ఆర్ బి ఎల్ బ్యాంక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్ బి ఎల్ బ్యాంక్
Typeపబ్లిక్
బి.ఎస్.ఇ: 540065
NSERBLBANK
పరిశ్రమపరిశ్రమ
స్థాపన1943
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయంముంబై , మహారాష్ట్ర , భారతదేశం
Areas served
ప్రాంతాల సేవలు
Key people
Mr. R సుబ్రమణ్యకుమార్ (MD & CEO)
Productsకన్స్యూమర్ బ్యాంకింగ్ , కార్పోరేట్ బ్యాంకింగ్ , ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్
Revenue12,000 మిలియను (US$150 million) (2019)[1]
1,939.83 crore (US$240 million) (2019)[1]
866.95 crore (US$110 million) (2019)[1]
Total assets80,359 crore (US$10 billion) (2019)[2]
Number of employees
5,843 (2019)
Websitewww.rblbank.com Edit this on Wikidata

ఆర్ బి ఎల్ బ్యాంక్ (ఆంగ్లం: RBL Bank) (పూర్వం రత్నాకర్ బ్యాంకు) 1943 లో స్థాపించబడిన ఒక భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంకు. ముంబైలో ప్రధాన కార్యాలయం గా ఉన్నది. ఇది ఆరు వర్టికల్స్ లో సేవలను అందిస్తుంది: కార్పొరేట్, సంస్థాగత బ్యాంకింగ్, కమర్షియల్ బ్యాంకింగ్, బ్రాంచ్-బిజినెస్ బ్యాంకింగ్, రిటైల్ ఆస్తులు, డెవలప్ మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్, ట్రెజరీ , ఫైనాన్షియల్ మార్కెట్ ఆపరేషన్స్ ను నిర్వహిస్తుంది.[3]

చరిత్ర[మార్చు]

ఆర్ బి ఎల్ బ్యాంక్ గతంలో రత్నాకర్ బ్యాంక్ దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఉనికితో భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రైవేటు రంగ బ్యాంకులలో ఒకటి. కార్పొరేట్ & ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ కమర్షియల్ బ్యాంకింగ్ బ్రాంచ్ & బిజినెస్ బ్యాంకింగ్ రిటైల్ అసెట్స్ డెవలప్మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ ట్రెజరీ ,ఫైనాన్షియల్ మార్కెట్స్, ఆపరేషన్స్ అనే ఆరు బిజినెస్ వర్టికల్స్ కింద బ్యాంక్ ప్రత్యేక సేవలను అందిస్తుంది. డిసెంబర్ 2020 నాటికి దేశవ్యాప్తంగా 403 బ్రాంచీలతో  412  ఎటిఎమ్ ల నెట్ వర్క్ ద్వారా 9.08 మిలియన్లకు పైగా ఖాతాదారులకు బ్యాంకు  తన సేవలు అందిస్తోంది. 1943లో స్థాపించబడిన ఆర్ బిఎల్ బ్యాంక్ 2010లో ఒక కొత్త మేనేజ్ మెంట్ టీమ్ కింద మార్పులను ప్రారంభించింది. 9 ఆగస్టు 2013న రత్నాకర్ బ్యాంక్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) నుండి అనుమతులకు లోబడి రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ యొక్క బిజినెస్ బ్యాంకింగ్ బిజినెస్ క్రెడిట్ కార్డ్స్ బిజినెస్ క్రెడిట్ కార్డ్స్ బిజినెస్ & మార్టిగేజ్ పోర్ట్ ఫోలియోను భారతదేశంలో కొనుగోలు చేయడానికి అంగీకరించినట్లు ప్రకటించింది.[4]

అభివృద్ధి[మార్చు]

గతంలో రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ అని పిలిచేవారు, 2014 సంవత్సరంలో తన పేరును ఆర్ బిఎల్ బ్యాంక్ లిమిటెడ్ గా మార్చారు.[5] ఆర్ బిఎల్ బ్యాంక్ లిమిటెడ్ భారతదేశంలో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ గా పనిచేస్తుంది. ఇది కార్పొరేట్/హోల్ సేల్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్, ట్రెజరీ, ఇతర బ్యాంకింగ్ ఆపరేషన్స్ సెగ్మెంట్ ల ద్వారా పనిచేస్తుంది. బ్యాంక్ డిపాజిట్లలో పొదుపు, ప్రస్తుత,సంస్థ ఖాతాలు, అలాగే ఫిక్సిడ్ డిపాజిట్లు ఉన్నాయి. బ్యాంక్ వ్యాపారం, గృహ, వ్యక్తిగత, కారు , విద్యా రుణాలు, అలాగే ఆస్తిపై రుణాలు, ఆస్తిపై ఓవర్ డ్రాఫ్ట్, బంగారంపై రుణాలు, వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్, చిన్న వ్యాపార రుణాలను కూడా అందిస్తుంది. జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా , వెల్త్ మేనేజ్ మెంట్, ఇ-ఎఎస్ బిఎ, నేషనల్ పెన్షన్ సిస్టమ్ వంటి ఇన్వెస్ట్ మెంట్ సర్వీసులు, డీమ్యాట్ ఖాతా లను తన వినియోగదారులకు సేవలను అందిస్తుంది. కంపెనీ ఆన్లైన్ పన్ను. బిల్లు చెల్లింపు, ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ .నెట్ బ్యాంకింగ్, మర్చంట్ చెల్లింపు సేవలతో పాటు డెబిట్, క్రెడిట్. ప్రీపెయిడ్ కార్డులను అందిస్తుంది. ప్రైవేట్ ఈక్విటీ క్యాపిటల్ అడ్వైజరీ, ప్రాజెక్ట్ ,ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, స్ట్రక్చర్డ్ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్ అందిస్తుంది; క్యాష్ మేనేజ్ మెంట్, ట్రేడ్ అండ్ రెమిటెన్స్, సప్లై ఛైయిన్ ఫైనాన్స్ సర్వీసులు; క్యాపిటల్ మార్కెట్లు, ఫారెక్స్, బులియన్ వంటి ఆర్థిక మార్కెట్లు, ట్రెజరీ ఉత్పత్తులు ఉన్నాయి.బ్యాంకు అగ్రిబిజినెస్, ఎన్ఆర్ఐ, సిగ్నేచర్ బ్యాంకింగ్ సేవలతో పాటు సురక్షితమైన డిపాజిట్ లాకర్లను అందిస్తుంది. జూలై 31, 2021 నాటికి, ఇది సుమారు 435 బ్యాంకు శాఖలతో ఉన్నది. 1,424 బిజినెస్ కరస్పాండెంట్ బ్రాంచీలు, 380 ఎటిఎమ్ లు ఉన్నాయి. [6]

అవార్డులు[మార్చు]

ఆర్ బి ఎల్ బ్యాంక్ అవార్డులు , గుర్తింపులు వివిధ సంస్థల ద్వారా లభించింది.[5]

  • బెస్ట్ బ్యాంక్ ఫర్ మైక్రోఫైనాన్స్ - ఆసియామనీ బెస్ట్ బ్యాంక్ అవార్డ్స్ 2019 బై యూరోమనీ
  • బెస్ట్ స్మాల్ బ్యాంక్, బిజినెస్ టుడే - మనీ టుడే ఫైనాన్షియల్ అవార్డ్స్ 2019
  • బెస్ట్ సెల్ఫ్ సర్వీస్ బ్యాంకింగ్ ఇనిషియేటివ్, అప్లికేషన్ - ది ఏషియన్ బ్యాంకర్ ఫైనాన్షియల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అవార్డ్స్ బై ది ఏషియన్ బ్యాంకర్[7]


మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "RBL Bank Yearly Results". The Economic Times. Retrieved 2019-07-17.
  2. "Combined Result Q4 FY19" (PDF). RBL Bank. Retrieved 2019-07-17.
  3. "RBL Bank Ltd. | Check why RBL Bank Ltd. Share Price is UP by 8.51% as on 13 May, 2022, 15:09 PM - NDTV Profit". www.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 2022-05-13.
  4. "RBL Bank Ltd". Business Standard India. Retrieved 2022-05-13.
  5. 5.0 5.1 "RBL Bank History | RBL Bank Information". The Economic Times (in ఇంగ్లీష్). Retrieved 2022-05-13.
  6. "RBL Bank Limited (RBLBANK.NS) Company Profile & Facts - Yahoo Finance". finance.yahoo.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-05-13.
  7. "Infosys Finacle & RBL Bank win at The Asian Banker Financial Technology Innovation APAC Awards Programme 2019". Finacle (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-05-13.