Jump to content

ఆర్థిక మిగులు

వికీపీడియా నుండి

ఆర్థిక మిగులు

[మార్చు]

ఆర్థిక శాస్త్రము ప్రకారం “ ఆర్థిక మిగులు “ లేక “ మార్శల్ మిగులు “ అనగా రెండిటిని సూచిస్తుంది. వినియోగదారుని మిగులు అనగా వాళ్ళు ఏదైనా వస్తువుకు పెట్టగల అత్యధిక ధర కన్నా తక్కువ ధరకే వస్తువును పొందడం. తయారీదారుని మిగులు అనగా వాళ్ళు ఏదైనా వస్తువును అమ్మాలనుకున్న అత్యల్ప ధర కన్నా ఎక్కువ ధరకే దానిని అమ్మడం. మార్క్స్ శాస్త్రము ప్రకారం మిగులు అనేది విలువకు, ఉత్పత్తికి, శ్రమకు కూడా చెందుతుంది.

అవలోకనము

[మార్చు]

ఈ పదాన్ని ఆర్థిక శాస్త్రకారుడు పాల్ ఎ బరన్ గుత్తాధిపత్యాన్ని గురించి చెప్పడానికి సృశ్తించాడు. పాల్ స్వీజీతో కలిసి దీనిని మరింత లోతుగా పరిశోధించాడు. మార్క్స్ కార్మిక సిద్ధాంతాలతో దీనిని వివరించాడు. సరఫరాకు డిమాండ్ కు రేఖా చిత్రం గీస్తే డిమాండ్ కు కింద, సమతౌల్య ధరకు పైన ఉండే వైశాల్యాన్నే వినియోగదారుని మిగులు అంటారు. అలాగే సరఫరాకు పైనా సమతౌల్య ధరకు కింద ఉన్న వైశాల్యమే ఉత్పత్తిదారుని మిగులు. అంటే వినియోగదారుడు ఎక్కువ ధర అయినా పెట్టడానికి సిద్ధపడ్డాడు. అలాగే ఉత్పత్తిదారుడు తక్కువ ధరకు అయినా అమ్మడానికి సిద్ధపడ్డాడు.

వినియోగదారుని మిగులు

[మార్చు]

అనగా వినియోగదారుడు ఒక వస్తువుకు అత్యధికంగా ఎంత ధర పెట్టగలడో, ఎంత పెడుతున్నాడో దానికి మధ్య తేడా. ఒకవేళ వినియోగదారుడు ఉన్న ధర కన్నా ఎక్కువ ధర పెట్టుటకు సిద్ధముగా ఉంటే తను లాభపడ్డట్టే. ఉదాహరణకు త్రాగు నీరు. బ్రతకడానికి అవసరము కాబట్టి నీటి కొరకు ఎంత పెట్టడానికైనా మనిశి సిద్ధపడతాడు. అలాగే తను త్రాగే మొదటి కొన్ని లీటర్ల మీద ఎక్కువ లాభపడతాడు (చావును తప్పిస్తుంది కాబట్టి). వినియోగదారుడు పెట్టగల అత్యధిక ధర మొదటి యూనిట్ కు పెట్టగల అత్యధిక ధర, రెండవ యూనిట్ కు పెట్టగల అత్యధిక ధర, అలా అలా. ఆ ధరలు తగ్గుకుంటూ వెళ్తుంది. తనకు మిగులు ఎప్పుదు అత్యధికంగా వస్తుందో అంత ఖర్చు పెడతాడు వినియోగదారుదు. ఇది ఎప్పుడు అనగా చివరి యూనిట్ ధర కూడా మార్కెట్ ధర కన్నా ఎక్కువ ఉన్నప్పుడు. ప్రతి వినియోగదారుని మిగులు కలిపితే మొత్తం మిగులు వస్తుంది.

సరఫరా , డిమాoడ్ నుoచి లెక్కిoపు

[మార్చు]

వినియోగదారుని మిగులు డిమాండ్ కు కింద, మార్కెట్ ధరకు పైన ఉన్న వైశాల్యం. ఒకవేళ అది ఒక రేఖ అయినచో అది ఆ త్రిభుజ వైశాల్యం. ఇక్కడ Pmkt అనగా మార్కెట్ ధర. Pmax అనగా కొన్న వస్తువు సున్నాకు పడిపోయినప్పుడు. మిగతా వాటికి ఇంటిగ్రల్ క్యాలుకులస్ వాడి కనుక్కోవచ్చు. ఇక్కడ దీనిని బట్టి ఒకవేళ సమతౌల్య ధర పెరిగినా లేక సమతౌల్య వస్తువు పెరిగినా మిగులు తగ్గుతుంది.

ధర తగ్గినప్పుడు లాభాల పoపకo

[మార్చు]

ఒకవేళ సరఫరా పెరిగితే ధర తగ్గుతుంది, మిగులు పెరుగుతుంది. ఇది రెండు వర్గాల ప్రజలకు లాభం చేకూరుస్తూంది. ఒకటి ఇంతకు ముందు కొనేవాళ్ళు ఇంకా ఎక్కువ కొంటారు కావున ఎక్కువ మిగులు సాధిస్తారు. ఇంతకు మొందు కొనే స్తోమత లేనివాళ్ళు కూడా కొంతమంది కొంటారు. ఉదాహరణకు ఒక రేఖా చిత్రాన్ని తీసుకోండి. ధర తగ్గినప్పుడు ఇంతకు ముందు కొనేవాళ్ళ కింద కొద్దిగా పెరుగుతుంది (ఒక దీర్ఘచతురస్రo) అలాగే కొత్తగా ఒక త్రిభుజం కలుస్తుంది వైశాల్యములో . ఇలా లాభాల పంపకం జరుగుతుంది.

వన్ హాఫ్ నియమo

[మార్చు]

ఇది ఒక డిమాండ్ దగ్గర సరఫరాలో మార్పు ద్వారా వినియోగదారుని మిగులు కడుతుంది. ఒకవేళ అది రేఖా చిత్రము అయితే ఆ తేడా ఒక చతుర్భుజము. ఇక్కడ CS= వినియోగదారుని మిగులు Q0, Q1 అనగా ఇంతకు ముందు, ఇప్పుడు ఉన్న డిమాండ్ P0, P1 అనగా ఇంతకు ముందు, ఇప్పుడు ఉన్న ధరలు.