Jump to content

ఆవశ్యక నూనెల ఉత్పత్తి- సాల్వెంట్ ఎక్సుట్రాక్షనువిధానం

వికీపీడియా నుండి

ఆవశ్యకనూనెలను నీటి అవిరిని ఉపయోగించి ఉత్పత్తి చెయ్యడమే కాకుండగా ఎదైన ద్రావణి (Solvent) ని ఉపయోగించికూడా ఉత్పత్తిచేయుదురు.ముఖ్యంగా పూల రెక్కల/రెమ్మల నుండి ఆవశ్యక నూనెలను తయారుచేయుటకు సాల్వెంట్ ఎక్సుట్రాక్షను పద్ధతిలో ఉత్పత్తి చేయుదురు.అంతేకాక హెర్బల్ ఎక్సుట్రాక్షన్సు కూడా సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ విధానం లోనే ఉత్పత్తి చేయుదురు.సాధారణంగా పూల నుండి ఆవశ్యక నూనెలను సంగ్రహించుటకు హెక్సెనును సాల్వెంట్ గా వాడెదరు.హెర్బల్ ఎక్సుట్రాక్షనుకు అయ్యినచో హెక్సెను, టొలిన్, అసిటొను తదితరాలను సాల్వెంట్ గా వినియోగిస్తారు.

సాల్వెంట్ ఎక్సు ట్రాక్షను పరికర సముదాయం

[మార్చు]

*1. ఎక్సుట్రాక్టరు

*2. సాల్వెంట్ ఎవపరెటరు

*3. సాల్వెంట్ కండెన్సరు

*4.సాల్వెంట్ రిసివరు టాంకు

*5. పంపులు (తోడు యంత్రాలు)

*6.స్టిమ్‍బాయిలరు

ఎక్సుట్రాక్టరు

[మార్చు]

ఎక్సుట్రాక్టరు లోనే సాల్వెంట్ నుపయోగించి పూల నుండి ఆవశ్యక నూనెలను వేరుచేయుదురు. సాధారణంగా పూలనుండి ఆవశ్యక నూనెలను తీయు ఎక్సుట్రాక్టరులు బ్యాచ్ (Batch) రకానికి చెందినవి. ఎక్సుట్రాక్టరు నిలువుగా స్తుపాకారంగా వుండి, పై భాగం, క్రింది భాగం అర్ధ వృత్రాకారంగా వుండును. ఎక్సుట్రాక్టరులను స్టెయిన్‍లెస్ స్టీల్ 316 తో తయారుచేయుదురు.లోపలి భాగంలో వరుసగా ఒక దాని పైన మరొకటి చొప్పున కొన్ని ట్రేలను అమర్చి వుండును. ఈ ట్రేల అడుభాగం రంధ్రాలను కలిగి వుండును. ఎక్సుట్రాక్టరు పైభాగం మూత వలె యుండి, పక్కకు జరుపుటకు, మూయుటకు వీలుగా మడత బందులను కలిగి వుండును. ఎక్సుట్రాక్టరు పై మూతను పక్కకు జరిపి, పూలను ట్రేలలలో నింపి, ఎక్సుట్రాక్టరు లోపల ఒకదాని మీద ఒకటి చొప్పున అమర్చి, ఎక్సుట్రాక్టరు పై మూతను ఎటువంటి ఖాళి లేకుండగా బోల్టులద్వారా గట్టిగా బిగించెదరు. లేనిచో లీకుల ద్వారా సాల్వెంట్ ఆవిరులు బయటకు వచ్చు ఆవకాశం ఉంది. అడుగు భాగంలో ఒక స్టిలు గొట్టం వుండి పంపు యొక్క సక్షను (suction) ఫ్లాంజికి కలుపబడి వుండును. ఎక్సుట్రాక్టరులోని మొదటి ట్రే పైన ఒక వర్తులాకారపు స్టిల్ గొట్టం వుండి దానికి స్ప్రే నాజిల్సు అమర్చబడి వుండును.నాజిల్సు యొక్క స్టీల్ గొట్టం (steel pipe) పంపుయొక్క డెలివరి ఫ్లాంజికి అనుసంధానం చెయ్యబడి వుండును. పంపుద్వారా పిచికారి (spray) చెయ్యబడిన సాల్వెంట్ మొదటి ట్రే లోని పూల మీద పడి, ట్రే కున్న రంధ్రాలద్వారా రెండొ ట్రేకు ప్రవహించును. ఈ విధంగా పంపు చెయ్యి సాల్వెంట్ ఒక ట్రే నుండి మరో ట్రేకు వరుసగా దిగువ వరకు పడుచూ, చివరలో ఎక్సుట్రాక్టరు అడుగున వున్న అర్ధవృత్రాకార భాగంలో చేరును. ఇలా చేరిన సాల్వెంట్ మరల పంపుద్వారా తిరిగి ఎక్సుట్రాక్టరు మొదటి ట్రేలో స్ప్రే చెయ్యబడును. సాల్వెంట్ ఇలా ఒక ట్రే నుండి మరొక ట్రేకు ప్రవహిస్తున్నప్పుడు పూల రెమ్మలలోని ఆవశ్యక నూనెలు సాల్వెంట్ లో కరగును. ఆవశ్యక నూనెల, స్లాల్వెంట్ మిశ్రమాన్ని మిసెల్లా అంటారు.

ఎవపరేటరు

[మార్చు]

ఎవపరెటరులో ఆవశ్యకనూనె+సాల్వెంట్ మిశ్రమం (మిసెల్లా) నుండి సాల్వెంట్ ను వేరు పరచి ఆవశ్యకనూనె గాఢతను పెంచెదరు. ఎవపరేటరు కూడా స్టేయిన్‍లెస్ స్టీల్ తో చేయబడి, నిలువుగా స్తుపాకారంగా వుండి రెండు చివరలో అర్ధవృత్రాకార భాగాలను కలిగి వుండును. ఎవపరేటరుకు రెక్కలున్న అజిటెటరు (కవ్వం వంటిది) అమర్చబడి, ఒక మోటరుకు అనుసంధానం చెయ్యబడి వుండును. ఎవపరేటరులోని మిసెల్లాను వేడి చేయుటకు వీలుగా స్తుపాకార భాగం వెలుపలి వైపున ఒక స్టీమ్ జాకెట్ వుండును. ఎవపరేటరు యొక్క ఈ స్టీం జాకెట్ కు స్టీంను ఇవ్వడం ద్వారా ఎవపరేటరులోని మిసెల్లాను నెమ్మదిగా వేడి చెయుదురు. అదే సమయంలో అజిటెటరును రన్నింగ్ లో వుంచి నెమ్మదిగా పాత్రలోని మిసెల్లాను సమయుతంగా కలియ తిప్పడం చేయుదురు. ఈ అజిటెటరు కుడా చాలా నెమ్మదిగా తిరిగెలా అజిటెటరు మోటరుకు ఒక రిడక్షను గేరుబాక్సును అనుసంధానం చేసి వుండును. ఎవపరెటరులో ఏర్పడు సాల్వెంట్ వేపరులు కండెన్సరుకు వెళ్ళెలా ఒక అవిరి గొట్టం ఎవపరేటరు పైభాగంలో వుండును.

సాల్వెంట్ కండెన్సరు

[మార్చు]

ఎవపరెటరులో ఎర్పడిన సాల్వెంట్ వేపరులు వేపరుడక్టు ద్వారా కండెన్సరుకు వచ్చి ఇక్కడ చల్లబడి ద్రవ సాల్వెంట్ గా మారును.సాల్వెంట్ వేపరు కండెన్సరులు ఎక్కువగా షెల్&ట్యూబ్ (shell&tube) రకానికి చెందినవి అయ్యి వుండును.లోపలి ట్యూబ్ లు స్టెయిన్‍లెస్ స్టీల్ తో చెయ్యబడి వుండును.ట్యూబ్ లలో చల్లని నీరును ప్రవహింప చేయుదురు.షెల్ లో వేపరులు వెళ్ళును.కండెన్సరులో ద్రవీకరింపబడిన సాల్వెంట్, సాల్వెంట్ రిసివరు టాంకునకు వెళ్ళును.

సాల్వెంట్ రిసివరు టాంకు

[మార్చు]

కండెన్సరులో ద్రవీకరించబడిన సాల్వెంట్ ను ఈ టాంకులో మొదట నిల్వచేయుదురు.సాల్వెంట్ లో ఎమైన నీరు వున్నచో తొలగించి, పంపు ద్వారా తిరిగి ఎక్సుట్రాక్టరుకు సాల్వెంట్ పంపెదరు.

పంపులు/తోడు యంత్రాలు

[మార్చు]

ఎక్సుట్రాక్టరులో సాల్వెంట్/మిసెల్లాను సర్కులేట్ చెయ్యుటకు, సాల్వెంట్ రిసివరులోని సాల్వెంట్ ను ఎక్సుట్రాక్టరుకు పంపుటకు పంపులు అవసరం. అలాగే ఎవపరేటరులో ఉత్పత్తి అయ్యిన ఆవశ్యకనూనెను నిల్వ టాంకు (storage tank) నకు పంపుటకు పంపులు అవసరం.

స్టీం బాయిలరు

[మార్చు]

స్టీం బాయిలరులో నీటిని వేడి చేసి/మరగించి నీటి ఆవిరిని ఉత్పత్తి చేయుదురు.ఈ నీటి ఆవిరి ద్వారా ఎవపరెటరులోని మిసెల్లాను వేడి చేసి, ఆవశ్యకనూనె నుండి సాల్వెంట్ ను వేరుచెయ్యడం జరుగుతుంది.

ఉత్పత్తి విధానం

[మార్చు]

ఎక్సుట్రాక్టరు ట్రేలలో పూలనున నింపి, మూతవేసి సాల్వెంట్ పంపు ద్వారా ఎక్సుట్రాక్టరులోని ట్రేలమీద స్ప్రే చెయ్యడం ప్రారంబించెదరు.పై ట్రే మీద స్ప్రే చేసిన సాల్వెంట్ ఒక ట్రే నుండి మరో ట్రేలో పడుచున్నప్పుడు పూలలోని నూనె సాల్వెంట్ లో కరుగును.ఈ విధంగా పూలలోని నూనె సాల్వెంట్ లో కరిగే వరకు సాల్వెంట్ ను సర్కులేట్ చెయ్యుదురు.ఇప్పుడు సాల్వెంట్+నూనెను (మిసెల్లా) ను ఎవపరెటరుకు పంపుద్వారా పంపించెదరు.ఎక్సుట్రాక్టరులోని ట్రేలలో వున్న నూనె తీసిన పూలలోని సాల్వెంట్ ను ఒపన్ స్టీం ద్వారా వేడి చేసి, వేపరులుగా మార్చి కండెన్సరుకు పంపి ద్రవీకరించెదరు.ఎవపరెటరుకు వున్న స్టీం జాకెట్ కు స్టీం యిచ్చి ఎవపరెటరులోని మిసెల్లాను నెమ్మదిగా వేడి చెయ్యడం ప్రారంభించెదరు.మిసెల్లా ఉష్ణోగ్రత 65-72సెంటిగ్రెడ్ వుండేలా జాకెట్కు స్టీం యిచ్చెదరు.ఎవపరెటరు అజిటెటరు (కవ్వం) ను నెమ్మదిగా తిప్పడం వలన ఎవపరెటరులోని మిసెల్లా అంతయు సమానంగా వేడెక్కును. ఎవపరెటరులో ఎర్పడు సాల్వెంట్ వేపరులను కండెన్సరుకు పంపి చల్లార్చి ద్రవీకరించెదరు.కండెన్సరులో ద్రవీకరించబడిన సాల్వెంట్ రిసివరు టాంకుకు వెళ్లి అక్కడునుండి పంపుద్వారా ఎక్సుట్రాక్టరుకు పంప్ చేయుదురు.ఎవపరెటరులో గాఢతచెందిన ఆవశ్యక నూనెను నిల్వపాత్రలో నింపి భద్రపరచెదరు.దీనిని ముడి (crude) ఆవశ్యక నూనె అంటారు.

సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ పద్ధతిలో ఆవశ్యక నూనెలను ఉత్పత్తి చేసినప్పుడు, సాల్వెంట్ లో మొక్కలలోని మైనపు పదార్థాలు (waxes, రంగుపదార్థాలు (color pigments) కూడా ఆవశ్యక నూనెలతో పాటు కలసి ఎక్సుట్రాక్ట్ అగును.అందుచే ఈ పదార్థాలను తొలగించవలసి ఉంది.అల్కహల్ లో మైనపు పదార్థాలు అతి తక్కువ శాతంలో కరుగును.అందుచే ఈ విధంగా వచ్చిన ముడి ఆవశ్యక నూనెను యిథైల్ అల్కహల్ లో కరగించెదరు.అల్కహల్ లో కేవలం ఆవశ్యక నూనెలు మాత్రమే కరగి, మైనపు పదార్థాలు అడుగు భాగంలో వుండి పోవును.తేటగా వున్న ఆవశ్యక నూనె+ఆల్కహల్ మిశ్రమాన్ని మరో ఎవపరెటరులో తీసుకొని ఆల్కహల్ ను ఎవపరెట్ చేసి ఆవశ్యక నూనెను చేరు చేయుదురు.