లేక ఎవరి ఎడ్లు అయినా చితికిల బడితే తన భుజం వొడ్డి చక్రం ఎత్తి సాయం చేసే వాడు. పంట నీట మునిగి పోతుంటే కూలీలు దొరక్క రైతు బాధ పడుతుంటే రైతుకు బాసటగా నిలిచి ఒక చేత్తో కుప్ప వేసి సాయం చేసే వాడు. ఒక సారి చెప్పులు కుట్టే చంద్రయ్య పొలం గట్టున పాము కరచి స్పృహ తప్పి పడిపోతే ..... తన నోటితో ఆ పాము కాటు గాయాన్ని పీల్చి విషాన్ని ఉమ్మేసి దగ్గర్లోని ఆయుర్వేద వైద్యుని వద్దకు భుజాన వేసుకొని పోయి ప్రాణం రక్షించిన ప్రాణ దాత. ఊర్లో ఎవరింట్లో ఎవరైనా చనిపోయినా... దిగులు పడకండి అని అందరికీ దైర్యం చెప్పి శవ దహనానికి తయారయ్యేవాడు.

అలాంటి ఊరికి ఉపకారి అయిన అచ్యుత రామయ్య చని పోయింది కూడా పదుగురికి ఉపకారం చేస్తూనే.... గోదావరి దాట బోయి ప్రవాహానికి కొట్టుక పోతున్న పెళ్ళి బృందం వారిలో చాల్మందిని ఒడ్డుకు చేర్చి ఒక ముసలాయన్ని రక్షించ బోయి .... అతనితో బాటు అచ్యుత రామయ్య కూడా గోదావరిలో మునికి చనిపోయాడు........ ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలు సాద్యమా...???

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]