ఇన్‌స్టాగ్రామ్

వికీపీడియా నుండి
(ఇన్‌స్టాగ్రామ్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఇన్‌స్టాగ్రామ్

సాఫ్టువేర్ అభివృద్ధికారుడుకెవిన్ సైస్ట్రోమ్, మైక్ క్రియేగెర్
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుఫేస్బుక్, ఇంక్.
ప్రారంభ విడుదల2010
ఆపరేటింగ్ సిస్టంఐఓస్,ఆండ్రాయిడ్, ఫైర్ ఓస్,మైక్రోసాఫ్ట్ విండోస్
ఫైల్ పరిమాణం139.1 మెగాబైట్ (ఐఓస్)[1]
32.88 mb (ఆండ్రాయిడ్)[2]
అందుబాటులో ఉంది32[3] భాషలు
List of languages
చైనీస్, క్రొయేషియన్, చెక్, డానిష్, డచ్, ఇంగ్లీష్, ఫిన్నిష్, ఫ్రెంచ్, జర్మన్, గ్రీక్, హిందీ, హంగేరియన్, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, మలే, నార్వే, పోలిష్, పోర్చుగీస్, రొమేనియన్,, స్లోవాక్, స్పానిష్, స్వీడిష్, తగలోగ్, థాయ్, టర్కిష్, ఉక్రేనియన్, వియత్నామీస్.
లైసెన్సుయాజమాన్య సాఫ్ట్‌వేర్ https://help.instagram.com/581066165581870 Terms of Use
అలెక్సా ర్యాంకు28 నౌరాప్ (17, జూలై 2020 నాటికి)[4]
జాలస్థలిhttps://www.instagram.com

ఇన్‌స్టాగ్రామ్ అమెరికాకు చెందిన ఫోటోలు, వీడియోలను ఇతరులతో పంచుకునే సామాజిక మాధ్యమ వేదిక. దీనిని కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రిగెర్ సృష్టించారు. దీన్ని ఐజి అనీ ఇన్‌స్టా అనీ కూడా పిలుస్తారు. [5] ఇది ఫేస్బుక్ యాజమాన్యంలో ఉంది. దీనిని 2010 అక్టోబరులో ప్రారంభించారు. మొదట్లో iOS లో మాత్రమే ఉండేది. ఆండ్రాయిడ్ వర్షన్ 2012 ఏప్రిల్ లో విడుదలైంది. వినియోగదారులు ఈ యాప్ లో ఫోటోలు, వీడియోలను అప్లోడ్ చేయవచ్చు. వినియోగదారులు మీడియా ఫైల్స్ కి ఫిల్టర్ లు,హాష్ టాగ్ లు, భౌగోళిక ట్యాగింగులను జోడించవచ్చు. పోస్టులను అందరితో లేదా కొందరితో పంచుకోవచ్చు. వినియోగదారులు ట్యాగ్‌లు, స్థానాల ద్వారా ఇతర వినియోగదారుల ప్రొఫైల్ చూడవచ్చు. ట్రెండింగ్ కంటెంట్‌ను కూడా చూడవచ్చు. వినియోగదారులు ఫోటోలను ఇష్టపడవచ్చు, ఫీడ్‌లో వారి కంటెంట్‌ను జోడించడానికి ఇతర వినియోగదారులను అనుసరించవచ్చు.

ఈ యాప్ లో సంక్షిప్త సందేశం, ఒకే పోస్ట్‌లో బహుళ చిత్రాలు లేదా వీడియోలను పెట్టగల్గడం, స్టోరీస్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్రధాన ప్రత్యర్థి స్నాప్‌చాట్ మాదిరిగానే స్టోరీస్ విభాగములో బహుళ చిత్రాలను, వీడియోలను ధారావాహికగా పోస్ట్ చేయవచ్చును. ఇవి 24 గంటల పాటు ఇతరులకు అందుబాటులో ఉంటాయి. 2019 జనవరి నాటికి, ఈ స్టోరీస్ విభాగం రోజువారీ 500 మిలియన్ల వినియోగదారులు ఉపయోగిస్తున్నారు.

2010 లో ప్రారంభించిన తరువాత, ఇన్‌స్టాగ్రామ్ వేగంగా ప్రజాదరణ పొందింది, రెండు నెలల్లో ఒక మిలియను, సంవత్సరంలో 10 మిలియన్లు, 2019 మే నాటికి 1 బిలియన్ వినియోగదారులను పొందింది. 2015 అక్టోబరు నాటికి 40 బిలియన్ పైగా ఫోటోలు అప్‌లోడ్ చేసారు.

జూలై 2020 నాటికి, అత్యధికంగా అనుచరులున్న వ్యక్తి ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో. అతడికి 233 మిలియన్ల మందికి పైగా అనుచరులు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ 2010 లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న 4 వ మొబైల్ అనువర్తనం అయింది.

చరిత్ర

[మార్చు]

ఇన్‌స్టాగ్రామ్ శాన్ఫ్రాన్సిస్కోలో కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రిగెర్ సృష్టించిన మొబైల్ చెక్-ఇన్ అనువర్తనం బర్బన్ గా అభివృద్ధిని ప్రారంభించింది. [6]బర్బన్ ఫోర్ స్క్వేర్ సమానమని గ్రహించి, సిస్ట్రోమ్, క్రిగెర్ ఫోటో-షేరింగ్‌పై తమ అనువర్తనాన్ని కేంద్రీకరించారు, ఇది బర్బన్ వినియోగదారులలో ప్రసిద్ధ లక్షణంగా మారింది. [7] ఇన్‌స్టాగ్రామ్ అని కొత్త పేరు పెట్టారు.

మూలాలు

[మార్చు]
  1. "Instagram". App Store. Retrieved December 16, 2019.
  2. "Instagram APKs". APKMirror. Retrieved October 29, 2019.
  3. "Instagram". App Store. Retrieved October 7, 2019.
  4. "Alexa - Instagram Competitive Analysis, Marketing Mix and Traffic". alexa.com. Archived from the original on 2022-02-10. Retrieved July 17, 2020.
  5. For example: Edwards, Erica B.; Esposito, Jennifer (2019). "Reading social media intersectionally". Intersectional Analysis as a Method to Analyze Popular Culture: Clarity in the Matrix. Futures of Data Analysis in Qualitative Research. Abingdon: Routledge. ISBN 9780429557002. Retrieved May 7, 2020. Instagram (IG) is a photo sharing app created in October of 2010 allowing users to share photos and videos.
  6. Lagorio, Christine (June 27, 2011). "Kevin Systrom and Mike Krieger, Founders of Instagram". Inc. Retrieved October 4, 2011.
  7. Sengupta, Somini; Perlroth, Nicole; Wortham, Jenna (April 13, 2012). "Behind Instagram's Success, Networking the Old Way". The New York Times. Retrieved April 12, 2017.

[[వర్గం:సామా జిక మాధ్యమాలు]]