Jump to content

ఆసియాశాట్ ఉపగ్రహాలు

వికీపీడియా నుండి
ఆసియాసత్ ఉపగ్రహం - 8

ఆసియాశాట్ (ASIASAT) ఉపగ్రహాలు, భూస్థిర కక్ష్యలో పరిభ్రమించే టీవీ టెలీకమ్యూనికేషను ఉపగ్రహాలు. ఈ ఉపగ్రహాలను ఆసియా ఉపగ్రహ టెలీకమ్యూనికేషన్ కంపెనీ నిర్మించింది. ఆసియా శాటిలైట్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ లిమిటెడ్ (AsiaSat) ఆసియా లోని ప్రధాన వాణిజ్య శాటిలైట్ ఆపరేటర్.

చరిత్ర

[మార్చు]

ఆసియా శాటిలైట్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థను 1988లో స్థాపించారు. ఆసియాశాట్-5, ఆసియాశాట్-6, ఆసియాశాట్-7, ఆసియాశాట్-8, ఆసియాశాట్-9 అనే ఐదు ప్రధాన ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రక్షేపించింది.

ఉద్దేశం

[మార్చు]

ప్రసార, టెలికాం, మొబిలిటీ రంగాలలోని వినియోగదారులకు విశ్వసనీయమైన ఉపగ్రహ కనెక్టివిటీ, మీడియా, డేటా సొల్యూషన్‌లను అందించడం ఆసియాశాట్ ఉపగ్రహాల ముఖ్య ఉద్దేశం. ఆసియాశాట్ ఉపగ్రహాలను హాంకాంగ్‌లోని తాయ్ పో ఎర్త్ స్టేషన్‌లో ఉన్న సిబ్బంది బృందం 24 గంటలూ పర్యవేక్షిస్తూ, నియంత్రిస్తూంటారు.

బోర్డు డైరెక్టర్లు

[మార్చు]

ఆసియా శాటిలైట్ టెలికమ్యూనికేషన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డులో 10 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోజర్ టోంగ్. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వేన్ బన్నాన్ (ఛైర్మన్), వాంగ్ గువోక్వాన్ (వైస్ ఛైర్మన్), డింగ్ యుచెంగ్, చోంగ్ చి యెంగ్, మిస్టర్. హెర్మన్ చాంగ్ హ్సియుగో, ఫ్యాన్ జుయి-యింగ్. ఇండిపెండెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మార్సెల్ ఆర్. ఫెనెజ్, స్టీవెన్ ఆర్. లియోనార్డ్, ఫిలానా వై యింగ్ పూన్.

ఆసియాశాట్ ఉపగ్రహాల చరిత్ర

[మార్చు]
ఆసియాశాట్ ఉపగ్రహాలు
ఉపగ్రహం ప్రారంభ తేదీ
(UTC)
నోరాడ్ ఐడి అంతర్జాతీయ కోడ్ పెరిజీ అపోజీ కక్ష్య వంపు కక్ష్యా వ్యవధి సెమీ మేజర్ యాక్సిస్ (కి.మీ.) రాడార్ క్రాస్సెక్షన్ ప్రయోగ స్థలం
ఆసియాశాట్ 1 04-07-1990 20558 1990-030A 36,061.9 కిమీ 36,106.1 కిమీ 14.7 ° 1,450.9 నిముషాలు 22.5892 మీ2 (పెద్ద) జిచాంగ్ స్పేస్ సెంటర్, చైనా (XSC)
ఆసియాశాట్ 9 28-09-2017 42942 2017-057A 35,782.4 కిమీ 35,805.9 కిమీ 0.0 ° 1,436.1 నిముషాలు - త్యూరతం మిస్సైల్ అండ్ స్పేస్ కాంప్లెక్స్ (TTMTR)
ఆసియాశాట్ 6 07-09-2014 40141 2014-052A 35,790.9 కిమీ 35,797.8 కిమీ 0.0 ° 1,436.1 నిముషాలు - ఎయిర్ ఫోర్స్ ఈస్టర్న్ టెస్ట్ రేంజ్ (AFETR)
ఆసియాశాట్ 8 05-08-2014 40107 2014-046A 35,784.8 కిమీ 35,802.0 కిమీ 0.0 ° 1,436.1 నిముషాలు - ఎయిర్ ఫోర్స్ ఈస్టర్న్ టెస్ట్ రేంజ్ (AFETR)
ఆసియాశాట్ 7 25-11-2011 37933 2011-069A 35,786.9 కిమీ 35,800.7 కిమీ 0.0 ° 1,436.1 నిముషాలు 5.4455 మీ2 (పెద్ద) త్యూరతం మిస్సైల్ అండ్ స్పేస్ కాంప్లెక్స్ (TTMTR)
ఆసియాశాట్ 5 11-08-2009 35696 2009-042A 35,787.8 కిమీ 35,800.8 కిమీ 0.0 ° 1,436.1 నిముషాలు 15.8489 మీ2 (పెద్ద) త్యూరతం మిస్సైల్ అండ్ స్పేస్ కాంప్లెక్స్ (TTMTR)
ఆసియాశాట్ 4 12-04-2003 27718 2003-014A 35,782.8 కిమీ 35,805.0 కిమీ 0.9 ° 1,436.1 నిముషాలు 25.1188 మీ2 (పెద్ద) ఎయిర్ ఫోర్స్ ఈస్టర్న్ టెస్ట్ రేంజ్ (AFETR)
ఆసియాశాట్ 3S 21-03-1999 25657 1999-013A 36,150.2 కిమీ 36,231.0 కిమీ 6.4 ° 1,456.4 నిముషాలు 25.1486 మీ2 (పెద్ద) ఎయిర్ ఫోర్స్ ఈస్టర్న్ టెస్ట్ రేంజ్ (AFETR)

మూలాలు

[మార్చు]
  1. https://www.asiasat.com/
  2. https://www.n2yo.com/satellites/?c=AC&t=country