ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ ఆక్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ ఆక్ట్ (ఆంగ్లం: Immoral Traffic Prevention Act) అనేది మనుషులను అక్రమంగా తరలించి వారి చేత వ్యభిచారం, అడుక్కోవటం లాంటి సాంఘిక దురాచారాలలోకి తొయ్యటాన్ని నిరోధించే చట్టం.

చరిత్ర[మార్చు]

భారతదేశంలో పిల్లలనీ, ఆడవాళ్ళనీ ముఖ్యంగా వ్యభిచారం కోసం తరలిస్తారు. 1956లో సీత(SITA - Suppression of immoral trafficking act) ను ఈ విధంగా వ్యభిచారంలోకి బలవంతంగా వచ్చే స్త్రీలను కాపాడటానికి అమలులోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం వ్యభిచారం చేసే వ్యక్తులు వారి పనులను వ్యక్తిగతంగా చేసుకోవచ్చు కానీ న్యాయపరంగా మాత్రం అది నేరం. ఒక బీబీసీ వ్యాసం ప్రకారం భారతదేశంలో వ్యభిచారం అనేది నేరం. భారత చట్టం ప్రకారం వ్యభిచారం అనేది వొళ్ళు అమ్ముకోటానికి సమానార్ధకం ఇవ్వదు. జనసంచారం ఉన్న ప్రాంతాలలో వ్యభిచారం నేరం. వ్యభిచారాన్ని నడిపే సంస్థలూ చట్ట విరుద్ధమే. వ్యక్తిగతంగా, ఆ వ్యక్తి పరిధి వరకే వొళ్ళు అమ్ముకోడాన్ని చట్టం సమర్ధిస్తుంది. కానీ స్వలింగ సంపర్కం సెక్షన్ 377 ప్రకారం నేరం. జన సంచారం ఉన్న ప్రదేశానికి కనీసం 200 గజాల పరిధిలో వ్యభిచారం చేయకూడదు. ఇతర కార్మికులకు వర్తించే ఏ వెసులుబాట్లూ, ఈ వ్యభిచారులకి అందవు. కానీ శోషణ నుండి సంరక్షింపబడే, కాపాడబడే నియమాలు వీళ్ళకు వర్తిస్తాయి. ఇతర పౌర హక్కులన్నీ వీళ్ళకీ వర్తిస్తాయి. [1]

సీత ను భారత చట్ట న్యాయాలయాలు అమలు పరచలేదు. సెక్స్ వర్కర్లు మామూలుగా చేసే చిన్న గొడవలను, జనాల మధ్య అసభ్యంగా వ్యవహరించడాన్ని శిక్షించడానికే ఈ చట్టాన్ని వాడారు. ఈ మధ్యనే సీత ను మెరుగుపరిచి పిత(PITA - Prevention of immoral trafficking) అనే కొత్త చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం అమలు పరిస్తే సెక్స్ వర్కర్లు చేసే పనులు నేరం కింద పరిగణిస్తారు. ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఈ చట్టాన్ని తేవటానికి చాలా కృషి చేసింది. ఎన్నో అడ్డంకులను ఈ చట్టం ఎదుర్కొనింది. కలకత్తాలోని ఒక స్వచ్ఛంద సంస్థ సెక్స్ వర్కర్ల కోసమని జీవిత బీమాను 250 మందికి ఇచ్చింది.

ఇన్నేళ్ళలో భారతదేశంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఎయిడ్స్ మహమ్మారి పెరిగిపోతున్న తరుణంలో సెక్స్ వర్కర్లకీ వాళ్ళ పిల్లలకీ ఇది ఎంతో మేలు చేస్తుంది.

ఈ ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ ఆక్ట్ లేదా పిత అనేది 1986లో అమలులోకి వచ్చింది. 1950లో న్యూయార్క్ లో సెక్స్,బానిసత్వం, అడుక్కోవటం కోసం మనుషుల అక్రమ తరలింపును అణిచివేసేందుకు ఐక్య రాజ్య సమితి నిర్ణయించింది. తదనుగుణంగా సీత అనే చట్టం 1956 లో రూపొందింది.

ముఖ్యాంశాలు[మార్చు]

ఈ చట్టంలోని ముఖ్యాంశాలు

సెక్స్ వర్కర్
  • సెక్స్ వర్కర్, ఒక వ్యభిచారి శృంగారం కోసం అడిగినా, ప్రేరేపించినా శిక్షార్హురాలు. కాల్ గల్స్ వాళ్ళ ఫోన్ నంబర్లను పబ్లిక్ గా ఎక్కడా ప్రచురించరాదు. (శిక్ష : ఆరు నెలలు జైలు శిక్ష, జరిమానా)
  • జనసంచారం ఉన్న పబ్లిక్ స్థలాలలో శృంగారానికి పాల్పడితే శిక్ష. (3 నెలలు, జరిమానా)
సెక్స్ కోసం సెక్స్ వర్కర్ వద్దకు వచ్చిన వ్యక్తి
  • జన సంచారం ఉన్న పరిధికి 200 గజాలలోపు వ్యభిచారానికి పాల్పడితే శిక్ష. (3 నెలల్ వరకు జైలు శిక్ష). ఒక వేళ సెక్స్ వర్కర్ వయసు 18 కన్నా తక్కువ అయితే శిక్ష (7 నుండి 10 ఏళ్ళ జైలు శిక్ష)
వ్యభిచారాన్ని సమర్ధించే నిర్వాహకులు, బ్రోకర్లు
  • ఒక సెక్స్ వర్కర్ సంపాదన మీద బ్రతకడం నేరం. (2 ఏళ్ళ వరకూ జైలు, జరిమానా)
  • వేశ్యగృహాన్ని నడిపే వ్యక్తికి శిక్ష ఉంది (మొదటి సారి 1 నుండి 3 ఏళ్ళ జైలు శిక్ష, జరిమానా) వేశ్యాగృహం వద్ద పట్టుబడినా నేరం (7 ఏళ్ళ వరకూ జైలు)
  • హోటల్లో వ్యభిచారం జరిగితే అది నేరం, వేశ్యగృహం గా పరిగణన.
  • వ్యక్తులను కలిగి ఉండటం లేదా కొనటం (3 నుండి 7 ఏళ్ళ జైలు, జరిమానా)
  • శరణార్ధులైన సెక్స్ వర్కర్లకు సరియయిన సంరక్షణ కలిపించి వారిని సురక్షిత గృహాలలో ఉంచడం ప్రభుత్వ బాధ్యత.

సినిమాలలో[మార్చు]

  • ఈ చట్టం ద్వారా లాభం పొందిన బంగారు లక్ష్మి అనే ఒక అమ్మాయి కథను స్ఫూర్తిగా తీసుకుని నాగేష్ కుకనూర్ బంగారు లక్ష్మి అనే సినిమా తీసారు.

వనరులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://news.bbc.co.uk/2/hi/talking_point/debates/south_asian_debates/1459792.stm. Missing or empty |title= (help)