ఆర్.జనార్థనం నాయుడు
ఆర్.జనార్థనం నాయుడు గారు తొని నాళ్ళలోని గ్రంథాలయోధ్యమ నాయకులలో ఒకరు.
బాల్యము
[మార్చు]శ్రీ ఆర్.జనార్థనం నాయుడు గారు చిత్తూరు జిల్లాలో జన్మించారు.
విద్యాభ్యాసము
[మార్చు]శ్రీ ఆర్.జనార్థనం నాయుడు గారు ఉన్నత విద్యాభాస నిమిత్తము ఇంగ్లండు వెళ్ళి విద్యనభ్యసించి తిరిగి వచ్చి మద్రాసు ఉమ్మడి రాష్ట్ర విద్యా శాఖలో ఉద్యోగములో చేరారు.
గ్రంథాలయోధ్యమములో పాత్ర
[మార్చు]అనతి కాలములోనే మద్రాసులోని కన్నెముర గ్రంథాలయ నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు. ఒక దశాబ్దం పాటు - గ్రంథాలయం చట్టము అమలులోకి రాగానే స్పెషల్ ఆపీసర్ గా నియమితులైనారు. శ్రీ జనార్థనం నాయుడు గారు 1930 నుండి అయ్యంకి వెంకటరమణయ్య వారికి మిత్రులు. 1933 లో జరిగిన గ్రంథాలయ మహా సభకు అధ్యక్షత వహించారు. ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ శిక్షణ తరగతులకు శిక్షణ ప్రణాళిక తయారు చేసి ఇచ్చారు. దక్షిణాదిన అఖిల భారత గ్రంథాలయోధ్యమ కార్య క్రమాలు నిర్వహించడంలోఈ అయ్యంకి వెంకటరమణయ్య వారికి ఎంతగానో సహకరించారు. మద్రాసులో స్థిరపడి అక్కడనుంచే ఉధ్యమ కార్య క్రమాలు నిర్వహించిన కార్య శూరుడు ఆర్.జనార్థనం నాయుడు గారు.
మూలాలు
[మార్చు]గ్రంథాలయోధ్యమ శిల్పి అయ్యంకి అనుగ్రంథము: పుట.