ఆర్కెన్సా రాష్ట్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్కెన్సా రాష్ట్రంలోని వైట్ నది

ఆర్కెన్సా (Arkansas) అమెరికా దక్షిణ ప్రాంతంలోని ఒక రాష్ట్రం. మిస్సిస్సిపి నది ఒడ్డున ఉంది. ఇది ప్రాకృతిక రాష్ట్రం (Natural State) గా పిలువబడుతుంది. అమెరికాలోని 50 రాష్ట్రాలలో 29వ అతిపెద్ద రాష్ట్రం (భౌగోళికంగా). జనాభా పరంగా 32వ అతిపెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రానికి సరిహద్దులుగా తూర్పున మిస్సిసిపీ, టెనిస్సీ రాష్ట్రాలు, పశ్చిమాన ఓక్లహామా, ఉత్తరాన మిస్సోరీ, దక్షిణాన లూసియానా, వాయివ్యంలో (southwest) టెక్సస్ రాష్ట్రాలు ఉన్నాయి. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉన్న లిటిల్ రాక్ నగరం. ఇంకా తూర్పుఆర్కెన్సాలో జోన్స్‌బొరో అతిపెద్ద నగరం కాగా, నైరుతిలో (North West Arkansas - NWA) ఫొర్ట్‌స్మిథ్, ఫెయెట్‌విల్-స్ప్రింగ్‌డేల్-రోజర్స్ నగర ప్రాంతాలు పెద్దవి. ఆర్కెన్సా వైవిధ్యభరితమైన వాతావరణానికి ప్రసిద్ధి కెక్కింది. ఈ రాష్ట్ర జనాభా వివిధ జాతుల సమాహారం. ఆర్కెన్సాలో ప్రవాస భారతీయులు అధికంగా నివసించే ప్రాంతాలలో బెన్టన్‌విల్, లిటిల్‌రాక్ నగరాలు ముఖ్యమైనవి. ఉత్తర అమెరికాలో తొలిసారిగా సహజమైన వజ్రాలు దొరికిన రాష్ట్రం ఆర్కెన్సా. భౌగోళికంగా ఎంతో వైవిధ్యం కలిగి ఒజార్క్స్, ఒషితా పర్వత శ్రేణుల నుండి ఉత్తరాన మిస్సిసిపీ నది వైపున ఉన్న పల్లపు ప్రాంతాల వరకు విస్తరించి ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

ఆర్కెన్సా అనే పేరు సియోవా భాషలో క్వాపా ఇండియన్లను సూచిస్తుంది. క్వాపా ఇండియన్లు అమెరికాలోని నాలుగు భౌగోళిక ప్రాంతాలలో ఒకటైన మధ్యపశ్చిమ ప్రాంతానికి చెందిన ఒక స్థానిక అమెరికా తెగ. వీరు 17వ శతాబ్దంలో మిస్సిస్సిపి నదికి పశ్చిమాన నివసించారు.

మూలాలు

[మార్చు]
  1. Bright, William (2004). Native American Placenames of the United States (in ఇంగ్లీష్). University of Oklahoma Press. ISBN 978-0-8061-3598-4.