Jump to content

ఇట్లు మీ విధేయుడు

వికీపీడియా నుండి
ఇట్లు మీ విధేయుడు పుస్తక ముఖచిత్రం

ఇట్లు మీ విధేయుడు ప్రముఖ హాస్య రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత భమిడిపాటి రామగోపాలం వ్రాసిన కథా సంకలనం. ఈ సంకలనం రచనకు గాను భమిడిపాటి రామగోపాలంకు సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. ఇట్లు మీ విధేయుడు పుస్తకంలో ప్రధానంగా హాస్యభరితమైన కథలు, మధ్యతరగతి జీవితాలను ఆధారం చేసుకున్న కథలు ఉన్నాయి.

రచనా నేపథ్యం

[మార్చు]

ఇతివృత్తాలు

[మార్చు]

వెన్నెల నీడ కథలో కథానాయిక శ్యామలకు వివాహమై ఏడో సంవత్సరంలో కథ ప్రారంభమవుతుంది. భర్త కలెక్టర్ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేస్తూంటారు, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉంటారు. ఐతే రైలుప్రయాణంలో తన వివాహానికి పూర్వం పెళ్ళిచూపులకు వచ్చి తాను, తనవారూ తిరస్కరించిన వ్యక్తి కనిపిస్తారు. ఏడేళ్ళలో ఆయన వివాహం చేసుకోకుండానే ఉండిపోతారు. పోటీపరీక్షల్లో విజయం సాధించి, సివిల్ సర్వీసు సాధించి, ఒంగోల్లో సబ్-కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ విషయం తెలిసిన శ్యామల మనస్సంచలనం, దాని ఫలితం వంటివి మిగతా కథ. వంటొచ్చిన మగాడు కథలోని ఇతివృత్తం వంట వచ్చిన కథానాయకుడు రామనాథం ఆ కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులు, చిన్నచూపూ సరదాగా చెప్పే ఇతివృత్తం. త్రివర్ణ చిత్రం కథలో ఒకమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకోబోయి చివరకు కులం అడ్డురాగా చేసుకోలేకపోయిన వ్యక్తే ఆమెను పెళ్ళాడిన భర్త స్నేహితుడైతే వారి ముగ్గురికీ మధ్య ఉండే అనుమానాలతో సున్నితంగా మలిచారు ఇతివృత్తాన్ని.[1]

కథల జాబితా

[మార్చు]

ప్రాచుర్యం

[మార్చు]

సంకలనంలో 1990ల నాటి ప్రచురణలో 52కథలు ఉండగా, 2001 నాటి సంకలనంలో 39 మాత్రమే ఉన్నాయి. కథాసంకలనానికి గాను రచయిత సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు.

మూలాలు

[మార్చు]
  1. భమిడిపాటి, రామగోపాలం (1990). ఇట్లు మీ విధేయుడు. విశాఖపట్టణం: విశాఖ సాహితి. Retrieved 10 March 2015.