ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2024
ఈ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2024 టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ ను బెలారస్ క్రీడాకారిణి ' అరినా సబ లెంక ' పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఇటలీ ఆటగాడు ' జనిక్ సినర్ ' గెలుచుకున్నారు[1]. 2024 జనవరి 27వ తేదీన ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అరినా సబ లెంక చైనాకు చెందిన క్విన్ జెంగ్ పై విజయం సాధించింది[2]. వరుసగా రెండో ఏడాది మహిళల సింగిల్స్ విభాగంలో అరినా సబ లెంక విజేతగా నిలిచింది[3]. జనవరి 28వ తేదీన జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్ లో జనిక్ సినర్ రష్యా ఆటగాడు డానిల్ మద్వే దేవ్ పై విజయం సాధించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించిన తొలి ఇటలీ క్రీడాకారుడుగా జనిక్ సినర్ గుర్తింపు పొందాడు. భారత ఆటగాడు రోహన్ గోపన్న ఆస్ట్రేలియాకు చెందిన మ్యాథ్యు ఎబ్ డన్ తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్నారు[4].
మూలాలు :
- ↑ AFP (2024-01-26). "Australian Open 2024 | Jannik Sinner ends Novak Djokovic Grand Slam history bid". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-04-18.
- ↑ "Australian Open 2024: విన్నర్ సినెర్..." Sakshi. 2024-01-29. Retrieved 2024-04-18.
- ↑ "Australian Open 2024: The singles champions are Jannik Sinner and Aryna Sabalenka". AP News (in ఇంగ్లీష్). 2024-01-12. Retrieved 2024-04-18.
- ↑ "Australian Open 2024 Men's Doubles Final: At 43, Rohan Bopanna becomes oldest Grand Slam champion". The Times of India (in ఇంగ్లీష్). 2024-01-27. Retrieved 2024-04-18.