Jump to content

ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్

వికీపీడియా నుండి

వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌ (ఆంగ్లం నుండి అనువాదం: తూర్పు యొక్క ఇటాలియను) గా వ్యవహరించారు.

ఇటాలియన్ భాషా పలుకుబడి

[మార్చు]

తెలుగులో 56, ఇంగ్లీషులో 26 అక్షరములుండగా ఇటాలియన్లో 21 అక్షరములు మాత్రమే ఉన్నాయి. తెలుగులో చాలా పదాల మూలం సంస్కృతమ లాగే, ఇటాలియానికి మూలము లాటిన్. సంకృతమునకు లాటిన్ భాషలకు సాన్నిహిత్యము కూడా ఉంది.

ఇటాలియన్ భాషలో ట, ఠ, డ, ఢ, థ, ధ-లు లేవు. వీనితో పనిలేదు కూడా. త, ద-లు మాత్రమే ఉన్నాయి. ట, డ-లు లేనందున తెలుగులోని ఇటాలియన్ అనే పదమును ఇతలియానో అని, ఇటలీని ఇతాలియా అని ఇండియాను ఇందియా అను ముఖ్యంగా తెలుగును టెలుగు అను గాక తెలుగు అనే అంటారు.

ఇటాలియన్ భాషకు లాటిన్ లిపి వాడుతారు. కాని, J, K, W, X, Y అక్షరాలు ఇటాలియన్లో లేవు. ఆంగ్లములోని C, G-లు స, జ-లుగా ఉచ్చరించబడుతాయి. C (స), G (జ) కు h కలిపి దానితర్వాత ఎ, ఐ (E, I) లు వాడినప్పుడు స, జ-లు క, గా లుగా మారుతాయి.

ఉదాహరణ:

  • Chiesa /ˈkjɛ.za/ (క్యెజా)= చర్చి.
  • Perche /perˈke/ (పేర్కే) = ఎందుకు.

(C, G) స, జ-లు తరువాత అ (a), ఓ లేదా ఒ (o), ఉ (u)-లు వచ్చినప్పుడు కూడా అవి క, గ-లుగా మారుతాయి.

ఉదాహరణ:

  • Camera /ˈka.me.ra/ (కామేర్రా) = గది.
  • Banca /ˈban.ka/ (బాంకా) = బ్యాంకు.
  • Gatto /ˈɡat.to/ (గాత్తో) = పిల్లి.

జ (G) కు నకారము (n) కలిస్తే ఞ అవుతుంది. Bagno /ˈbaɲ.ɲo/ (బాఞ్ఞో) = స్నానము. స (C) కు ఎ లేదా ఏ (E), ఈ (I) లు కలిసినప్పుడు చగా మారుతుంది. Cinema /ˈt͡ʃi.ne.ma/ (చీనేమా) = సినెమా, Cento /ˈt͡ʃɛn.to/ (చెంతో) = నూరు.

ఇటాలియన్లో E (ఈ) ఎ లేదా ఏ లాగా అంటారు, O (ఓ) ఒ లేదా ఓ లాగా అంటారు, I (ఐ) �ఇ లేదా ఈ లాగా అంటారు, A (ఏ) ఆ లాగా అంటారు, U (యూ) ఉ లాగా అంటారు. ఐ, ఔ-లు కూడా ఇటాలియన్ లో ఉన్నాయి.

ఇకార, ఉకారములకు ఇటాలియన్ భాషలో దీర్ఘములు లేవు. కాని Accento అనగా ఒత్తి పలకడం ఉంది. కొంత భాషా పరిచయం ఉంటే ఇది తెలుసుకోవచ్చును.

తెలుగు-ఇటాలియన్ భాషల పోలికలు

[మార్చు]

1. తెలుగు, ఇటాలియన్ రెండు భాషల్లో కూడా చాలా వరకు ప్రతి పదం, అచ్చులుతో అంతమవుతాయి. ఇదే అతి ముఖ్యమైన కారణము.

  • కార్తా=కాగితము; సాలా=శాల (గది) ; దోదిచి -ద్వాదసి (12) ; సువొయి=స్వయము, స్వంతము; త్రె= త్రయము-మూడు; నొవె= నవ-తొమ్మిది; కాసా=గృహము; బాన్యొ=స్నానము; బువన=మంచి

తబాక్కో=తంబాకు; తంబురో=తంబూరా; పియదె=పాదము; దుయె= ద్వయము-రెండు; శెత్తె= సప్త-ఏడు; త్రదుర్రె= తర్జుమా; చిత్తా=నగరం; ఆక్వా=నీరు; బార్కా=పడవ.

2. వ్రాసిన ప్రతి అక్షరము, గుణింతాలతో సహా తు, చ-తప్పకుండా ఈ రెండు భాషల్లో పలుకబడతాయి.

  • ఇటాలియన్ - Posso (పోస్ సో), Terrezz (తెర్రే త్స్ త్సా), Pizza (పిత్స్ త్సా), Bibliotica (బిబ్లియోతికా), Grazie ( gaatsiye) మొ..
  • తెలుగు- అక్షరము, సంక్షేమము, సంస్కృతి, స్మృతి, చిహ్నము, జ్ఞానము మొ..

అనేకభాషలలో వ్రాసిన అక్షరమొకటి, చదివేది మరికటిగా ఉండుట ఉంది.

  • ఇంగ్లీషు- Put-పుట్; But-బట్; Wait, Weight, Light, lite, Bit, Bite, etc.
  • ఫ్రెంచు- డూప్లెక్స్ అని వ్రాసి డూప్లే అని, పారిస్ అని వ్రాసి పారి అని చదువవలసి ఉంటుంది.
  • రష్యన్ - తవారిష్ (Comrade) లో త పదాన్ని తొలుత వచ్చినప్పుడు త గానే పలకాలి. పదములో మొదటి అక్షరము తరువాత కాని త వచ్చినట్లయితే చగా మారుతుంది.
  • జర్మన్ - Kind (కిండ్-శిశువు) లో d, tగా మారి కిండ్ గా కాక కింట్ అను పలుకవలెను. Land (లాంట్), Kindergarten (కిండర్గార్టెన్) అని చదువుదురు.

ఇటాలియన్, తెలుగు అజంతల భాషలు కనుక ఉన్నదున్నట్లు పలుకబడును. కనుకా తమిళంలోని అయ్యాచామిని అయ్యాస్వామి అని, వింగడేజన్ ను వెంకటేశన్ అని, Girls ను గరల్సు అని పలుకుతాము.

3. మరొక భాషనుండి పదజాలాన్ని తెలుగులోనికి అరువు తెచ్చుకొని వాడాలంటే డు, ము, వు, లు చేర్చవలసిగాని అజంతాలుగా మార్చుకోవలసిగాని ఉంటుంది. ఇటాలియన్ భాష నుండి తెలుగులోనికి, తెలుగునుండి ఇటాలియన్ లోనికి పదములను అరువు తెచ్చుకోవలసి వచ్చినప్పుడు అట్టి అవసరము లేదు.

  • ఇటాలియన్- క్రీస్తు ( తెలుగు- క్రీస్తు), దావీదు- (తెలుగు-దావీదు),, - (తెలుగు-, ), సొరెల్లా (తెలుగు-సోదరి లేదా సొరెల్లా లేదా సిస్టరు).

4. ఇటాలియన్, తెలుగు భాషలు చాలా మృదు మధురమైన వని, వీనులకు వినసొంపుగా ఉంటాయని అంటారు.కారణం ఇవి అజంతములు కనుక.

5. తెలుగు నామవాచకాల్లో స్త్రీ లింగము "అమ్మ" అని, పుంలింగము "అయ్య" అని అంతమైనట్లే, ఇటాలియన్ లో కూడా స్త్రీ లింగము "అ" తోను, పుంలింగము "ఓ" తోను అంతమవుతాయి.

6. తెలుగులో వలె కొంటాను, అమ్ముతాను అంటే నేను కొంటాను, నేను అమ్ముతాను అని అర్ధము. ఇందులో నేను అనే పదము లేకుండానే అర్ధము వస్తుంది. ఆంగ్లములో Buy, Sell అంటే ఎవరు అమ్మేది, ఎవరు కొనేది అర్ధముకాదు. I buy, You sell అని నేను, నువ్వు అనే పురుషవాచకం (Person) వాడవలసి ఉంటుంది. ఇటాలియన్ లో తెలుగు లాగానే అర్ధము వచ్చును. Campeo Una gatto= ఒక పిల్లిని కొంటాను. ఇంగ్లీషులో వలె I speak, you speak, he, she, it-speak, we speak, you speak, they speak అన్నట్లుకాక, తెలుగులో వలె, ఇటాలియన్ లో ప్రతివచనమునకు క్రియ మార్పు చెందుతుంది.

7. తెలుగులో ఏకవచనమును బహువచనముగా మార్చుటకు "లు" చేర్చినట్లు, ఇటాలియన్ లో "ఇ" (I) చేర్చవలెను. Giovanni (జియొవాన్ని) =జూనులు, Marconi (మార్కొని) -మార్కొనులు తెలుగులో సోములు, రాములులాగ. Vacca (వాక్కా) = ఆవు, Vacci (వాక్కి) = ఆవులు, Bambino (బంబినొ) =శిశువు, Bambini (బంబిని) =శిశువులు.

8.. తెలుగులో "నీవు", "మీరు", "తమరు" వలే ఇటాలియన్ లో tu (తు) =నీవు, Voi (వొయి) =మీరు, Lei (లెయి) =తమరు అని అంటారు.

9. తెలుగు, ఇంగ్లీషులో వలెకాక "ఎందుకు" (Why), ఎందుకనగా (because) అనే రెండు పదములకు ఇటాలియన్ లో Perche (పర్కె) అనే ఒకే పదాన్ని ప్రశ్నకు, జవాబుకు కూడా వాడుతారు. ఇది ఇటాలియన్ లో ప్రత్యేకత.

[1]

మూలాలు

[మార్చు]
  1. * 1971 భారతి మాస పత్రిక- వ్యాసము:తెలుగు-ఇటాలియన్. వ్యాస కర్త: శ్రీ. ఎల్.మాలకొండయ్య.