ఇంకొల్లువారిపాలెం
ఇంకొల్లువారిపాలెం బాపట్ల జిల్లా, నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఇంకొల్లువారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°49′33″N 80°11′35″E / 15.825777°N 80.193037°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | నగరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522262 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ విశేషాలు
[మార్చు]రాష్ట్రపతి పురస్కార గ్రహీత శ్రీ ఇంకొల్లు రంగారావు:- నగరం మండలం ఇంకొల్లువారిపాలెం మండలానికి చెందిన ఇంకొల్లు రంగారావు, ఎం.ఎస్.సి., బి.ఇడి., చదివి ప్రస్తుతం చెరుకుపల్లి మండలం లోని పూషడపువారిపాలెం గ్రామంలో బాపూజీ ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్.జి.టి.గా పనిచేయుచూ విద్యార్థులకు భౌతిక, రసాయన శాస్త్రాలు, గణితం బోధించుచున్నారు. వీరు చదువుకునే సమయంలోనే, ప్రైవేటు పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులే మెరుగ్గా ఉన్నారని తలచి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికై, గ్రామీణ ప్రాంతాలలోనే పనిచేయాలని నిశ్చయించుకున్నారు. అదే విధంగా పనిచేయుచూ పేదవిద్యార్థులకు గూడా సాయం చేస్తున్నారు. ఆయన సహాయం చేసిన 40 మంది విద్యార్థులు, నేడు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడినారు. ప్రస్తుతం ఆయన ప్రతి సంవత్సరం, 100 మంది విద్యార్థులకు సాయం చేస్తున్నారు. ఇదిగాక ఇంకా వీరు, తన తల్లిదండ్రుల పేరిట, గ్రామస్థులకు అవసరమైన భవనాలు నిర్మించేటందుకు అవసరమైన 40 సెంట్ల భూమిని వివిధ ప్రాంతాలలో, ప్రభుత్వానికి విరాళంగా అందజేసినారు. 2006లోనే వీరు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. 2009 లో జిల్లా స్థాయిలోనూ, 2011 లో రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. తాజాగా వీరు 2014, సెప్టెంబరు-5 వ తేదీనాడు, ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఢిల్లీలో, రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి చేతులమీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.