ఆస్టిగ్మాటిజం
ఆస్టిగ్మాటిజం | |
---|---|
అస్టిగ్మాటిజం ప్రభావితమైన కంటి కటకం ద్వారా వివిధ దూరాలనుంచి అస్పష్టమైన దృష్టి | |
ప్రత్యేకత | నేత్ర వైద్యం, ఆప్టోమెట్రీ |
లక్షణాలు | వివిధ దూరాలనుంచి అస్పష్టమైన దృష్టి, తలనొప్పి, కంటికి అలసట |
సంక్లిష్టతలు | అంబ్లియోపియా |
సాధారణ ప్రారంభం | ఏ వయస్సు వారైనా |
కారణాలు | అస్పష్టం |
రోగనిర్ధారణ పద్ధతి | కంటి పరీక్ష |
చికిత్స | కంటి అద్దాలు, కాంటాక్ట్ లెన్స్ లు , శస్త్ర చికిత్స |
తరుచుదనము | 30 నుంచి 60% పెద్దవారిలో (ఐరోపా, ఆసియా) |
ఆస్టిగ్మాటిజం అనేది ఒక రకమైన దృష్టి లోపం. కాంతి వక్రీభవన లోపం, దీనిలో కంటి రెటీనా కాంతిని సమానంగా కేంద్రీకరించదు. ఇది ఎంత దూరం నుంచి అయినా ఈ సమస్య వక్రీకరించిన లేదా అస్పష్టమైన దృష్టి దారితీస్తుంది. ఇతర లక్షణాలలో కంటి ఒత్తిడి, తలనొప్పి, రాత్రి సమయంలో వాహనాలు నడపడంలో ఇబ్బంది ఉండవచ్చు.[1] ఇది చిన్న వయస్సులో సంభవించి మారవచ్చు లేదా పెరగవచ్చు.[2] ఇది చిన్న వయస్సులో సంభవిస్తే, తరువాత ఇది అంబ్లియోపియా దారితీస్తుంది.[3]
కారణాలు
[మార్చు]ఆస్టిగ్మాటిజం సమస్య సంభవించడానికి స్పష్టమైన కారణం లేదు, అయితే ఇది పాక్షికంగా ఇది జన్యు కారణం అని కూడా నమ్ముతారు. అంతర్లీనంగా ఈ సమస్య ఏర్పడేందుకు దోహదపడే యంత్రాంగం కార్నియా క్రమరహిత వక్రత లేదా కంటి కటకంలో అసాధారణతలు వంటివి ఉంటాయి.[4]
రోగ నిర్ధారణ, చికిత్స
[మార్చు]కంటి పరీక్ష ఆటోరిఫ్రాక్టర్ కెరాటోమెట్రీ (ఆస్టిగ్మాటిజం కటకం, కార్నియా భాగాలను చూడటానికి ఉపయోగించే సాధనం) ద్వారా రోగ నిర్ధారణ జరుగుతుంది. మూడు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కంటి అద్దాలు (కళ్ళ జోడు), కాంటాక్ట్ లెన్సులు, శస్త్రచికిత్స. కంటి అద్దాలు ఉపయోగించడం చాలా సరళమైన విధానం. కాంటాక్ట్ లెన్సులు ఉపయోగించడం వలన దృష్టి క్షేత్రం విస్తృతం గా ఉంటుంది. వక్రీభవన శస్త్రచికిత్స కంటి ఆకారాన్ని శాశ్వతంగా మారుస్తుంది.[1]
వ్యాప్తి
[మార్చు]ఐరోపా, ఆసియాలలో, ఆస్టిగ్మాటిజం 30 నుంచి 60% మంది పెద్దవాళ్లు గురిఅవుతున్నారు.[5] అయితే ఏ వయసులో వారినైనా ఆస్టిగ్మాటిజం ప్రభావితం చేయవచ్చు.[1] ఆస్టిగ్మాటిజం సమస్యను 1801లో థామస్ యంగ్ గుర్తించి ప్రకటించాడు.[6]
References
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Facts About Astigmatism". National Eye Institute. National Institutes of Health. Archived from the original on 2 October 2016. Retrieved 16 June 2019.
- ↑ "The Ultimate Guide to Astigmatism". Feel Good Contacts.
- ↑ Harvey, EM (June 2009). "Development and treatment of astigmatism-related amblyopia". Optometry and Vision Science. 86 (6): 634–9. doi:10.1097/opx.0b013e3181a6165f. PMC 2706277. PMID 19430327.
- ↑ Read, SA; Collins, MJ; Carney, LG (January 2007). "A review of astigmatism and its possible genesis". Clinical & Experimental Optometry. 90 (1): 5–19. doi:10.1111/j.1444-0938.2007.00112.x. PMID 17177660. S2CID 8876207.
- ↑ Mozayan, E; Lee, JK (July 2014). "Update on astigmatism management". Current Opinion in Ophthalmology. 25 (4): 286–90. doi:10.1097/icu.0000000000000068. PMID 24837578. S2CID 40929023.
- ↑ "Thomas Young | British physician and physicist". Encyclopædia Britannica (in ఇంగ్లీష్). Archived from the original on 29 August 2017. Retrieved 28 August 2017.