ఇంద్రాయణి సూపర్‌ఫాస్ట్ ఎక్స్ప్రెస్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఆగస్టు 2018) |
ఇంద్రాయణి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వే ఆధ్వర్యంలో ముంబయి సి.ఎస్.టి నుంచి పూణె జంక్షను వరకు నడుపబడుతోన్న 22105/22106 నెంబరు గల సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్. దాదాపు 24 సంవత్సరాలుగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల మన్ననలందుకుంటోంది. భారతీయ రైల్వే నడిపిస్తోన్న ముఖ్యమైన సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఇది కూడా ముఖ్యమైనది.
పూణె సమీపంలోని ప్రఖ్యాత ఇంద్రాయణి నది పేరిట ఈ రైలును ప్రవేశపెట్టారు. ప్రారంభించినప్పటి నుంచి ప్రతిరోజు నిరంతరాయంగా ఇంద్రాయణి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు సేవలందిస్తోంది.
గతంలో ఈ రైలు 1021 నెంబరుతో ముంబయి- పుణే మధ్య,, 1022 నెంబరుతో పుణె-ముంబయి మధ్య నడిచేది. ఆ తర్వాత దీనిని సూపర్ ఫాస్ట్ రైలుగా దీని స్థాయిని పెంచడమేకాకుండా రైలు నెంబర్లను కూడా మార్చారు. కొత్తగా మార్చిన రైలు నెంబర్ల ప్రకారం 22105 నెంబరు గల రైలు (ముంబయి సి.ఎస్.టి నుంచి పుణె జంక్షను), 22106 నెంబరు గల రైలు (పుణె జంక్షను నుంచి ముంబయి సి.ఎస్.టి. వరకు) నడుస్తాయి.
రైలు బోగీలు
[మార్చు]ఇంద్రాయణి ఎక్స్ ప్రెస్ లో ప్రస్తుతం 2 ఎసీ చైర్ కార్లతో పాటు 8 సాధారణ రెండో శ్రేణి బోగీలు ఉన్నాయి. అదేవిధంగా రైలు పాసులు తీసుకున్న వారి కోసం ప్రత్యేకంగా రిజర్వు చేయబడిన మరో రెండు సాధారణ రెండో శ్రేణి రిజర్వుడు బోగీలున్నాయి. ఇవి కాకుండా మరో 5 అన్ రిజర్వుడు జనరల్ బోగీలు కూడా ఉన్నాయి. భారతీయ రైల్వే ప్రయాణికుల రద్దీని బట్టి బోగీల సంఖ్య పెంచడం, తగ్గించడం చేయవచ్చు.
మధ్య రైల్వే ద్వారా నడుపబడుతోన్న పుణె సోలాపూర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు చెందిన ఓ బోగీని కూడా దీనికి అనుసంధానం చేస్తారు. తద్వారా సోలాపూర్ వాసులకు కూడా ఇంద్రాయణి సేవలందిస్తోంది.
సేవలు
[మార్చు]ఇంద్రాయణి ఎక్స్ ప్రెస్ ను తొలిసారిగా 1988 ఏప్రిల్ 27 నాడు ప్రారంభించారు. అప్పటికే ముంబయి సి.ఎస్.టి, పుణె జంక్షన్ల మధ్య ఐదు ఇంటర్ సిటీ ఛైర్ కార్లు నడుస్తుండగా ఇంద్రాయణి ఎక్స్ ప్రెస్ ఆరో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ గా ప్రవేశపెట్టబడింది. మిగతా ఐదు కార్ల వివరాలు పరిశీలిస్తే- 12127/28 ముంబయి-పుణె ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, 11007/08 దక్కన్ ఎక్స్ ప్రెస్, 11009/10 సింహగఢ్ ఎక్స్ ప్రెస్, 12125/26 ప్రగతి ఎక్స్ ప్రెస్, 12123/24 దక్కన్ క్వీన్ పేర్లతో నడుస్తున్నాయి.[1]
- ఇంద్రాయణి ఎక్స్ ప్రెస్ రైలు మొత్తం 192 కిలోమీటర్ల దూరాన్ని సగటున 3 గంటల 28 నిమిషాల్లో చేరుకోగలుగుతుంది.
- 22105 ఇంద్రాయణి ఎక్స్ ప్రెస్ (55.38 కి.మీ/గం.), 3 గంటల 20 నిమిషాలు.[2]
- 22106 ఇంద్రాయణి ఎక్స్ ప్రెస్ (57.60 కి.మీ/గం.)
రవాణా విధానం
[మార్చు]ఇంద్రాయణి ఎక్స్ ప్రెస్ రైలు నడిచే మార్గమంతా పూర్తిగా విద్యుదీకరణ చేయబడింది. అదనంగా ఈ రైలుకు డీజిల్ ఇంజిన్ కూడా ఉంటుంది. గుత్తి ఆధారంగా రూపొందించిన డబ్లు.డి.ఎం-3డి సామర్ధ్యం గల ఈ ఇంజిన్ ఏకథాటిగా రైలును ముంబయి సి.ఎస్.టి.వరకు తీసుకుపోగలుగుతుంది. అత్యంత సామర్థ్యం గల ఈ ఇంజిన్ ఇంద్రాయణి ఎక్స్ ప్రెస్ కు అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు.
కాల సూచిక
[మార్చు]ముంబయి సి.ఎస్.టి నుంచి బయలు దేరే ఆరు ట్రైన్లలో ఇంద్రాయణి ఎక్స్ ప్రెస్ అన్నింటికంటే ముందుగా బయలుదేరుతుంది, తిరుగు ప్రయాణంలో మాత్రం అన్ని రైళ్ల కంటే చివరగా పుణె జంక్షను నుంచి బయలుదేరుతుంది. ఈ తరహా విధానం వల్ల ప్రయాణికులు ముంబయి సి.ఎస్.టి నుంచి పుణెకు వెళ్లి పనులు పూర్తి చేసుకుని ఇదే రైలులో మళ్లీ తిరుగుప్రయాణం కావడానికి సౌకర్యంగా ఉంటుంది.
22105 నెంబరు గల ఇంద్రాయణి ఎక్స్ ప్రెస్ భారతీయ కాలమానం ప్రకారం ప్రతీరోజు ఉదయం 05:40 గంటలకు ముంబయి సి.ఎస్.టి. నుంచి బయలుదేరి ఉదయం 09:08 గంటలకు పూణె జంక్షన్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 22106 నెంబరు గల ఇంద్రాయణి ఎక్స్ ప్రెస్ భారతీయ కాలమానం ప్రకారం ప్రతీరోజు సాయంత్రం 18.35 గంటలకు పుణె జంక్షను నుంచి బయలుదేరి, ముంబయి సి.ఎస్.టి.కి రాత్రి 21:55 గంటలకు చేరుకుంటుంది.
అదనపు లింకుల
[మార్చు]- రైలు నెం. 22105 మార్గం
- రైలు నెం.22106 మార్గం
- భారతదేశంలో నడుస్తున్న ఇంటర్ సిటీ రైళ్ల
రైలు ప్రమాద ఘటన
[మార్చు]తుకర్ వాడీ సమీపంలో 1994 డిసెంబరు 1నాడు రాత్రి సమయంలో ఇంద్రాయణి ఎక్స్ ప్రెస్ డీజిల్ ఇంజిన్ క్యాబిన్ లో చెలరేగిన మంటల వల్ల ప్రమాదం జరిగింది. బోర్ ఘాట్ సెక్షన్ లోని కార్జత్, లోణావల మధ్య ఈ ఘటన జరిగింది. ఆనాటి ఈ ప్రమాదానికి సరైన కారణం ఇప్పటి వరకు గుర్తించలేదు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "12126 -Indrayani Express". Indiarailinfo.
- ↑ "Indrayani Express". cleartrip.com. Archived from the original on 2014-08-21. Retrieved 2014-11-27.
- ↑ "IRFCA Mailing List Archive". IRFCA.
బయటి లింకులు
[మార్చు]- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
- http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- http://www.indianrail.gov.in/index.html
- http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537