ఆర్మేనియన్ రైల్వే మ్యూజియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్మేనియన్ రైల్వే మ్యూజియం
Հայաստանի երկաթուղու թանգարան
Հայաստանի երկաթուղու թանգարան (4).jpg
స్థాపన31 జూన్ 2009 (2009-06-31)
ప్రదేశంయెరెవాన్, ఆర్మేనియా
Coordinates40°09′22″N 44°30′26″W / 40.15611°N 44.50722°W / 40.15611; -44.50722Coordinates: 40°09′22″N 44°30′26″W / 40.15611°N 44.50722°W / 40.15611; -44.50722
Typeరైల్వే మ్యూజియం
Directorఖోరెన్ అవెతిస్యాన్
Ownerదక్షిణ కాకసస్ రైల్వే
వెబ్www.ukzhd.am/muzey.html

ఆర్మేనియన్ రైల్వే మ్యూజియం (అర్మేనియన్:Հայաստանի երկաթուղու թանգարան) ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లోని ఒక రైల్వే మ్యూజియం.

31 జూలై 2009 న, రష్యన్ రైల్వేకు చెందిన ఒక ఆర్మేనియన్ రైలు ఆపరేటరు దక్షిణ కాకసస్ రైల్వే సంస్థ ప్రాంతంలో, రైల్వే మ్యూజియాన్ని ప్రారంభించారు.[1][2][3] చీఫ్ ఇంజనీరు సెర్గే హరుత్యున్యన్ ప్రకారం ఈ మ్యూజియాన్ని అంతర్జాతీయ రైల్వే దినోత్సవం (2 ఆగస్టు 2009) న ప్రారంభించాలనుకున్నారు.[4]

1986 నుండి ఆర్మేనియన్ రైల్వే చరిత్ర ఈ మ్యూజియంలో సమకూర్చబడింది. ఉన్నాయి. ఇక్కడ ఉన్న 10 ప్యానెల్లలో ఒక్కొక్కటీ ఒక నిర్దిష్ట కాలాన్ని సూచిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రదర్శనశాలలో ఆర్మేనియాలోని రైల్వే క్రాసింగ్లు వాటిని నిర్మించిన విధానము, పాత రైళ్ల యొక్క ఛాయాచిత్రాలు, పాత మరియు ఆధునిక రైళ్ల యొక్క నమూనాలు మరియు రైల్రోడ్ పరికరాలు ఉన్నాయి.[5] వాటిలో కొన్ని పరికరాలను రష్యన్ రైల్వేశాఖ బహుమతిగా ఇచ్చింది. మ్యూజియం దగ్గరలోని ఒక తోటలో అనేక పెద్ద వస్తువులు ఉన్నాయి. 3ա705-46 సంఖ్య కలిగిన 1930వ సంవత్సరపు లోకోమోటివ్, ఒక క్యారేజి (తరువాత కాకసస్ రైల్వే వ్యవస్థ నిర్మాణంపై ఒక గృహ ప్రదర్శనగా మార్చారు) ప్రక్కనే స్టేషనులో ఉన్నాయి.[6] సోవియట్ సమయంలో  ఈ మ్యూజియం పనిచెయలేదు, ఒక చిన్న ప్రాతినిధ్యం మాత్రమే నిలబడి ఉన్న ట్రాక్ లపై జరిగింది.

మ్యూజియం సోమవారం నుండి శుక్రవారం (10:00-17:00) వరకు, [7] తెరిచి ఉంటుంది. ఇక్కడ ఆర్మేనియా మరియు రష్యాకు చెందిన రైళ్ళు మొదలగునవి ఉన్నాయి.

సూచనలు[మార్చు]