ఆశ భట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆశ భట్
అందాల పోటీల విజేత
జననముఆశ భట్
(1992-09-05) 1992 సెప్టెంబరు 5 (వయసు 32)
భద్రవతి, కర్నాటక , భారత దేశం
పట్టణంభద్రవతి, కర్నాటక
నివాసంముంబై, మహారాష్ట్ర ,భారత దేశం .
విద్యఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్
పూర్వవిద్యార్థిఆర్.వి ఇంజనీరింగ్ కళాశాల
ఎత్తు1.75 మీ. (5 అ. 9 అం.)
జుత్తు రంగునలుపు
కళ్ళ రంగుముదుర గోధుమ రంగు

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆశా భట్ జననం 1992 సెప్టెంబరు 5 కర్ణాటకలోని భద్రావతిలో జన్మించింది. కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.తండ్రి పేరు సుబ్రహ్మణ్య భట్, తల్లి శ్యామల భట్. ఆశా భట్ అక్క అక్షతా భట్ వృత్తిరీత్యా డాక్టర్.[1] ఆశా భద్రవతి సెయింట్ చార్లెస్ పాఠశాలలో చదివింది. అందాల పోటీలలో పాల్గొంది.అల్వాస్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఎన్‌సిసిలో చేరి రిపబ్లిక్ డే క్యాంప్‌లో పాల్గొనడానికి ఎంపికైనది.తరువాత, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేయడానికి ఆమె బెంగళూరులోని ఆర్‌వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది.ఆమె 14 సంవత్సరాలు శాస్త్రీయ నృత్యంలో శిక్షణ తీసుకుంది.

కెరీర్

[మార్చు]

ఆశా భట్ టైమ్స్ గ్రూప్ నిర్వహించిన “మిస్ దివా” పోటీలో పాల్గొనడం ద్వారా 2014 లో తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. అందాల పోటీల్లో పాల్గొని గెలిచింది.మిస్ దివా 2014 లో మిస్ కంజెనియాలిటీ ,మిస్ బ్యూటిఫుల్ స్మైల్, మిస్ ఫాస్సినేటింగ్ అనే మూడు ప్రత్యేక అవార్డులను కూడా ఆమె గెలుచుకుంది.[2][3][4] మిస్ సుప్రానేషనల్ కిరీటం పొందిన మొదటి భారతీయ మహిళగా ఆమె నిలిచింది.[5] పోటీలో ఆశా మిస్ టాలెంటెడ్ టైటిల్ కూడా గెలుచుకుంది.

నటన ప్రస్థానం

[మార్చు]

2019 లో, ఆమె బాలీవుడ్ చిత్రం “జంగ్లీ” తో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఇందులో 'మీరా' అనే జర్నలిస్ట్ పాత్రను పోషించింది.

వాణిజ్య ప్రకటనలు

[మార్చు]

ఆమె క్లోజ్-అప్,యమహా మోటార్ కంపెనీ, ఫెమినా,ఫరెవర్ మార్క్ తో సహా అనేక బ్రాండ్ల టీవీ వాణిజ్య ప్రకటనలలో నటించింది.[6][7][8][9]

అవార్డులు

[మార్చు]

2016 లో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆమెకు బ్యూటీ విత్ ఎ పర్పస్ అవార్డు లభించింది.[10]

సామాజిక కార్యక్రమాలు

[మార్చు]

మోడల్‌గా కాకుండా, ఆమె కూడా ఒక సామాజిక కార్యకర్త గా ఆస్ట్రా ఫౌండేషన్ అనే సొంత ఎన్జీఓను నడుపుతోంది.[11]

మూలాలు

[మార్చు]
  1. "Asha Bhat attributes her success to parents' encouragement". The Hindu.com. Retrieved 25 January 2016.
  2. "Miss Diva Universe 2014". globalbeauties.com. Archived from the original on 30 January 2016. Retrieved 25 January 2016.
  3. "Yamaha Fascino Miss Diva 2014: Sub-Contest Winners". The Times of India. Retrieved 25 January 2016.
  4. "ASHA BHAT ALL SET TO GET INDIA'S FIRST MISS SUPRANATIONAL CROWN". The Times of India. Retrieved 25 January 2016.
  5. "India's Asha Bhat is the first Indian to win Miss Supranational 2014 title". ibnlive.com. Archived from the original on 19 మార్చి 2016. Retrieved 20 April 2020.
  6. "Asha Bhat: The scintillating cover girl". The Times of India. Retrieved 25 January 2015.
  7. "Asha Bhat's scintillating photoshoot". The Times of India. Retrieved 25 January 2016.
  8. "I FELT LIKE A BRIGHT SHINY STAR IN THE SKY: ASHA BHAT". The Times of India. Retrieved 25 January 2016.
  9. "Asha Bhat endorses a jewellery brand - BeautyPageants". Femina Miss India. Retrieved 2019-05-31.
  10. "Stunning Asha Bhat awarded by Ranveer Singh". The Times of India. Retrieved 25 January 2016.
  11. "Asha Bhat: Tribute to a Girl with Golden Heart". thegreatpageantcommunity.com. Retrieved 25 January 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆశ_భట్&oldid=4285890" నుండి వెలికితీశారు