ఇందిర (పాత్ర)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇందిర
కాలాతీత వ్యక్తులు పుస్తక ముఖచిత్రం
సృష్టికర్తపి. శ్రీదేవి
నవలకాలాతీత వ్యక్తులు
ప్రత్యేకతనవల పరిధిని దాటుకుని తెలుగు సాహిత్యంలో నిలిచిన పాత్రల్లో ఇది కూడా ఒకటి

ఇందిర కాలాతీత వ్యక్తులు నవలలో పి. శ్రీదేవి సృష్టించిన పాత్ర. నవల పరిధిని దాటుకుని తెలుగు సాహిత్యంలో నిలిచిన పాత్రల్లో ఇది కూడా ఒకటి.[1]

పాత్ర[మార్చు]

ఇందిర విశాఖపట్టణంలో తండ్రితో పాటూ జీవిస్తూంటుంది. ఇంటరుతో చదువు ఆపేసి, చిన్న ఉద్యోగం చేసుకుంటూ తండ్రిని, తనను పోషించుకుంటూంటుంది. ఆమె తండ్రి ఆనందరావు బాధ్యతలు పట్టనివాడు, జూదగాడు. పర్సులో రూపాయి లేకపోయినా ఏదోక విధంగా విలాసవంతంగా గడపగలదు. తండ్రి ఆమె షికార్లు, సరదాలకు అడ్డుచెప్పడు.అందుకు ప్రతిఫలంగా ఇందిర కూడా తండ్రికి అలవాటైన పేకాట, మందు వంటి వ్యసనాలను డబ్బిచ్చి ప్రోత్సహిస్తూంటుంది.
ఇందిర తనవాడిగా చేసుకోదగ్గ మగవాడి కోసం వేచిచూస్తుంటుంది. ఆమె ఉండే ఇంటి పై వాటాలోని ప్రకాశం అనే వైద్య విద్యార్థిని సొంతం చేసుకోవాలని ఆశపడుతుంది. అతనిలో భయాన్ని వదిలించి ధైర్యం కల్పించాలని ప్రయత్నిస్తుంది. అతన్ని తనవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో వారిద్దరూ శారీరికంగా కూడా దగ్గరవుతారు. తాను ఆశ్రయమిచ్చి, ఇంట్లో పెట్టుకున్న తన స్నేహితురాలు కళ్యాణి పట్ల ప్రకాశం ఆకర్షితుడు అవుతున్నాడని తెలియగానే ఆమెను వెళ్ళగొడుతుంది.
దృఢ వ్యక్తిత్వం లేని ప్రకాశాన్ని కళ్యాణితో మళ్ళీ మాట్లాడొద్దని నియమించగలుగుతుంది. ప్రకాశం గాలివాటం మనిషనీ, వాజమ్మనీ తేలిపోగానే అతన్ని వదిలేసి, ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తిని ఆకర్షించే ప్రయత్నాలు సాగిచింది.[2]

మూలాలు[మార్చు]

  1. మాలతి, నిడదవోలు (22 March 2016). "కథపరిధి దాటి స్వయంప్రతిపత్తి సాధించుకున్న సజీవపాత్రలు". తెలుగు తూలిక. Retrieved 29 May 2016.
  2. నెమలికన్ను, మురళి. "నాయికలు-ఇందిర". nemalikannu.blogspot.in. Archived from the original on 8 జనవరి 2018. Retrieved 29 May 2016.

ఇతర లింకులు[మార్చు]