Jump to content

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (సినిమా)

వికీపీడియా నుండి

2001 లో విడుదల అయిన ఈ సినిమా స్టీవెన్ స్పీల్ బెర్గ్ డైరెక్షన్ లో వచ్చింది ….

కాని ఇది ప్రేమకి సంబంధించింది …. అమ్మ ప్రేమని పొందాలని ఆ పసివాడి ప్రయత్నం ఈ సినిమా….

his name is david he is 11 years old he is 4 feet 6inches tall his love is real but not him …

మేఖా అని రోబోట్స్ ని సైంటిస్ట్లు క్రియేట్ చేస్తుంటారు …. మామూలుగా పెద్ద పెద్ద రాబోట్స్ ని చేస్తూ ఉంటారు …. కాని ఆ రోబోట్స్ కి ప్రేమ,స్పర్స అనేవి ఉండవు ….. చెప్పిన పనులు మాత్రమే చేస్తూ ఉంటాయి …. కాని వాటికి న్యురాన్స్ కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ భావాలు కూడా కలుగుతాయని అధ్యయనం చేస్తారు … సైబెర్త్రానిక్స్ అనే సంస్థ ఇలాంటి రాబోట్స్ ని తయారు చెయ్యాలని నిర్ణయించుకుంటుంది ….

ఒక ఫామిలీలో మోనికా, హెన్రీ అనే దంపతులు ఉంటారు …వీరిద్దరూ ఒక రోబో చైల్డ్ ని దత్తత తీస్కుంటారు …..

ఇతనికి అందరు మనుషుల్లాగే ప్రేమలు,స్పర్స జ్ఞానం అన్నీ ఉంటాయి …. ఈ దంపతులకి మార్టిన్ అనే మరో కొడుకు ఉంటాడు కాని … కొన్ని కారణాల వలన కోమాలో ఉంటాడు … ఆ పిల్లవాడు తిరిగి రాలేడేమో అన్న భావన బలంగా నాటుకు పోయి ఉన్న వీరిద్దరూ …ఈ రోబో చైల్డ్ ని దత్తత తీస్కుంటారు … మొదట్లో మోనికాకి నచ్చక పోయినా….. తర్వాత తర్వాత వీడిపై ప్రేమని పెంచుకుంటుంది …. మార్టిన్ కి ఒక బొమ్మ ఉంటుంది పేరు టెడ్డి…. అది కూడా మనిషి లా ఆలోచించే స్వభావం కలిగి ఉంటుంది … ఇది కూడా రోబో టెడ్డి …దీన్ని మోనికా డేవిడ్ కి ఇస్తుంది …

ఇలా డేవిడ్ హాప్పీగా ఉన్న సమయంలో మార్టిన్ కోలుకుని ఇంటికి తిరిగి వస్తాడు … జలస్ ఫీల్ అయిన మార్టిన్ డేవిడ్ ని దూరం చెయ్యాలని భావిస్తాడు …. ఈ సమయంలో మోనికా మార్టిన్ కి పినాచియో కతను చెప్పడం డేవిడ్ వింటాడు …

అన్నీ శక్తులు కల్గి ఉన్న పినాచియో …మనిషి మాత్రం కాలేక పోతాడు …. ఆ సమయంలో బ్లూ హైరి అనే దేవత పినచియోని మామూలు మనిషిగా మార్చిందని తెల్సుకుంటాడు …. ఒక రోజు మార్టిన్ అమ్మ చెప్పిన ఒక కతను ప్రేరణగా తీస్కుని డేవిడ్ చేత తల్లి జుట్టుని కత్తిరించేలా చేస్తాడు …. ఆ జుట్టు బెడ్ కింద ఉన్న టెడ్డి పై పడుతుంది ….

ఆ సమయంలో మేల్కున్న మోనికా హెన్రీలు … మార్టిన్ డేవిడ్ పై అసూయని పెంచుకున్నాడన్న విషయాన్ని గ్రహిస్తారు,,,

మరుసటి రోజు మార్టిన్ ఫ్రెండ్స్ చేసిన అల్లరి వల్ల డేవిడ్ భయపడి కాపాడమని మార్టిన్ ని కౌగలించుకుంటాడు …. ఇద్దరూ స్విమ్మింగ్ పూల్ లో పడిపోతారు … డేవిడ్ రోబోట్ కాబట్టి ఏమి కాదు …కానీ మార్టిన్ ఇబ్బంది అవుతాడు …. గుండె మీద కొట్టి వాడిని బ్రతికిస్తారు … అందరూ తప్పు డేవిడ్ ది అని బావిస్తారు,,….

ఇదే టైంలో ఈ రోబోట్స్ మానవ జీవితానికి అడ్డంగా మారితున్నాయని కొంతమంది భావిస్తూ ఉంటారు …..వారందరూ ఈ మేఖాలు ఎక్కడ కన్పించినా వాటిని తీస్కెళ్ళి …ప్రజల సమక్షంలో వాటిని హింసించి నాశనం చేసేస్తూ ఉంటారు …. రోబోల ప్రేమకి మనిషి బానిస కాకూడదని వీరి ఉద్దేశం … అలాగే జరిగితే మానవ సంబంధాలకి అర్దాలు లేకుండా పోతాయి అని ….

డేవిడ్ చేసిన ఈ తప్పిదం వలన తిరిగి సైబెర్త్రోనిక్స్ కి ఇచ్చేద్దామని అనుకుంటారు …. కాని అలా తిరిగి వచ్చిన మేఖాలని వీళ్ళు దిస్పోయిల్ చేసేస్తారు ….

దాంతో అమ్మ మనసు ఒప్పుకోక ….. అడవిలో తీస్కెళ్ళి వదిలేస్తుంది టెడ్డిని కూడా ఇచ్చేస్తుంది …. ఎంత బ్రతిమిలాడినా ఒప్పుకోదు …. కారణం ఇంటికి తీస్కుని వెళ్తే నాశనం చేసేస్తారు …. అప్పుడు డేవిడ్ అమ్మని అడుగుతాడు … అమ్మా నేను కూడా మనిషిగా మారితే …నన్ను కూడా మార్టిన్ ని ప్రేమించినట్లు ప్రేమిస్తావా…… నేను రోబోట్ ని, కాని అన్నీ భావాలు ప్రేమలు తెల్సిన రోబోట్ ని, నేను అందరి లాగా కాదు … నన్ను వదిలి వెళ్ళకు మా ప్లీస్ అని బ్రతిమిలాడుతాడు …. నువ్వు మనిషి కాదు …. రోబో వి … మాకు కొన్నేళ్ళ తర్వాత అంతం ఉంటుంది నీకు ఉండదు …. నువ్వు నాతో రావొద్దు …. నిన్ను మనుషుల్లో కలవనివ్వరు …. నువ్వు మనిషిగా మారడం అసాద్యం … పినాచియో అనేది కత …నిజం కాదు … ఈ కాలంలో అవి ఉండవు … నీకు ప్రపంచం గురించి చెప్పకుండా నిన్ను అడవిలో వదిలేస్తున్నాను …నన్ను క్షమించు అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది ….

అప్పుడు బాధతో టెడ్డిని తీస్కుని కదిలిన డేవిడ్ కి … ఒక చోట ఒక ట్రక్ వచ్చి కొన్ని రోబో పార్ట్స్ ని కుప్పలు కుప్పలుగా పొయ్యడం చూస్తాడు ….. ఆ కుప్పల్లో నుండి సరిగ్గా లేని రోబోలు తమకి తాము పార్ట్స్ బిగించుకుంటూ ఉండడం చూస్తాడు … సరిగ్గా ఆ టైంలో కొందరు మనుషులు వీళ్ళ పై దాడి చేసి వలలో బంధించి తీస్కేల్తారు ….. పొరపాటున ఈ వలలో డేవిడ్ చిక్కు కుంటాడు …. టెడ్డి తప్పించుకుంటుంది …. కాని డేవిడ్ కోసం వేట ప్రారంబిస్తుంది …..

నేను ఇందాక చెప్పాను కదా, మేఖాలు ఎక్కడ కన్పించినా వాటిని తీస్కెళ్ళి …ప్రజల సమక్షంలో వాటిని హింసించి నాశనం చేసేస్తూ ఉంటారు అని …. వాళ్ళు దగ్గరలో ఉన్న సర్కస్ కి ఈ మేఖాలనన్నింటినీ తీస్కేల్తారు ….

అక్కడ జూడ్ లా (male prostitute) అని ఒక మేఖా పరిచయం అవుతాడు …. టెడ్డి డేవిడ్ ని కల్సుకుంటుంది …. టెడ్డి,డేవిడ్,జూడ్ లాలు అక్కడి నుండి తప్పించుకుంటారు …

ప్రపంచంలో ఎలాంటి ప్రశ్నకైనా ఆన్సర్ చెప్ప గలిగే dr.iknow,ప్రపంచం మొత్తం తన బ్రాంచెస్ ఓపెన్ చేసి ఉంటాడు … సుమారుగా 40000

దగ్గరలో ఉన్న dr.iknow branch కి డేవిడ్ ని తీస్కేల్తాడు జూడ్ లా

కంప్యుటర్ ద్వారా ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు dr.iknow ..డబ్బులు తీస్కుని డేవిడ్ తన దగ్గ ర ఉన్న డబ్బులిచ్చి బ్లూ ఫైరి గురించి అడుగుతాడు …. అప్పుడు పినాచియో స్టొరీ చెప్తాడు dr.iknow మరో ప్రశ్నగా is blue fairy changes robot into real human being ?అని అడుగుతాడు … దానికి ఆన్సర్ చెప్పడం కష్టమైన dr.iknow oka సొల్యుషన్ ఇస్తాడు ….

డేవిడ్ నువ్వు చాలా తెలివైన వాడివి…. రోబో అన్నింటిలోను తెలివైన వాడివి …. ప్రేమలు తెల్సిన వాడివి … నీ ప్రయత్నం ఫలించే మార్గం కోసం నేను నీకు ఒక మార్గం చెప్తాను విను …. last city of end of world అయిన మాన్ హట్టన్ లో ఒక సైంటిస్ట్ ఉన్నాడు …. అతని పేరు అల్లెన్ హాబీ … అతని దగ్గరికి వెళ్ళు నీకు ఫలితం ఉంటుంది అని చెప్తాడు …. machiens కి న్యురాన్స్ ని కనెక్ట్ చేసి భావాలు సృష్టించగల వ్యక్తి అని చెప్తాడు … డేవిడ్ అక్కడికి వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు … కాని జూడ్ లా ఒప్పుకోదు .. ఎందుకంటే అక్కడికేల్లిన మేఖాలు చచ్చిపోతాయని ఒక భావన ఉంటుంది …

అదేసమయంలో ఆ సర్కస్ వాళ్ళు పోలీసులని పంపిస్తారు ….. జూడ్ లాని అరెస్ట్ చేస్తారు …. కాని డేవిడ్ టెడ్డిని తీస్కుని జూడ్ లాని తప్పిస్తాడు … దాంతో జూడ్ లా డేవిడ్ ని మాన్ హట్టన్ తీస్కేల్తాడు …

అక్కడికి వెళ్ళిన డేవిడ్ హాబీని కలుస్తాడు … అప్పుడు ఒక భయంకరమైన నిజం తెల్సుకుంటాడు … హాబీ కొడుకు పేరు డేవిడ్,డేవిడ్ చనిపోవడంతో అతనిలాగే ఉన్న మేఖాలని తయారు చేస్తుంటాడు … అలా చేసిన మేఖానే డేవిడ్ … అక్కడ తనలాగే ఉన్న చాలా మంది మేఖాలని చూస్తాడు డేవిడ్ … మనిషిగా మారడం అసాధ్యమని గ్రహిస్తాడు … కానీ బ్లూ ఫైరి ఉందని బలంగా నమ్ముతాడు … దాంతో ఎత్తైన బిల్డింగ్ మీద నుండి దూకేస్తాడు …. నీళ్ళల్లో చాలా లోతుకి వెళ్ళిన డేవిడ్ అక్కడ బ్లూ ఫైరి బొమ్మని చూస్తాడు …. ఆ బొమ్మ దగ్గరకి వెళ్ళే లోగా నే ఒడ్డు పై ఉన్న జూడ్ లా డేవిడ్ ని బయటకి లాగేస్తాడు …

కాని జూడ్ లాని అయస్కాంత ప్రభావం చేత హెలి కాప్టార్ నుండి లాగేస్కుంటారు …ఆ సర్కస్ టీం పోలీసులు. దేవిడ్ నుండి దూరం అవుతూ నువ్వు మనిషిగా మారితే నన్ను మర్చిపోకు అని చెప్పి వెళ్ళిపోతాడు జూడ్ లా….

అప్పుడు జూడ్ లా దేవిడ్ టెడ్డి వచ్చిన హెలికాప్టర్ ని తీస్కుని … టెడ్డి,దేవిడ్ లు సముద్ర గర్బంలోకి బ్లూ ఫైరిని చూసిన ప్లేస్ కి వెళ్తారు …. ఈ హెలికాప్టర్ అడ్వాన్సెడ్ మోడల్ …నీళ్ళల్లో …గాల్లో ప్రయాణించగలదు …. పైగా ఈజీగా నడపొచ్చు … నీళ్ళల్లోకి వెళ్లి బ్లూ ఫైరి బొమ్మ ముందు నిలబడి ….. అదే హెలికాప్టర్ లో ఉండి నన్ను మనిషిగా మార్చు (please make me real,blue fairy ), అని ప్రార్థిస్తూ ఉంటాడు ….

2000 సంవత్సరాల తర్వాత …. భూ నాశనం కూడా అయిపోయాక …అక్కడ ఉన్న ఎలియన్స్ సముద్ర గర్బంలో ఉన్న ఈ హెలికాప్టర్ ని కనుక్కుని అందులో ఉన్న డేవిడ్ మేఖాని టెడ్డిని గమనిస్తారు …. బిగుసుకు పోయి ఉన్న వారిద్దరిని మేల్కొలిపి …. వారి గురించి తమ బ్రెయిన్ లో ఉన్న సంకేతాల ద్వారా తెల్సుకుంటారు …. అప్పుడే లేచిన డేవిడ్ పూర్తిగా మంచుగా మారిపోయి ఉన్న ఆ నీళ్ళల్లో ఉన్న బ్లూ ఫైరి బొమ్మ దగ్గరకి వెళ్లి అలా పట్టుకుంటాడు … బొమ్మ విరిగి కిందపడిపోతుంది …. అప్పుడు ఎలియన్స్ డేవిడ్ తల పై చెయ్యి పెట్టి …. అతని గతాన్ని తెల్సుకుని అతని ఇంటిలాగే ఉన్న మరో ఇంటిని తయారు చేస్తారు ….

కాని అక్కడ ఉన్న ఆర్టిఫిషియల్ బ్లూ ఫైరి (ఎలియన్స్ క్రియేట్ చేసింది ) దగ్గరకి డేవిడ్ వెళ్లి తన కోరికని చెప్తాడు … అమ్మ కావాలి అని … అప్పుడు ఆ బ్లూ ఫైరి డేవిడ్ కి ఒక నిజం చెప్తుంది … మానవ జీవితం అంతమైపోయింది …. ఆ మానవులేవ్వరూ ఇప్పటిదాకా బ్రతికి లేరు …. మేము అప్పటి DNA లని సంపాదించి మనుషులుగా తయారు చేసినా కూడా వారు ఒక్కరోజు కంటే ఎక్కువగా బ్రతకడం లేదు,…. ఇప్పుడు నువ్వు అమ్మ కావాలి అంటున్నావు,….. కనీసం మీ అమ్మ DNA ఉన్నా మేము నీకు ఏదో ఒక రకంగా హెల్ప్ చేసే వాళ్లము అని చెప్తుంది ….

ఎలాగైనా అమ్మ ప్రేమని పొందాలని భావించిన డేవిడ్ బాధతో క్రుంగి పోతాడు … నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి … …. ఆ టైంలో టెడ్డి ఒక విషయం చెప్తుంది ….నువ్వు మీ అమ్మ జుట్టు వెండ్రుకలు కత్తిరించినప్పుడు అవి నా పై పడ్డాయి …. వాటిని నేను దాచుకున్నాను అని వాటిని తీసి చూపిస్తాడు …. ఆనందంతో ఆ జుట్టుని తీస్కుని బ్లూ ఫైరికి ఇస్తాడు డేవిడ్…..

ఎలియన్స్ అంతా పిల్లవాడి కోరికని తీర్చమని చెప్తారు …. అలాగే అని వెళ్ళిపోతుంది . ఆ తర్వాత రోజు డేవిడ్ దగ్గరకి ఒక ఎలియాన్ వచ్చి …సూర్యోదయం రాగానే నీకోరిక తీరుతుంది … కాని మీ అమ్మ నిద్రపోయిన వెంటనే చనిపోతుంది ….. దానికి నువ్వు సన్నద్దమవ్వాలి ఓకే నా అని చెప్తాడు …. ఇంత కాలంగా తల్లి ప్రేమకై ఎదురు చూస్తున్న డేవిడ్ కి అది ఒక వరంగా తోస్తుంది ….

నీ తల్లికి నువ్వు హెన్రీ, మార్టిన్ ల గురించి చెప్పొద్దు. ఈరోజు నీ తల్లి ప్రేమ నీకు మాత్రమే సొంతం ….. నిద్ర లేచినప్పుడు తనని పలకరించు అని చెప్తాడు …. నిద్ర లేయ్యగానే అమ్మా …నేను డేవిడ్ ని అంటాడు … ఆప్యాయంగా దగ్గరకి తీస్కుంటుంది మోనికా…. ఆరోజంతా తల్లి ప్రేమని పొందుతాడు …. ఎంతగా ఫీల్ అవుతామంటే …. చూస్తె నే తెలుస్తుంది …. అమ్మ తనం కోసం ఆడవారు ఎంత ఆరాట పడతారో …. ఆ అమ్మ ప్రేమ కోసం బిడ్డలు కూడా అంతే ఆరాటపడతారు …. నిజమైన ప్రేమని ఆ డేవిడ్ లో చూస్తాము ….

ఆ రాత్రి తల్లితో పాటు మొదటి సరిగా డేవిడ్ కూడా నిద్ర పోతాడు …. (తనని తయారు చేసినప్పటి నుండి నిద్ర పోడు డేవిడ్)

అలా నిద్రపోవడంతో సినిమా అయిపోతుంది ….

- - - ARK.Chaitanya kumar www.indianstriker.wordpress.com (my page)