ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (సెప్టెంబరు 2016) |
ఇన్స్టిట్యుట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ('ICAI) భారతదేశం యొక్క జాతీయ వృత్తిపరమైన అకౌంటింగ్ సంస్థ. ఇది భారతదేశంలో చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తిని నియంత్రించేందుకు భారతదేశం యొక్క Constituent Assembly (acting as the provisional Parliament of India) ద్వారా ఏర్పాటైన చార్టర్డ్ అకౌంటెంట్స్ చట్టం, 1949 కింద ఒక బాడీ కార్పోరేట్గా 1953 జూలై 1 న స్థాపించబడింది. ICAI ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద professional accounting body, మొదటిది అమెరికెన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ (AICPA). భారతదేశంలో ఆర్థిక తనిఖీ, గణాంక వృత్తిని నియంత్రించే, అనుమతించే అధికరము ICAI కి మాత్రమే ఉంది. భారతదేశంలో కంపెనీలు అనుసరించాల్సిన అకౌంటింగ్ ప్రమాణాలను ఇది National Advisory Committee on Accounting Standards (NACAS) కు సిఫార్సు చేస్తుంది, ఇతర సంస్థలు అనుసరించాల్సిన అకౌంటింగ్ ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఆర్థిక నివేదికల ఆడిట్ లో అనుసరించాల్సిన ఆడిటింగ్, హామీ ప్రమాణాలను నిర్దేశించటములో ICAI ఏకపక్షముగా బాధ్యత వహిస్తది. ఇది అంతర్గత ఆడిట్ (Standards on Internal Audit (SIA) ), కార్పొరేట్ వ్యవహారాలు (Corporate Affairs Standards (CAS) ) ఇంకా ఎన్నోవాటికి ప్రమాణాలు నిర్దేశిస్తుంది. ఇది ప్రమాణాలను నిర్దేశించటములో భారతదేశ ప్రభుత్వం, భారతదేశం యొక్క రిజర్వు బ్యాంకు (RBI), భారతదేశం యొక్క సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ (SEBI) తో కలిసి పనిచెస్తది.
ఇన్స్టిట్యూట్ సభ్యులను చార్టర్డ్ అకౌంటెంట్స్ అని పిలుస్తారు. అయితే ఇక్కడ చార్టర్డ్ అనే పదము ఏవిధముగానూ రాయల్ చార్టర్కి సంబంధించినది కాదు. చార్టర్డ్ అకౌంటెంట్స్ ICAI చే ప్రచురితమైన Code of Ethics, వృత్తిపరమైన ప్రమాణాలకు (professional standards) లోబడి ఉండాలి, లేనిచో క్రమశిక్షణా చర్యకు లోనవ్వుతారు. ICAI యొక్క సభ్యుడుని మాత్రమే, 1956 కంపెనీల చట్టం (Companies Act, 1956) కింద భారత కంపెనీకి ఆడిటర్ గా నియమించొచ్చు. సంస్థ యొక్క నిర్వహణా బాధ్యత చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా వ్యవహరిస్తున్న కౌన్సిల్ అధ్యక్షుడికి సంక్రమిస్తుంది. ఒక వ్యక్తి సూచించిన పరీక్షల్లో ఉత్తీర్ణులై తరువాత ఆడిటర్ దగ్గర మూడు సంవత్సరాల శిక్షణ పూర్థిచేయటం ద్వారా ICAI యొక్క ఒక సభ్యులు కావచ్చు. సభ్యత్వం కోసం చేశే కోర్సు దాని కఠినమైన ప్రమాణాలకు సుప్రసిద్ధి. ICAI, సభ్యుల పరస్పర సభ్యత్వం గుర్తింపు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఇతర ప్రొఫెషనల్ అకౌంటింగ్ సంస్థలతో పరస్పర గుర్తింపు ఒప్పందాలలో ప్రవేశించింది.
ICAI ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్ (IFAC), సౌత్ ఆసియా ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్ (SAFA), ఆసియా , పసిఫిక్ అకౌంటెంట్స్ సమాఖ్య (CAPA) యొక్క స్థాపక సభ్యుల్లో ఒకటి.
ఇన్స్టిట్యుట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియని చార్టర్డ్ అకౌంటెంట్స్ చట్టం, 1949 కింద భారతదేశంలో గణాంక వృత్తిని నియంత్రిచే లక్ష్యంతో భారతదేశం యొక్క పార్లమెంట్ ఆమోదించింది.[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]- The Chartered Accountants Act, 1949
- Institute of Cost Accountants of India
- Institute of Company Secretaries of India
- Indian Institutes of Management
- National Institute of Design
- Indian Institutes of Technology
- National Institutes of Technology
మూలాలు
[మార్చు]- ↑ Act No. XXXVIII of 1949. See "Chartered Accountants Act 1949 as amended in 2006" Archived 2013-07-01 at the Wayback Machine
2 GMCS courses of 15 days each have been made mandatorily. Archived 2013-09-21 at the Wayback Machine