Jump to content

ఆర్థర్ హెయిలీ

వికీపీడియా నుండి
ఆర్థర్ హెయిలీ
పుట్టిన తేదీ, స్థలం(1920-04-05)1920 ఏప్రిల్ 5
లూటన్, బెడ్‌ఫోర్డ్‌షైర్, ఇంగ్లాండు
మరణం2004 నవంబరు 24(2004-11-24) (వయసు 84)
బహమాస్
వృత్తినవలా రచయిత
జాతీయతబ్రిటిష్ - కెనడియన్
గుర్తింపునిచ్చిన రచనలుHotel (1965)
Airport (1968)
Wheels (1971)
జీవిత భాగస్వామిజీవిత భాగస్వాములుజోన్ ఫిష్విక్ (1944–1950; విడా.)
షీలా డన్లప్ (1951–2004; అతడి మరణం)
సంతానం6

ఆర్థర్ హెయిలీ ( 1920 ఏప్రిల్ 5 - 2004 నవంబరు 24) ఒక బ్రిటిష్-కెనడియన్ నవలా రచయిత. అతడు వివిధ పరిశ్రామిక రంగాల నేపథ్యంలో నవలలు రాసాడు. హోటల్ (1965), ఎయిర్‌పోర్ట్ (1968), వీల్స్ (1971), ది మనీఛేంజర్స్ (1975), ఓవర్‌లోడ్ (1979) వంటి బెస్ట్ సెల్లర్లు అతని సూక్ష్మ పరిశోధించినకు తార్కాణం. అతని రచనలు 38 భాషలలో 17 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. [1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆర్థర్ ఫ్రెడరిక్ హెయిలీ 1920 ఏప్రిల్ 5 న ఇంగ్లాండు, బెడ్ఫోర్డ్ షైర్ లోని ల్యూటన్‌లో జన్మించాడు. త్ండ్రి జార్జ్ వెల్లింగ్టన్ హెయిలీ ఒక ఫ్యాక్టరీ కార్మికుడు. తల్లి ఎల్సీ వ్రైట్ హాయిలే. అతడు వీరి ఏకైక సంతానం. అతడు పుస్తకాలు బాగా చదివేవడు. [2] హెయిలీ చిన్న వయస్సులోనే కవితలు, నాటకాలు, కథలు రాయడం ప్రారంభించాడు. [3] అతను ఒకసారి, "నేను రాసుకోవడం కోసం, నా తల్లి నాకు పనులు చెప్పడం మానేసింది." అన్నాడు. [2] ఎల్సీ తన కొడుకును టైపింగ్, సంక్షిప్తలిపి నేర్చుకోవాలని ప్రోత్సహించింది. తద్వారా అతను ఫ్యాక్టరీ కార్మికుడికి బదులుగా గుమస్తాగా పనిచెయ్యవచ్చు. [3]

పద్నాలుగు సంవత్సరాల వయస్సులో, హెయిలీకి స్కాలర్‌షిప్‌ రాకపోవడ్ం వలన, అతని పాఠశాల విద్య ఆగిపోయింది. [4] 1934 నుండి 1939 వరకు అతను లండన్లో ఆఫీస్ బాయ్‌గా, గుమస్తాగా పనిచేసాడు. [5] అతను 1939 లో రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో పైలట్‌గా పనిచేశాడు. చివరికి ఫ్లైట్ లెఫ్టినెంట్ హోదాకు ఎదిగాడు. [6] 1947 లో, యుద్ధానంతర లేబర్ ప్రభుత్వంపై అసంతృప్తితో [7] అతను కెనడాకు వలస వెళ్ళి, ద్వంద్వ పౌరుడు అయ్యాడు. [8] టొరంటోలో స్థిరపడి [6] రియల్ ఎస్టేట్, అమ్మకాలు, ప్రకటనల వంటి రంగాలలో అతను అనేక రకాల ఉద్యోగాలు చేసాడు. [9] అతను బస్ అండ్ ట్రక్ ట్రాన్స్పోర్ట్ అనే వాణిజ్య పత్రికకు సంపాదకుడుగా కూడ్డా పనిచేసాడు. [8] ఈ సంవత్సరాల్లో, అతను రాయడం కొనసాగిస్తూనే ఉన్నాడు. [7]

హెయిలీ రెండుసార్లు పెళ్ళి చేసుకున్నాడు. 1944 లో అతను జోన్ ఫిష్విక్ (1918-2004) ను పెళ్ళి చేసుకున్నాడు, ఆమెతో 1950 లో విడాకులు తీసుకునే సరికి అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 1951 లో అతను షీలా డన్లప్ (1927–2017) ను పెళ్ళి చేసుకున్నాడు. ఆమెతో అతనికి ముగ్గురు పిల్లలు కలిగారు. [10] 1978 లో షీలా హెయిలీ ఐ మ్యారీడ్ ఎ బెస్ట్ సెల్లర్: మై లైఫ్ విత్ ఆర్థర్ హెయిలీ (డబుల్ డే) ను ప్రచురించింది. ఆ పుస్తకంలో ఆమె అతడి గురించి మెచ్చుకోలు మాత్రమే రాసి సరిపెట్టలేదు. [11] కానీ వారి కాపురం 53 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా సాగింది.

ఆర్థర్ హెయిలీ తన 84 వ ఏట 2004 నవంబరు 24 న నిద్రలో, లైఫోర్డ్ కేలోని తన ఇంటిలో మరణించారు, వైద్యులు గుండెపోటు అని చెప్పారు. [12] [13]

రచనలు చేసే పద్ధతి, సమీక్షలు

[మార్చు]

హెయిలీ సాధారణంగా ప్రతి పుస్తకం పైనా మూడేళ్ళు పనిచేస్తాడు. మొదట, ఒక సంవత్సర పటు పరిశోధన చేస్తాడు, తరువాత ఆరు నెలల పాటు తన పరిశీలనలను సమీక్షిస్తాడు. చివరికి 18 నెలల పాటు రచన చేస్తాడు. [14] ఆయన పరిశోధన కష్టంతో కూడుకున్నది: [15] హోటల్ కోసం హోటల్ పరిశ్రమ గురించిన 27 పుస్తకాలు చదివాడు. [16] వీల్స్ కోసం ఒక డెట్రాయిట్ కారు ప్లాంట్ వద్ద నెలల పాటు గడిపాడు. [15] ఈవినింగ్ న్యూస్ కోసం 67 ఏళ్ళ వయస్సులో పెరూ అడవుల్లో తిరుగుబాటు గెరిల్లా యోధులతో గడిపాడు [17] హెయిలీకి స్పష్టమైన సాహిత్య సిద్ధాఅంతాలు లేవు; "నేను కథకుడిని, మిగతావన్నీ యాదృచ్ఛికమే" అని అతను చెప్పాడు. [14]

హెయిలీ రచనలపై సమీక్షకుల విమర్శలు పదునుగా ఉండేవి. న్యూయార్క్ టైమ్స్‌లో, మార్టిన్ లెవిన్ అతన్ని "విసుగు పుట్టించే రచయిత" అని పిలిచాడు. [18] ది డైలీ టెలిగ్రాఫ్‌లో ది ఈవినింగ్ న్యూస్ పుస్తకాన్ని సమీక్షిస్తూ మార్తా గెల్హార్న్ ఇలా రాసింది, "ఇది, పట్టుకుంటే వదల్లేని పుస్తకమేమీ కాదు. ఇది అసలు పట్టుకోలేని పుస్తకం. ఇది మిలియన్లలో అమ్ముడవ్వొచ్చు, 34 భాషలలోకి అనువదించబడవచ్చు. బహుశా ఇది ఐస్లాండిక్ లేదా ఉర్దూ భాషలో అయితేనే చదవగలిగేలా ఉండొచ్చు. " [19] టైమ్ మ్యాగజైన్, హెరాల్డ్ రాబిన్స్ రాసిన ది బెట్సీని వీల్స్ నూ కలిపి సమీక్షిస్తూ, "ఘన వ్యర్థాలను సృష్టించే గొప్ప చెత్తసృష్టికర్తల్లో ఇద్దరు ఇప్పుడు ఆటో పరిశ్రమ గురించి నవలలను ప్రచురించారు. " అని రాసింది [20]

కానీ కథ చెప్పే హెయిలీ సామర్థ్యాన్ని కొందరు విమర్శకులు గుర్తించారు. న్యూయార్క్ టైమ్స్‌లో జాన్ రీడ్ వీల్స్, తన సమీక్షలో, "మిస్టర్ హెయిలీ సమర్థుడైన హస్తకళాకారుడు" అని అంగీకరించాడు. [21] డిటెక్టివ్‌ను సమీక్షిస్తూ, పబ్లిషర్స్ వీక్లీ ఇలా వ్రాసింది, "ఓల్డ్ ప్రో హెయిలీ ... తన ప్రొపల్సివ్ బ్రాండ్ స్టోరీటెల్లింగ్‌తో పాఠకులను కట్టిపడెయ్యడంలో ప్రవీణుడు." [22]

రచించిన నవలలు

[మార్చు]
  • Runway Zero-Eight (1958) - in-flight medical emergency, caused by food poisoning; spoofed in the movie Airplane!. This story started as the CBC TV movie Flight into Danger, then became the 1957 Paramount Pictures movie Zero Hour!, and was finally published as the novel Runway Zero-Eight (ISBN 0-440-17546-1).
  • The Final Diagnosis (1959) - హాస్పిటల్ లో పేథాలజీ విభాగానికి సంబంధించిన విషయాలు.
  • In High Places (1960) - ఉత్తర అమెరికాలోని ఉన్నత స్థానాలలో రాజకీయాలు.
  • Hotel (1965) - హోటల్స్
  • Airport (1968) - విమానాశ్రయ రాజకీయాలు
  • Wheels (1971) - ఆటోమొబైల్ పరిశ్రమ
  • The Moneychangers (1975) - బ్యాంకులు
  • Overload (1979) - కాలిఫోర్నియాలో విద్యుత్ సమస్యలు
  • Strong Medicine (1984) - మందుల పరిశ్రమ
  • The Evening News (1990) - వార్తాహరులు
  • Detective (1997) - విశ్లేషాత్మక రాజకీయాలు

మూలాలు

[మార్చు]
  1. Holley, Joe (27 November 2004). "Arthur Hailey, British Author Of 'Hotel' and 'Airport,' Dies". The Washington Post. Retrieved 6 February 2017.
  2. 2.0 2.1 Guttridge, Peter (24 November 2004). "Arthur Hailey". The Independent. Archived from the original on 29 మార్చి 2019. Retrieved 6 February 2017.
  3. 3.0 3.1 "Arthur Hailey". The Telegraph. 27 November 2004. Retrieved 7 February 2014.
  4. Christy, Marian (25 April 1990). "The unstoppable Arthur Hailey". The Boston Globe Magazine. Retrieved 7 February 2017.
  5. Wohlfert, Lee (31 March 1975). "Arthur Hailey Writes a New Novel About Big Money—and He Should Know". People. Retrieved 7 February 2017.
  6. 6.0 6.1 "Arthur Hailey". The Telegraph. 27 November 2004. Retrieved 7 February 2014.
  7. 7.0 7.1 Guttridge, Peter (24 November 2004). "Arthur Hailey". The Independent. Archived from the original on 29 మార్చి 2019. Retrieved 6 February 2017.
  8. 8.0 8.1 "Arthur Hailey". The Scotsman. 29 November 2004. Retrieved 7 February 2017.
  9. Holley, Joe (27 November 2004). "Arthur Hailey, British Author Of 'Hotel' and 'Airport,' Dies". The Washington Post. Retrieved 6 February 2017.
  10. Holley, Joe (27 November 2004). "Arthur Hailey, British Author Of 'Hotel' and 'Airport,' Dies". The Washington Post. Retrieved 6 February 2017.
  11. Hamilton, Geoff; Jones, Brian (2013). Encyclopedia of American Popular Fiction (PDF e-book) (2nd ed.). New York: Infobase Learning. ISBN 978-1-4381-4065-0.
  12. Jankiewicz, Adam (26 November 2004). "Arthur Hailey, 84, novelist who wrote 'Airport,' 'Hotel'". The Boston Globe. Retrieved 14 February 2017.
  13. "Bylines around the world after novelist death exclusive". 25 June 2007.
  14. 14.0 14.1 Thurber, Jon (26 November 2004). "Arthur Hailey, 84; Bestselling Author of 'Hotel,' 'Airport'". Los Angeles Times. Retrieved 10 February 2017.
  15. 15.0 15.1 "Arthur Hailey". The Scotsman. 29 November 2004. Retrieved 7 February 2017.
  16. O'Donnell, Michelle (26 November 2004). "Arthur Hailey, Novelist Who Had a Hit in 'Airport,' Dies at 84". The New York Times. Retrieved 5 February 2017.
  17. Guttridge, Peter (24 November 2004). "Arthur Hailey". The Independent. Archived from the original on 29 మార్చి 2019. Retrieved 6 February 2017.
  18. Levin, Martin (7 April 1968). "Reader's Report" (PDF). The New York Times. Retrieved 5 February 2017.
  19. "Arthur Hailey". The Telegraph. 27 November 2004. Retrieved 7 February 2014.
  20. Skow, John (13 December 1971). "Books: Internal Combustion". Time. Retrieved 13 February 2017.
  21. Reed, John (19 September 1971). "Wheels". The New York Times. Retrieved 13 February 2017.
  22. "Detective". Publishers Weekly. 30 June 1997. Retrieved 13 February 2017.