ఆర్‌.శోభ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్‌.శోభ
జననం
రొయ్యూరు శోభ

1965
వృత్తితెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఐ.ఎఫ్‌.ఎస్ అధికారిని
జీవిత భాగస్వామిఆర్‌.సుందరవదన్‌ (మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి)

రొయ్యూరు శోభ, 1986 బ్యాచుకు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి. ఆమె తెలంగాణ అటవీ ప్రధాన సంరక్షణాధికారి (పీసీసీఎఫ్‌)- ఎఫ్‌ఏసీగా పదవివిరమణ చేసిన తరువాత ఆమెను 2022 ఫిబ్రవరి 28న తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) ప్రభుత్వం నియమించింది.[1][2]

వృత్తి జీవితం[మార్చు]

ఆర్‌.శోభ యూపీ డెహ్రాడూన్‌లోని ఇందిరాగాంధీ నేషనల్‌ ఫారెస్ట్‌ అకాడమీలో ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ, అనంతపురం లోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ బయోసైన్స్‌లో పట్టా అందుకొని 1986లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికై వివిధ హోదాల్లో పని చేసి పీసీసీఎఫ్‌ (ఎఫ్‌సీఏ)గా కాకముందు మూడేళ్ల పాటు అదనపు పీసీసీఎఫ్‌ (ఎఫ్‌సీఏ)గా పని 2019 ఏప్రిల్‌ 4న పీసీసీఎఫ్‌ ర్యాంకుతో పదోన్నతి అందుకొని 2019 జూలై 31న తెలంగాణ అటవీ ప్రధాన సంరక్ష ణాధికారి (పీసీసీఎఫ్‌)- ఎఫ్‌ఏసీగా నియమితులైంది. తెలుగురాష్ట్రాల నుంచి అటవీశాఖలో పీసీసీఎఫ్‌ వంటి అత్యున్నత ర్యాంక్‌ చేరుకున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించి దక్షిణాది రాష్ట్రాల్లో మొదటివ్యక్తిగా, దేశంలోనే నాలుగో మహిళా అధికారిగా గుర్తింపు పొందింది.[3]ఆర్‌.శోభ ఫిబ్రవరి 28న తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) గా పదవీ విరమణ చేసింది. ఆ వెంటనే ఆమెను ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఈ హోదాలో రెండేళ్లపాటు కొనసాగనుంది.

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (28 February 2022). "ప్రభుత్వ సలహాదారుగా ఆర్.శోభ నియామకం". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  2. Sakshi (1 March 2022). "ప్రభుత్వ సలహాదారుగా శోభ". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  3. Sakshi (1 August 2019). "దక్షిణాదిలో తొలి మహిళ..." Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆర్‌.శోభ&oldid=3486072" నుండి వెలికితీశారు