ఇది నా లవ్‌స్టోరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది నా లవ్‌స్టోరీ 2018 ఫిబ్రవరి 14 న విడుదలైన తెలుగు చిత్రం.

అభిన‌య‌ (ఓవియా) ఒంటరిగా ఉన్న స‌మ‌యంలో ఆమె ఇంట్లోకి ప్ర‌వేశించాడ‌నే అభియోగంతో అభిరాం (త‌రుణ్‌) ని అరెస్ట్ చేస్తారు పోలీసులు. పోలీసుల‌కు త‌న క‌థ‌ను చెప్ప‌డం మొదలు పెట్టడంతో అస‌లు సినిమా మొద‌లువుతుంది. యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ హెడ్ అయిన అభిరాం.. త‌న చెల్లెలు కాబోయే భర్త అమ‌ర్, ఆమె చెల్లెలు డా.శృతిని చూడటానికి అర‌కు వెళ‌తాడు. అక్క‌డ డా.శృతి (ఓవియా) ని క‌లుస్తాడు. ఒంటిరిగా ఉన్న ఇద్ద‌రూ త‌మ ప్రేమ‌క‌థ‌ల‌ను ఒక‌రికొక‌రు చెప్పుకుంటారు. మ‌హి (ఓవియా) తో త‌న ప్రేమ ఎలా మొద‌లైంది? ఎందుకు విడిపోయామ‌ని అభిరాం చెబితే... జోసెఫ్‌ ( త‌రుణ్‌) తో త‌నెందుకు విడిపోయాన‌నే, త‌న ప్రేమ‌క‌థ‌ను శృతి.. అభిరాంకు చెబుతుంది. అయితే అనుకోకుండా డా.శృతి స్థానంలో వేరే అమ్మాయి అభిన‌య ఉంద‌నే నిజం అభిరాం తెలుసుకుంటాడు. అస‌లు అభిన‌య ఓ రోగి అని.. డా.శృతిని క‌లుసుకోవ‌డానికి ఆమె ఇంటికి వ‌చ్చి ఆమె స్థానంలో అభిరాంకు ప‌రిచ‌య‌మైంద‌నే నిజం తెలుస్తుంది. ఆ విష‌యం తెలుసుక‌న్న అభిరాం ఏం చేస్తాడు? అస‌లు అభిరాంపై అభిన‌య పోలీసుల‌కు ఎందుకు ఫిర్యాదు చేస్తుంది. ఇంత‌కు అభిన‌యలోని మాన‌సిక రోగం ఏమిటి? అనే విష‌యాల‌ను మిగిలిన కథలో భాగం.

నువ్వే కావాలి లో తరుణ్

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
 • ఏ నిమిషం లో, కార్తీక్ ,
 • ఈ వెయిటింగ్ , శక్తి శ్రీ గోపాలన్
 • ఊహ ల లా , రంజిత్, గోవింద్
 • ఆ దేవుడు , విజయ్ ప్రకాష్, పద్మలత
 • ఏదో ఏదో , నరేశ్ అయ్యర్,ప్రియ హిమేష్
 • నా హృదయంలో , అభయ్ జోధు పుర్కర్

సాంకేతికవర్గం

[మార్చు]
 • నిర్మాణ సంస్థ‌: రామ్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌[1]
 • సంగీతం: శ‌్రీనాథ్ విజ‌య్‌,
 • ఎడిటర్‌: శంకర్‌
 • సినిమాటోగ్రఫీ: క్రిస్టోపర్‌ జోసెఫ్‌
 • నిర్మాత: ఎస్‌.వి.ప్రకాష్‌
 • దర్శకత్వం: రమేష్‌ - గోపి

మూలాలు

[మార్చు]
 1. "Idi Naa Love Story will be a hit - Hopes Tarun". Chitramala (in Indian English). 2017-07-03. Retrieved 2017-02-14.

బయటి లంకెలు

[మార్చు]