ఇకిరు (సినిమా)
Appearance
ఇకిరు 1952, అక్టోబర్ 9న అకిరా కురొసావా దర్శకత్వంలో విడుదలైన జపాన్ చలనచిత్రం.[1] ఈ చిత్రం 1954లో 4వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి, గోల్డెన్ బేర్ కోసం పోటీ పడింది.[2]
కథా నేపథ్యం
[మార్చు]వతానబే ఒక ప్రభుత్వాధికారి. అతనికి క్యాన్సరనీ, ఎక్కువకాలం బ్రతకడనీ తెలుస్తుంది. ముప్ఫై ఏళ్ళపాటు ప్రభుత్వ యంత్రాంగంలో గానుగెద్దులా పనిజేయడం తప్ప ఏమీ చేయడు. ఆ ఆరునెలలూ అతనేమి చేసాడు, చివరికి జరిగింది అనేది మిగతా కథ.
నటవర్గం
[మార్చు]- తకాషి షిమూరా
- షినిచి హిమోరి
- హరుయో తనాక
- మైనరు చికికి
- మికీ ఒడగిరి
- బోకెజెన్ హిదారి
- మినోస్కే యమదా
- కమాటరి ఫుజివార
- మకోటో కో
- నోబువో కనేకో
- నోబువో నకమురా
- అట్సుషి వతనాబే
- ఇసో కిమురా
- మాసో షిమిజు
- యూనుసుకే ఇటో
- క్యోకో సెకి
- కుమేకో ఉరాబ్
- నోరికో హోమా
- సెజీ మియాగుచి
- దైసుకే కాటో
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: అకిరా కురొసావా
- నిర్మాత: సోగిరో మోటోకి
- స్క్రీన్ ప్లే: అకిరా కురోసావా, షినోబు హషిమోతో, హిడియో ఓగుని
- సంగీతం: ఫ్యూమియో హయసక
- ఛాయాగ్రహణం: అసకాజు నకై
- కూర్పు: కోయిచి ఇవాషిటా
- పంపిణీదారు: తోహో
మూలాలు
[మార్చు]- ↑ విశాలాంధ్ర (26 January 2013). "ప్రపంచ సినిమాపై ఆసియా బావుటా". Archived from the original on 17 January 2019. Retrieved 17 January 2019.
- ↑ "PROGRAMME 1954". Berlin International Film Festival. Archived from the original on 19 నవంబరు 2016. Retrieved 17 January 2019.