ఆహ్వానము (పుస్తకం)
ఆహ్వానము | |
కృతికర్త: | |
---|---|
అనువాదకులు: | వానమామలై వరదాచార్యులు |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | పద్య గేయ సంపుటి |
విభాగం (కళా ప్రక్రియ): | సాహిత్యం |
ప్రచురణ: | దేశోద్ధారక గ్రంథమాల సికిందరాబాదు |
విడుదల: | 1957 |
పేజీలు: | 154 |
వివిధ అంశాలతో కూడిన గేయ పద్య సంపుటి ఈ ఆహ్వానము. దీనిని వానమామలై వరదాచార్యులు రచించాడు. దేశోద్ధారక గ్రంథమాల ఈ పుస్తకాన్ని తన 28వ ప్రచురణగా వెలువరించింది.దీనిలో 69 శీర్షికలు ఉన్నాయి.
మకుటాలు
[మార్చు]- అంకితము
- తొలిపలుకు
- విజయగీతి
- నిజమే?
- సర్వసముడు
- చంటిబిడ్డడు
- రైతురాజు (గేయనాటిక)
- మోసము
- ధనము
- కోకిలా!
- ఎవరో?
- విరహాబ్ధి
- పంచశీల
- బుద్ధగీతి
- అపూర్వ దీపావళి
- నవంబరు 1వ తేది
- పతాక వందనం
- వైష్ణవ గీతము
- మనవి
- లోకాభిరామాయణము
- క్షేత్రయ్య
- వరాల భీమన్న
- కపాలమోక్షము
- రాజప్రముఖుడు నైజాం
- గ్రామోద్ధరణము
- ఆహ్వానము
- ఓ రాజా!
- ఎన్నాళ్ళు?
- సూర్యచక్రము - చంద్రరేఖ
- కాళోజీ కవి
- సమ్మతము
- వల్లభబాయి స్మృతి
- సమగతి
- భాగవతము
- ప్రతాప ప్రశంస
వివరాలు
[మార్చు]ఈ గ్రంథంలో ప్రతాప ప్రశంస, వల్లభభాయి స్మృతి, కాళోజీ కవి అనేవి పద్య శీర్షికలు. రైతు రాజు అనేది గేయనాటిక. మిగిలినవన్నీ గేయాలు. దీనిలో పొలం దున్నడం మొదలుకొని ధాన్యరాశులను ఇంటికి తీసుకు పోవటం వరకు కర్షక జీవితం లోని వివిధ దశలు వర్ణించబడింది. 36 గేయాలలో గాంధీ గురించి కవి కీర్తించాడు. పంచశీల, బుద్ధగీతి, నవంబరు 1వ తేది, పతాక వందనం, రాజప్రముఖుడు నైజాం, గ్రామోద్ధరణము మొదలైన రాజకీయ వస్తురచనలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వైష్ణవ గీతము అనేది నరసీమెహతా అనే భాగవతుడు పాడిన హిందీ గేయానికి అనువాదం.
మచ్చుతునక
[మార్చు]ఈ గ్రంథంలోని ఒక గేయం.
సర్వసముడు
సర్వసముడోయి బాపూజీ, అత్యంత
నిర్వికారుండు గాంధీజీ ||సర్వ||
పాకిపని మొదలుకొని లోకపాలనవరకు
నాకార్యమే యనుచు నడుముగట్టిన మేటి ||సర్వ||
ఉమిసిన న్దనను గని భ్రమిసినను రవ్వంత
మార్పేమిలేని బ్రహ్మణ్యుండు బాపూజి ||సర్వ||
పంచమత్వము జార్జి పంచమత్వముగూడ
ఆకోమటి కర మ్మొకింతె విలువకు తూచె ||సర్వ||
రాటంపుచక్రమున్ రాజ్యంపు చక్రమును
ఏకరీతిగ ద్రప్ప నెంతేని మొనగాడు ||సర్వ||
పండ్లుగాని తుపాకిగుండ్లురానీ ప్రీతి
స్మేరాననమ్ముతో నారగించెడి భోక్త ||సర్వ||
కుడిచినను పస్తులను గడిపినను మొగమందు
చిరునవ్వు వెన్నెలల కరువులే దేవేళ ||సర్వ||
మూలాలు
[మార్చు]- [1] భారత డిజిటల్ లైబ్రరీ పుస్తక ప్రతి
- [2][permanent dead link] భారతి మాసపత్రిక అక్టోబరు 1958లో గ్రంథ విమర్శ.